ఏ దేశంలోనైనా రాజరికం.. ప్రజాస్వామ్యం ఉంటాయి… కానీ, నేపాల్‌లో రాజరికం.. మావోయిజం.. ప్రజాస్వామ్యం.. మూడూ ఉన్నాయి. మొన్నమొన్నటి వరకు నేపాల్‌కు రాజు ఉండేవారు. ఆయనను వ్యతిరేకిస్తూ.. మావోయిస్టులు ఉండేవారు. కాలక్రమంలో మావోయిస్టులు ప్రజాస్వామ్యంలోకి వచ్చి రాజును దించేశారు. ప్రభుత్వంలోనూ భాగమయ్యారు. ఇప్పుడు వారిలో వారే గొడవ పడుతూ దేశాన్ని మళ్లీ సంక్షోభంలోకి నెట్టారు. గత ఏడాది జూలై వరకు ప్రధానిగా మాజీ మావోయిస్టు ప్రచండ (పుష్ప కుమార్ దహల్) ఉండగా.. ఆయనను తప్పించి కేపీ శర్మ ఓలీ పదవిలోకి వచ్చారు. 14 నెలల్లోనే ఆయన ప్రజాగ్రహానికి గురయ్యారు.
రాజు నుంచి ప్రజల్లోకి నే‘పాలన’
నేపాల్‌ను హిమాలయ రాజ్యం అంటారు. 2006 వరకు ఈ దేశంలో రాజరికం కొనసాగింది. మావోయిస్టుల పోరాటంతో రాజరికం అంతమైంది. అప్పటికి రాజు జ్ఞానేంద్ర ఉండేవారు. మావోయిస్టులూ ప్రజాస్వామ్యంలోకి వచ్చేశారు. ఇది ప్రపంచాన్నే ఆకర్షించిన సంఘటన. ఇక అప్పటినుంచి అంటే దాదాపు 20 ఏళ్లుగా నేపాల్‌లో ప్రజాస్వామ్యం కొనసాగుతోంది. కానీ, తరచూ ప్రభుత్వాలు, ప్రధానులు మారిపోతున్నారు.
భారత్‌తో బలమైన బంధం
నేపాల్ ప్రపంచంలోనే ఏకైక హిందూ దేశం. భారతదేశంలో విలీనం అవుతామని 1950ల్లో ప్రతిపాదన రాగా అప్పటి మన ప్రధాని నెహ్రూ అంగీకరించలేదని చరిత్రకారులు చెబుతుంటారు. విశాల దృక్పథం ఉన్న నెహ్రూ నేపాల్‌ను ఒక గణతంత్ర దేశంగానే చూశారని పేర్కొంటుంటారు. కాగా, భారతీయులకు పాస్ పోర్టు అవసరం లేని దేశం నేపాల్. సిక్కిం నుంచి ఉత్తరాఖండ్ వరకు ఉన్న 1,751 కిలోమీటర్ల సుదీర‍్ఘ సరిహద్దుల్లో స్వేచ్ఛగా రాకపోకలు సాగుతుంటాయి. బెంగాల్, సిక్కిం, బిహార్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌తో నేపాల్ సరిహద్దులు కలిగి ఉంది. భారత్ లో గూర్ఖాలుగా చాలామంది నేపాలీలు పనిచేస్తుంటారు.
-2001లో నేపాల్ రాజుగా బీరేంద్ర ఉండేవారు. ఈయన సోదరుడు జ్ఞానేంద్ర. కాగా, బీరేంద్రను ఆయన భార్యను వారి కుమారుడు దీపేంద్ర కాల్చి చంపాడు. ఆ తర్వాత తానూ కాల్చుకుని ఆస్పత్రిలో చనిపోయాడు. కాగా, ఇతర కుటుంబ సభ్యులు ముందుకురాకపోవడంతో చివరకు జ్ఞానేంద్ర రాజు అయ్యారు. మావోయిస్టుల ఉద్యమంతో ఆయన 2006లో దిగిపోయారు. 2007 జనవరితో రాజరికం అంతమైంది. 2008 మే 28న రాజ్యాన్ని రద్దు చేసి, ఫెడరల్ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ నేపాల్‌గా ప్రకచుకున్నారు.
ఆ స్టార్ హీరోయిన్ నేపాలీనే..
బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా పేరుతెచ్చుకున్న మనీషా కొయిరాలా నేపాలీనే. ఈమె తాత బీపీ కొయిరాలా నేపాల్ ప్రధానిగా పనిచేశారు. మాజీ రాజు బీరేంద్ర భారతదేశంలోనే చదువుకున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే.. భారత్‌తో అనేక దేశాలు సరిహద్దులు పంచుకుంటున్నాయి. వాటితో వేటితోనూ నేపాల్‌తో ఉన్నంత సాంసృ‍్కతిక అనుబంధం లేదు. ఇప్పుడు ఆ దేశంలో పరిణామాలను భారత్ జాగ్రత్తగా గమనించాల్సిన అవసరం ఉంది.
నేపాల్‌లో ఆందోళనలు తీవ్ర హింసాత్మకంగా మారాయి. మాజీ ప్రధాని ఝలనాథ్ ఖానాల్ ఇంటికి నిరసనకారులు నిప్పంటించడంతో ఆయన భార్య రాజ్యలక్ష్మి సజీవదహనమయ్యారు. ప్రధాని ఓలీ నివాసంపై కూడా దాడి జరిగింది. మంత్రులపై దాడులు జరుగుతున్నాయి. ఆర్థిక మంత్రి బిష్ణు ప్రసాద్‌పై దాడి జరిగింది. మాజీ ప్రధాని షేర్ బహదూర్ దేవుబా దంపతులను కూడా ఆందోళనకారులు వదల్లేదు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయాలని పిలుపునివ్వడంతో పరిస్థితి మరింత దిగజారుతోంది. ఢిల్లీ-కాఠ్మాండూ విమానాలను ఎయిరిండియా రద్దు చేసింది.
అవినీతి, సోషల్ మీడియాపై నిషేధానికి వ్యతిరేకంగా నేపాల్‌లో జరుగుతోన్న ఆందోళనల్లో అత్యంత అమానుష ఘటన చోటుచేసుకుంది. నేపాల్ మాజీ ప్రదాన మంత్రి ఝలనాథ్ ఖానాల్ నివాసానికి నిరసనకారులు నిప్పటించడంతో మంటల్లో చిక్కుకున్న ఆయన భార్య రాజ్యలక్ష్మి చిత్రాకర్ సజీవదహనమయ్యారు. రాజధాని కాఠ్మాండులోని దల్లు ప్రాంతంలో ఝాలనాద్ నివాసంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. తీవ్ర గాయాలతో కీర్తిపూర్‌లోని ఆసుపత్రిలో చేరిన ఆమె చికిత్స పొందుతూ కన్నుమూసినట్టు కుటుంబ వర్గాలు తెలిపాయి. నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ వ్యక్తిగత నివాసాన్ని కూడా ఆందోళకారులు మంటల్లో తగులుబెట్టారు.
సామాజిక మాధ్యమాలపై ప్రభుత్వ నిషేధంతో రగిలిపోయిన నేపాల్ యువత చేపట్టిన ఆందోళనలు తీవ్రరూపం దాల్చాయి. రెచ్చిపోతున్న ఆందోళనకారులు అతి దారుణంగా ప్రవర్తిస్తున్నారు. ఆ దేశ మంత్రులను వీధుల్లో ఉరికెత్తించి ఉరికెత్తించి దాడిచేస్తోన్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కర్ఫ్యూను సైతం ఉల్లంఘిస్తూ.. పోలీసులు, సైన్యంతో ఘర్షణకు దిగుతున్న వీడియోలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. నేపాల్ ఆర్థిక మంత్రి బిష్ణు ప్రసాద్ పౌడేల్ (65)పై ఆందోళనకారులు దాడికి దిగారు. ఆందోళనకారుల నుంచి తప్పించుకోడానికి వీధుల్లో పరిగెత్తుతోన్న ఆయనను ఎదురుగా వచ్చిన ఒక యువకుడు ఎగిరితన్నాడు. దాంతో పట్టుకోల్పోయి పక్కనే ఉన్న ఓ గోడపై ఆయన పడిపోయారు
నేపాల్‌లో దారుణం.. మాజీ ప్రధాని భార్య సజీవదహనం
నేపాల్‌లో ఆందోళనలు తీవ్ర హింసాత్మకంగా మారాయి. మాజీ ప్రధాని ఝలనాథ్ ఖానాల్ ఇంటికి నిరసనకారులు నిప్పంటించడంతో ఆయన భార్య రాజ్యలక్ష్మి సజీవదహనమయ్యారు. ప్రధాని ఓలీ నివాసంపై కూడా దాడి జరిగింది. మంత్రులపై దాడులు జరుగుతున్నాయి. ఆర్థిక మంత్రి బిష్ణు ప్రసాద్‌పై దాడి జరిగింది. మాజీ ప్రధాని షేర్ బహదూర్ దేవుబా దంపతులను కూడా ఆందోళనకారులు వదల్లేదు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయాలని పిలుపునివ్వడంతో పరిస్థితి మరింత దిగజారుతోంది. ఢిల్లీ-కాఠ్మాండూ విమానాలను ఎయిరిండియా రద్దు చేసింది.
అవినీతి, సోషల్ మీడియాపై నిషేధానికి వ్యతిరేకంగా నేపాల్‌లో జరుగుతోన్న ఆందోళనల్లో అత్యంత అమానుష ఘటన చోటుచేసుకుంది. నేపాల్ మాజీ ప్రదాన మంత్రి ఝలనాథ్ ఖానాల్ నివాసానికి నిరసనకారులు నిప్పటించడంతో మంటల్లో చిక్కుకున్న ఆయన భార్య రాజ్యలక్ష్మి చిత్రాకర్ సజీవదహనమయ్యారు. రాజధాని కాఠ్మాండులోని దల్లు ప్రాంతంలో ఝాలనాద్ నివాసంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. తీవ్ర గాయాలతో కీర్తిపూర్‌లోని ఆసుపత్రిలో చేరిన ఆమె చికిత్స పొందుతూ కన్నుమూసినట్టు కుటుంబ వర్గాలు తెలిపాయి. నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ వ్యక్తిగత నివాసాన్ని కూడా ఆందోళకారులు మంటల్లో తగులుబెట్టారు.
సామాజిక మాధ్యమాలపై ప్రభుత్వ నిషేధంతో రగిలిపోయిన నేపాల్ యువత చేపట్టిన ఆందోళనలు తీవ్రరూపం దాల్చాయి. రెచ్చిపోతున్న ఆందోళనకారులు అతి దారుణంగా ప్రవర్తిస్తున్నారు. ఆ దేశ మంత్రులను వీధుల్లో ఉరికెత్తించి ఉరికెత్తించి దాడిచేస్తోన్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కర్ఫ్యూను సైతం ఉల్లంఘిస్తూ.. పోలీసులు, సైన్యంతో ఘర్షణకు దిగుతున్న వీడియోలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. నేపాల్ ఆర్థిక మంత్రి బిష్ణు ప్రసాద్ పౌడేల్ (65)పై ఆందోళనకారులు దాడికి దిగారు. ఆందోళనకారుల నుంచి తప్పించుకోడానికి వీధుల్లో పరిగెత్తుతోన్న ఆయనను ఎదురుగా వచ్చిన ఒక యువకుడు ఎగిరితన్నాడు. దాంతో పట్టుకోల్పోయి పక్కనే ఉన్న ఓ గోడపై ఆయన పడిపోయారు.
కానీ వెనుక నుంచి తరుముకొస్తున్న వందల మంది నిరసనకారుల నుంచి తప్పించుకుని, తన ప్రాణాలు కాపాడుకోడానికి ఆయన వెంటనే లేచి పరుగెత్తారు. అత్యంత భయానక దృశ్యాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇదే సమయంలో, మాజీ ప్రధాని షేర్ బహదూర్ దేవుబా, ఆయన సతీమణి, ప్రస్తుత విదేశాంగ మంత్రి అర్జు రాణా దేవుబాను ఆందోళనకారులు వదల్లేదు. వారిపైకూడా దాడి చేసి, కొట్టారు.
మరోవైపు, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయాలని సోషల్ మీడియాలో ఆందోళనకారులు పిలుపునివ్వడంతో పరిస్థితి మరింత అదుపుతప్పే ప్రమాదం ఉంది. ఇప్పటికే నాయకుల ఇళ్లతో పాటు పార్లమెంట్, సుప్రీంకోర్టుకు ఆందోళనకారులు నిప్పంటించారు. అయితే, ప్రజా, ప్రభుత్వ ఆస్తుల ధ్వంసాన్ని విద్యార్థి సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. వాటిని కాపాడుకునేందుకు అవి రంగంలోకి దిగాయి. ఈ ఆందోలనల్లో మంగళవారం మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. ఈ సంఖ్య 22కు చేరుకుంది. ఇక, ఢిల్లీ-కాఠ్మాండూ మధ్య విమానాలను ఎయిరిండియా రద్దు చేసింది.
మరోవైపు, ప్రధాన మంత్రి కేపీ శర్మ ఓలీ రాజీనామా చేసిన కాసేపటికే అధ్యక్షుడు రామచంద్ర పౌడల్ కూడా తప్పుకున్నారు. ఇదే సమయంలో కొత్త ప్రధాని ఎంపిక కోసం ప్రక్రియ మొదలైనట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో కాఠ్మాండూ మేయర్ బలేంద్ర షా పేరు వినిపిస్తోంది. అంతేకాదు, ఈ ఆందోళనల వెనుక ఆయన ఉన్నట్టు ప్రచారం కూడా సాగుతోంది. అందుకు ఆయన ఫేస్‌బుక్‌లో పెట్టిన ఓ పోస్ట్ ప్రచారానికి మరింత బలాన్ని ఇస్తోంది. మూడేళ్ల కిందట జరిగిన మేయర్ ఎన్నికలతోనే రాజకీయ అరంగేట్రం చేసిన బాలేంద్ర… తొలి అడుగులో విజయాన్ని అందుకున్నారు. ఆయన బెంగళూరులోని విశ్వేశ్వరయ్య టెక్నాలజీకల్ యూనివర్సిటీ నుంచి ఎంటెక్ చేయడం విశేషం.
నేపాల్‌లో ప్రభుత్వం సామాజిక మాధ్యమాలపై నిషేధం విధించడాన్ని నిరసిస్తూ ఆ దేశ యువత చేపట్టిన ఉద్యమం హింసాత్మక స్థాయికి చేరింది.వేలాది మంది జెనరేషన్ జెడ్ యువకులు సోమవారం కాఠ్మాండులో జరిగిన ప్రదర్శనలో భాగంగా పెద్ద ఎత్తున రణరంగం సృష్టించారు.
ఈ నిరసనల్లో ఇప్పటివరకు 20 మంది ప్రాణాలు కోల్పోయారు, అలాగే 300 మందికి పైగా వ్యక్తులు గాయపడ్డారు.
యువత హింసాత్మక నిరసనల ప్రభావంతో, నేపాల్ ప్రభుత్వం సామాజిక మాధ్యమాలపై తీసుకున్న నిషేధ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించింది.ఫేస్‌బుక్, ట్విటర్, వాట్సాప్ సహా 26 సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లపై ఈ నెల 4న విధించిన నిషేధం ఉపసంహరించుకున్నట్లు ప్రకటించింది.