స్టార్ హీరోయిన్ అయ్యే క్వాలిటీస్ ఉన్నా కూడా సినిమాల ఎంపిక వల్లో లేదా మరో కారణాల వల్ల కొందరు భామలు వెనక పడుతుంటారు. ఇలాంటి వారి లిస్ట్ చాలా పెద్దదిగానే ఉంటుంది. అందులో కచ్చితంగా ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ కూడా ఉంది. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో తెలుగులో పాపులారిటీ సంపాదించిన నిధి అగర్వాల్ తమిళ్ లో భూమి, ఈశ్వరన్ సినిమాల్లో నటించి మెప్పించింది. ఇక 2022లో గల్లా అశోక్ తో హీరో సినిమా చేసింది అమ్మడు. ఆ తర్వాత మళ్లీ తెలుగులో పెద్దగా ఛాన్స్ లు రాలేదు.
ఐతే ఇప్పుడు ఒకేసారి రెండు భారీ సినిమాలతో అమ్మడు రాబోతుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో హరి హర వీరమల్లు సినిమా చేస్తున్న నిధి ప్రభాస్ తో రాజా సాబ్ సినిమా కూడా చేస్తుంది. వీరమల్లు సినిమాలో నిధి అగర్వాల్ ఫిమేల్ లీడ్ గా నటించడం విశేషం. ఏ.ఎం రత్నం నిర్మిస్తున్న వీరమల్లు సినిమా నాలుగేళ్లుగా తీస్తూనే ఉన్నారు. క్రిష్ డైరెక్షన్ లో మొదలైన ఈ సినిమా ఇప్పుడు జ్యోతికృష్ణ చేతుల్లోకి వచ్చింది. కొన్నాళ్లుగా రిలీజ్ విషయంలో సందిగ్ధంగా ఉన్న వీరమల్లు సినిమాను ఫైనల్ గా జూన్ 12న రిలీజ్ లాక్ చేశారు. పవన్ కళ్యాణ్ ఈ సినిమాకు చేయాల్సిన పనులన్నీ ఈమధ్యనే పూర్తి చేశాడని తెలుస్తుంది. ఐతే ఈ సినిమా పవన్ కళ్యాణ్ కి ఎంత ఉపయోగపడుతుందో కానీ హీరోయిన్ నిధి అగర్వాల్ కి మాత్రం కచ్చితంగా ప్లస్ అయ్యేలా ఉంది. నిధి లుక్స్ యాక్టింగ్ ఇవన్నీ వీరమల్లుకి సపోర్ట్ చేసేలా ఉన్నాయని తెలుస్తుంది.
వీరమల్లు సినిమాతో పాటుగా ప్రభాస్ రాజా సాబ్ సినిమాను కూడా చేస్తుంది నిధి అగర్వాల్. తెలుగులో మళ్లీ తిరిగి ఫాం లోకి రావాలని చూస్తున్న నిధి వీరమల్లు, రాజా సాబ్ సినిమాలతో సూపర్ కంబ్యాక్ ఇవ్వాలని చూస్తుంది. మరి అమ్మడు కోరినట్టుగా రిజల్ట్ వస్తుందా లేదా అన్నది చూడాలి. కోలీవుడ్ లో నిధి అగర్వాల్ కి స్టార్ క్రేజ్ వచ్చింది. ఐతే అక్కడ కూడా ఎందుకో అమ్మడికి సడెన్ గా అవకాశాలు కరువయ్యాయి. ఐతే ఒక సూపర్ హిట్ సినిమా పడితే మాత్రం నిధి తిరిగి మళ్లీ ట్రాక్ ఎక్కాలని చూస్తుంది. కచ్చితంగా నిధికి ఆ స్కోప్ ఉంటుందని అంటున్నారు సినీ విశ్లేషకులు.