పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా నటిస్తున్న చిత్రం ఓజీ. ప్రముఖ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎన్నో అంచనాల మధ్య సెప్టెంబర్ 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో.. ఇమ్రాన్ హస్మి , శ్రియా రెడ్డి, ప్రకాష్ రాజ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఇమ్రాన్ హస్మీ ను విలన్ గా ఇంట్రడ్యూస్ చేస్తూ రిలీజ్ చేసిన గ్లింప్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. “డియర్ ఓజీ.. నిన్ను కలవాలని.. చూడాలని.. చంపాలని.. ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను.. హ్యాపీ బర్తడే ఓజీ.. నీ ఓమీ ” అంటూ విడుదలైన ఈ గ్లింప్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.
యాక్షన్, మాస్ పెర్ఫార్మన్స్ తో తెరకెక్కబోతున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ కి డిప్యూటీ సీఎంగా మారిన తర్వాత ఆయన నుంచి రాబోతున్న రెండవ చిత్రం కావడంతో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. దీనికి తోడు ఈ సినిమాకి అక్కడ భారీ డిమాండ్ ఏర్పడింది. ఇప్పటికే 35 వేలకు పైగా టికెట్లు అమ్ముడుపోయి సంచలనం సృష్టిస్తోంది ఓజీ. అసలు విషయంలోకి వెళ్తే.. ప్రస్తుతం ఈ సినిమా యూఎస్ మార్కెట్లో దంచి కొడుతోంది అని అక్కడ లేటెస్ట్ రికార్డ్స్ బుకింగ్ చెబుతున్నాయి.. అలా ఇప్పటివరకు 35 వేలకు పైగా టికెట్స్ అమ్ముడుపోయినట్లు సమాచారం. మొత్తానికైతే ఓజీ హవా ఓవర్సీస్ లో గట్టిగానే ఉందని చెప్పవచ్చు.
ఇదిలా ఉండగా.. మరొకవైపు సుజీత్ సౌత్ ను మొదలుకొని నార్త్లో కూడా తన మార్కెట్ ను పెంచుకోవడానికి గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే మాస్ యూత్ కి కనెక్ట్ అయ్యేలా యాక్షన్ ఓరియంటెడ్ డ్రామాగా ఈ సినిమాని రూపొందించినట్లు ఇటీవల విడుదలైన గ్లింప్స్ చూస్తే అర్థమవుతుంది. ఇక త్వరలోనే ఈ సినిమా ట్రైలర్ ని కూడా రిలీజ్ చేసి సినిమాపై మరింత అంచనాలు పెంచబోతున్నారు డైరెక్టర్. మరి ఈ సినిమా విడుదల తర్వాత ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
పవన్ కళ్యాణ్ తదుపరి చిత్రాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఓజీ సినిమా షూటింగ్ తో పాటు మరొకవైపు తనకు గబ్బర్ సింగ్ లాంటి సూపర్ హిట్ సక్సెస్ అందించి.. కెరియర్ ను ప్రసాదించిన డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నారు. అదే ఉస్తాద్ భగత్ సింగ్. ఇందులో ప్రముఖ యంగ్ బ్యూటీ శ్రీలీలా హీరోయిన్ గా నటిస్తోంది. భారీ అంచనాల మధ్య వచ్చే ఏడాది ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమాలో ఒక పవర్ఫుల్ స్పెషల్ నెంబర్ ఉండబోతుందని.. ఈ పాట షూటింగు శనివారం రోజు ప్రారంభం కాబోతున్నట్లు సమాచారం. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ మాస్ ఎనర్జిటిక్ పెర్ఫార్మన్స్ తో ఆడియన్స్ ఆకట్టుకోవడానికి సిద్ధమవుతున్నారని తెలుస్తోంది.