సోషల్ మీడియాపై విధించిన బ్యాన్ ను నేపాల్ ప్రభుత్వం సోమవారం మధ్యాహ్నం ఆగమేఘాల మీద తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. మధ్యాహ్నమే బ్యాన్ విధించిన సోషల్ మీడియా సంస్థలు పని చేస్తున్నప్పటికి అయ సోమవారం అర్థరాత్రి వేళలో నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి ఇంటిపై రాళ్లు రువ్వటం గమనార్హం. ఈ నేపథ్యంలో పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. సోషల్ మీడియా సంస్థలపై బ్యాన్ విధింపు కారణంగా చేపట్టిన ఆందోళనలు తీవ్ర రూపం దాల్చటం.. వాటిని కంట్రోల్ చేసేందుకు భద్రతా సిబ్బంది ఎంట్రీ ఇవ్వటం.. వారు జరిపిన కాల్పుల్లో ఇరవై మంది ప్రాణాలు కోల్పోవటం తెలిసిందే.
అయితే.. సోషల్ మీడియాపై బ్యాన్ విధించాలన్న ఆలోచన నేపాల్ ప్రభుత్వానికి ఎందుకు వచ్చింది? బ్యాన్ దిశగా నేపాల్ ప్రభుత్వం అడుగులు ఎందుకు వేయాల్సి వచ్చింది? ఈ ఉదంతం ఇతర దేశాలకు ఎలాంటి గుణపాఠాన్ని నేర్పాయి అన్న విషయంలోకి వెళితే.. కొద్దిరోజుల క్రితం నేపాల్ సుప్రీంకోర్టు ముందుకు ఒక పిటిషన్ వచ్చింది. విద్వేషపూరిత ప్రసంగాలు.. ఫేక్ ప్రొఫైల్స్.. సైబర్ నేరాలు.. ఫేక్ న్యూస్ వ్యాప్తికి సంబంధించిన కేసులకు సంబంధించిన పిటిషన్లు సుప్రీంకోర్టు ముందుకు వచ్చాయి.
ఈ కేసుల విచారణ వేళ సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. దీని ప్రకారం నేపాల్ ప్రభుత్వ ఐటీ కమ్యూనికేషన్ చట్టం ప్రకారం సోషల్ మీడియా సంస్థలన్నీ కూడా తమ వివరాల్ని రిజిస్టర్ చేసుకోవాలని గత నెల 28న ఆదేశాలు జారీ చేసింది. దీని కోస రెండు వారాలు గడుపును ఇచ్చింది కూడా. అలా రిజిస్ట్రేషన్ చేసుకున్న సంస్థలు.. ప్రభుత్వం కోరిన సమాచారాన్ని అందించాల్సి ఉంటుంది. అభ్యంతరకర పోస్టుల్ని తొలగించాల్సి ఉంటుంది. అంటే.. ప్రభుత్వం వద్ద తమ వివరాల్ని రిజిస్ట్రేషన్ చేసుకున్న సంస్థల్ని నేపాల్ ప్రభుత్వం ప్రభావితం చేస్తుంది. అంతేకాదు.. ప్రభుత్వం.. పౌరులు ఇచ్చే లీగల్ నోటీసులకు ఆయా సంస్థలు స్పందించాల్సి ఉంటుంది. ఇలాంటి వేళ.. నేపాల్ లో పాపులర్ అయిన సోషల్ మీడియాసంస్థల్లో కొన్ని మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకున్నాయి. అలా రిజిస్ట్రేషన్ చేసుకున్న సోషల్ మీడియా సంస్థలేవంటే..
టిక్ టాక్ – విట్క్ – వైబర్ – నిబంజ్ – పోపో లైఫ్ – టెలిగ్రామ్ – గ్లోబల్ డైరీ . ఈ మొత్తం జాబితాలో టెలిగ్రామ్..గ్లోబల్ డైరీల దరఖాస్తులకు ఆమోదం లభించాల్సి ఉంది. మరోవైపు సోషల్ మీడియాలో దిగ్గజాలైన ఫేస్ బుక్.. ఎక్స్.. యూట్యూబ్ తో సహా మరో 26 సోషల్ మీడియా ప్లాట్ ఫాంలు మాత్రం రిజిస్టర్ చేసుకోలేదు. మరోవైపు ఈ సంస్థలన్నీ కూడా భారతదేశంలో మాత్రం ఇదే తరహా నిబంధనలకు ఓకే చెప్పి.. నేపాల్ లో మాత్రం అందుకు భిన్నంగా రియాక్టు కావటంపై అక్కడి ప్రభుత్వం ఈ సోషల్ మీడియా సంస్థలపై బ్యాన్ విధిస్తూ ఈ నెల మూడున నిర్ణయం తీసుకుంది. దీనిపై నేపాల్ యూత్ లో తీవ్రమైన ఆగ్రహానికి గురయ్యేలా చేసింది.
ఈ నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న చర్య భావప్రకటన స్వేచ్ఛకు విఘాతం కల్పిస్తుందంటూ జెన్ జెడ్ (30 ఏళ్ల లోపు వారు) టిక్ టాక్ లాంటి అందుబాటులో ఉన్న సోషల్ మీడియా ఫ్లాట్ ఫాం మీద ుద్యమాన్ని లేవనెత్తారు. సోమవారం ఉదయం నుంచి ఒక్కొక్కరుగా రోడ్ల మీదకు వచ్చినోల్లు మధ్యాహ్నానానికి సుమారు 12 వేల మంది యువకులు నిరసనల్లో పాల్గొన్నారు. దీంతో నేపాల్ రాజధాని కాఠ్మాండు ప్రధాన రహదారులు జనసంద్రంగా మారాయి. ఆందోళకారులు క్రమంగా పారల్మెంట్ భవనంవైపు దూసుకెళ్లారు. కొందరు యువకులు గేట్లు ఎక్కి.. పార్లమెంట్ ప్రాంగణంలోకి చొచ్చుకెళ్లారు. నేపాల్ చరిత్రలో ఆందోళనకారులు పార్లమెంట్ ప్రాంగణంలోకి చొచ్చుకురావటం ఇదే తొలిసారి కావటం గమనార్హం. అక్కడున్న భద్రతాబలగాలు.. సైన్యం.. వాటర్ కెనాన్ లు.. భాష్పవాయువు గోళాలతో వారిని అడ్డుకునే ప్రయత్నం చేశాయి. ఈ సందర్భంగా ఆందోళనకారులు సైతం తమ వద్ద పడిన బాష్పవాయు గోఆలు.. రాళ్లు.. చెట్టు కొమ్మలతో ఎదురుదాడికి దిగటంతో రబ్బర్ బుల్లెట్లతో కాల్పులు జరపాల్సి వచ్చింది. దీంతో 20 మంది మరణించగా.. పది మంది తీవ్రగాయాలతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. రాళ్లు రువ్విన ఘటనలో 178 మంది నేపాల్ పోలీసులు.. 30 మంది సాయుధ బలగాలకు గాయాలయ్యాయి. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో ఫేస్ బుక్ లాంటి సోషల్ మీడియా ప్లాట్ ఫాంలు తిరిగి ప్రారంభం కావటం గమనార్హం.అర్థరాత్రి వేళ ఆ దేశ ప్రధాని ఓలి నివాసంపై రాళ్లు రువ్వటం తెలిసిందే. యువత చేపట్టిన ఆందోళన సోమవారం అర్థరాత్రి వేళకు నేపాల్ వ్యాప్తంగా విస్తరించింది. ఏడు జిల్లాల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నట్లు చెబుతున్నారు. యువత చేపట్టిన ఆందోళనకు మాజీ ప్రధాని పుష్పకమల్ దహాల్ మద్దతు పలికారు. ఆసక్తికర పరిణామం ఏమంటే.. సోషల్ మీడియామీద విధించిన బ్యాన్ కు వ్యతిరేకంగా మొదలైన ఆందోళన.. బ్యాన్ ఎత్తేసిన తర్వాత కూడా తగ్గకపోగా.. ప్రభుత్వ విధానాలపై వ్యతిరేకంగా మారాయి. యువత నిర్వహించిన ఆందోళనలో 20 మంది మరణించిన నేపథ్యంలో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలకు తెర తీశాయి. నేపాల్ ప్రధాని తన పదవి నుంచి తొలగాలంటూ ఆందోళనలు మరింత పెరిగాయి. తాజా పరిణామాల నేపథ్యంలో హోంమంత్రి తన పదవికి రాజీనామా చేశారు. అయితే.. ప్రధానమంత్రి తన పదవికి రాజీనామా చేయాలన్న డిమాండ్ వినిపిస్తోంది. ఇదంతా చూస్తే.. ఎక్కడో మొదలై.. మరెక్కడికో విషయం వెళ్లినట్లుగా అనిపించకమానదు.
సోషల్ మీడియా వేదికలపై బ్యాన్ విధిస్తూ నేపాల్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆ దేశంలోని యువతలో ఆగ్రహావేశాల్ని రగిలేలా చేయటంతో పాటు వీధుల్లోకి వచ్చి.. తీవ్రమైన ఆందోళనలు చేయటం తెలిసిందే. భద్రతా సిబ్బంది జరిపిన కాల్పుల్లో పెద్ద ఎత్తున పౌరులు (ఒక బాలుడితో సహా ఇరవై మంది) మరణించటంతో పరిస్థితి పూర్తిగా అదుపు తప్పేలా చేసింది. మరో ఆసక్తికరమైన అంశం ఏమంటే.. సోషల్ మీడియాపై నేపాల్ సర్కారు విధించిన బ్యాన్ కు వ్యతిరేకంగా మొదలైన ఉద్యమం.. చివరకు కొత్త రూపు దిద్దుకొని.. నేపాల్ ప్రభుత్వం రాజీనామా చేయాలన్న డిమాండ్ తెర మీదకు వచ్చింది.
ప్రభుత్వం విధించిన కర్ఫ్యూను సైతం లెక్క చేయకుండా వీధుల్లోకి వచ్చి.. సర్కారు తీరును తీవ్రంగా వ్యతిరేకించటం లాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. అయితే.. ఇదంతా పక్కాగా ప్రిపేర్ చేసిన స్క్రిప్టు ఆధారంగానే జరుగుతున్నాయా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. సోషల్ మీడియా బ్యాన్ మీద మొదలైన ఆందోళనలు.. నిరసనలు ప్రభుత్వం దిగిపోవాలనే డిమాండ్ రావటాన్ని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఈ వాదనకు బలం చేకూరేలా నేపాల్ వెబ్ సైట్లు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ‘‘సోషల్ మీడియా నిషేధానికి వ్యతిరేకండా జరిగిన ఉద్యమం కాస్తా.. కేపీ శర్మ ఓలి దిగిపో’ నినాదం వైపునకు ఎందుకు వెళ్లినట్లు? అన్నది ప్రశ్నగా సంధిస్తున్నారు. నేపాల్ ఆందోళన వెనుక అమెరికా పాత్ర ఉందని నేపాల్ పత్రికల అనుబంధ వెబ్ సైట్లలో కథనాలు వెలువడటాన్ని ప్రస్తావిస్తున్నారు.
ఇంతకూ అమెరికాకు ఒరిగేదేంటి? అన్న ప్రశ్నకు సమాధానం వెతికితే.. ఇటీవల కాలంలో ఓలి చైనాకు దగ్గర కావటాన్ని గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా నేపాల్ లో అమెరికా ప్రాజెక్టులను చేపట్టింది. ఆర్థిక.. దౌత్య మద్దతును పెంచింది. మిలీనియం చాలెంజ్ కార్పొరేషన్ వంటి పలు సంస్థలు రూ.లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులను నిర్వహిస్తున్న విసయాన్ని గుర్తు చేస్తున్నారు.ఇలా నేపాల్ లో పెద్ద ఎత్తున అమెరికా ఆర్థిక కార్యకలాపాలు చేస్తున్న వేళ.. నేపాల్ అధ్యక్షుడు తీసుకున్న నిర్ణయం అమెరికా ప్రాజెక్టులకు బ్రేకులు వేసేలా మారినట్లుగా అక్కడి మీడియా విశ్లేషిస్తోంది. ఈ కారణాలన్ని కలిసి ఓలి కుర్చీకే ఎసరు పెట్టే వరకు వెళ్లినట్లుగా చెబుతున్నారు. మరి.. ఈ పరిస్థితిని ఓలి ఎలా డీస్తారో చూడాల్సిందే.