హీరోయిన్ నివేదా పేతురాజ్ గురించి అందరికీ తెలిసిందే. తెలుగు, తమిళ భాషల్లో పలు చిత్రాల్లో నటించిన ఆమె మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ బేస్ దక్కించుకున్న అమ్మడు.. ఇప్పుడు వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. ఇప్పటికే ఎంగేజ్మెంట్ కూడా జరగ్గా, తాజాగా తన భర్తను పరిచయం చేశారు.
తనకు కాబోయే భాగస్వామి రాజ్ హిత్ ఇబ్రాన్ ను ఇంట్రడ్యూస్ చేస్తూ సోషల్ మీడియాలో పిక్స్ ను షేర్ చేశారు నివేదా. సన్నిహితంగా ఉన్న పిక్ ను పోస్ట్ చేశారు. ఇప్పటి నుంచి జీవితమంతా ప్రేమమయమే.. అంటూ క్యాప్షన్ తో ప్రియుడితో ఉన్న ఫొటోలను పంచుకున్నారు. వీటికి లవ్ సింబల్స్ తో పాటు రింగ్ ఎమోజీని కూడా యాడ్ చేశారు.
అలా ఎంగేజ్మెంట్ కూడా జరిగినట్లు ఇన్ స్టా స్టోరీలో పరోక్షంగా తెలిపారు. దీంతో సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. నివేదా పెళ్లి చేసుకోనున్నారనే విషయం తెలియగానే ఫ్యాన్స్ , నెటిజన్లు, సినీ ప్రియులు బెస్ట్ విషెస్ తెలుపుతున్నారు. అదే సమయంలో నివేదాకు కాబోయే భర్త వివరాలు తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు.
అయితే రాజ్ హిత్ ఇబ్రాన్ దుబాయ్ కు చెందిన బిజినెస్ మ్యాన్ అని ప్రచారం జరుగుతోంది. త్వరలోనే నివేదాతో వివాహ బంధంలోకి అడుగు పెట్టనున్నారని సమాచారం. 2025 చివర్లో నివేదా, ఇబ్రాన్ పెళ్లి వేడుక జరగనున్నట్లు తెలుస్తోంది. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో మ్యారేజ్ జరగనున్నట్లు సినీ వర్గాల్లో టాక్.
వీరి పెళ్లికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వచ్చే అవకాశం ఉంది. కాగా, కోలీవుడ్ కు చెందిన నివేదా పేతురాజ్.. 2016లో తమిళ సినిమా ఓరు నాళ్ కోత్తుతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో యంగ్ హీరో శ్రీ విష్ణు సరసన నటించి మెంటల్ మదితో తెలుగు ప్రేక్షకులను పలకరించారు అమ్మడు.
ఆ మూవీ తరువాత చిత్రలహరి, బ్రోచేవారెవరురా, అల వైకుంఠపురములో, రెడ్, విరాటపర్వం, పాగల్, దాస్ కా ధమ్కీ, బ్లడీ మేరీ వంటి పలు సినిమాల్లో నటించిన నివేదా.. ఇప్పుడు పార్టీ మూవీ యాక్ట్ చేస్తున్నారు. అయితే యాక్టింగ్ లోనే కాదు కారు రేసింగ్‌లో కూడా సత్తా చాటిన అమ్మడు.. మధురైలో జరిగిన బ్యాడ్మింటర్ ఛాంపియన్‌షిప్ లో మిక్స్‌డ్ డబుల్స్ కేటగిరీలో కప్ కొట్టి అందరినీ ఆశ్చర్యపరిచారు.