సౌత్ స్టార్ హీరోయిన్ నయనతార ప్రస్తుతం ఒకవైపు నిర్మాతగా మారి సినిమాలను నిర్మిస్తూనే మరొకవైపు హీరోయిన్ గా సినిమాలలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఒకప్పుడు తెలుగులో చాలా సినిమాలలో నటించి మెప్పించిన నయనతార ప్రస్తుతం తమిళ సినిమా ఇండస్ట్రీలో ఫుల్ బిజీ బిజీగా గడుపుతోంది. కోలీవుడ్ డైరెక్టర్ విగ్నేష్ శివన్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ దంపతులు సరోగసి ద్వారా ఇద్దరు కవల పిల్లలకు జన్మనిచ్చారు. ఇక విగ్నేష్ శివన్ ని ప్రేమించిన తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీకి పూర్తిగా బై బై చెప్పేసి అక్కడే సెటిల్ అయిపోయింది ఈ ముద్దుగుమ్మ.
ఇది ఇలా ఉంటే గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో నయనతార ఆమె భర్త విగ్నేష్ లు విడిపోబోతున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఇద్దరి మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చాయని విడాకులు తీసుకుని విడిపోబోతున్నారు అంటూ అనేక రకాల వార్తలు వినిపించాయి. అయితే ఈ వార్తలపై తాజాగా ఆయన ద్వారా స్పందించింది. తన భర్త విగ్నేష్ శివన్ తో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేస్తూ..మాపై వచ్చే సిల్లీ న్యూస్ చూసినప్పుడు మా రియాక్షన్ ఇదే అంటూ రూమర్స్ ను గట్టిగానే ఖండించారు నయనతార. అలా నయనతార ఎట్టకేలకు తన విడాకుల వార్తలపై స్పందిస్తూ వారి వద్ద ఎలాంటి మనస్పర్ధలు లేవని వారిద్దరూ కలిసే ఉన్నారని ఒక ఫోటోతో క్లారిటీ ఇచ్చేసింది.
ఇకపోతే నయనతార సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న ప్రాజెక్టులో నటిస్తోంది. అలాగే యశ్ నటిస్తోన్న టాక్సిక్ సినిమాతో పాటు తమిళంలో పలు చిత్రాల్లో నటిస్తున్నారు. మరోవైపు డైరెక్టర్ విఘ్నేశ్ శివన్ లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇందులో ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటిస్తున్న విషయం తేలిసిందే. ఇలా ప్రస్తుతం ఒకవైపు మ్యారేజ్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తూనే కెరియర్ పరంగా ఫుల్ బిజీబిజీగా ఉన్నారు.