నారా రోహిత్ హీరోగా వెంకటేష్ నిమ్మలపూడి డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా సుందరకాండ. ఈ సినిమాలో శ్రీదేవి, వ్రితి వఘని ఫిమేల్ లీడ్ గా నటించారు. ఆగష్టు 27న థియేట్రికల్ రిలీజైన ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఫ్యామిలీ అంతా కలిసి చూసే సూపర్ ఎంటర్టైనర్ గా క్రిటిక్స్, రివ్యూయర్స్ కూడా ప్రశంసించారు. ఐతే ఆ టైం లో తెలుగు రాష్ట్రాల్లో పడిన వర్షాల వల్ల బాక్సాఫీస్ దగ్గర అంత పర్ఫార్మ్ చేయలేదు. నారా రోహిత్ కెరీర్ లో ఈ సినిమా ఒక మంచి సక్సెస్ అవుతుందని అనుకోగా టాక్ బాగున్నా వర్షాల కారణంగా సినిమా కమర్షియల్ గా వర్క్ అవుట్ కాలేదు.
ఐతే ఈ సినిమా రీసెంట్ గానే ఓటీటీలో రిలీజైంది. జియో హాట్ స్టార్ లో ఈ సినిమా డిజిటల్ రిలీజైంది. ఐతే థియేట్రికల్ రిలీజ్ ఐతే వర్షాల కారణంగా పెద్దగా చూడలేదు కానీ ఓటీటీ రిలీజ్ లో సినిమాను అందరు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన సుందరకాండ సినిమా ఆడియన్స్ ని కడుపుబ్బా నవ్విస్తుంది.
థియేట్రికల్ రిలీజ్ కూడా ఇదే రేంజ్ సక్సెస్ ఆశించారు. కానీ ఆ టైం లో ప్రకృతి సహకరించలేదు. ఐతే హిట్ సినిమా ఎక్కడైనా ప్రేక్షకాదరణ పొందుతుంది. ఈ క్రమంలోనే నారా రోహిత్ సుందరకాండ సినిమా డిజిటల్ రిలీజ్ తర్వాత సందడి చేస్తుంది. సోషల్ మీడియాలో ఈ సినిమా గురించి స్పెషల్ డిస్కషన్స్ జరుగుతున్నాయి. జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది సుందరకాండ సినిమా డిజిటల్ రిజల్ట్ మాత్రం సూపర్ సక్సెస్ అని చెప్పొచ్చు.
సుందరకాండ సినిమాకు ఓటీటీ ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ కి సూపర్ హ్యాపీగా ఉన్నారు. సినిమాలో సత్య కామెడీ కూడా ఆడియన్స్ ని సూపర్ గా ఎంటర్టైన్ చేసింది. సో మంచి సినిమా ఒకవేళ పరిస్థితుల వల్ల థియేట్రికల్ వెర్షన్ క్లిక్ అవ్వకపోయినా ఓటీటీ లో మాత్రం సినిమా సక్సెస్ అవుతుందని మరోసారి సుందరకాండ ప్రూవ్ చేసింది.
నారా రోహిత్ రీసెంట్ గా భైరవం సినిమా చేశాడు. బెల్లంకొండ శ్రీనివాస్, మంచు మనోజ్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. ఆ సినిమా యాక్షన్ మూవీగా వచ్చింది. ఐతే సుందరకాండ కంప్లీట్ ఫ్యామిలీ మూవీగా వచ్చింది. అందుకే ఆ సినిమా చూసి ఆడియన్స్ అంతా సూపర్ అనేస్తున్నారు. సుందరకాండ రెస్పాన్స్ తో నారా రోహిత్ కూడా తన నుంచి ఆడియన్స్ ఎలాంటి సినిమాలు కోరుతున్నారో క్లారిటీ వచ్చింది. సో అలాంటి సినిమాలతోనే నారా రోహిత్ నెక్స్ట్ సినిమాలు ప్లాన్ చేసుకుంటే బెటర్ అని చెప్పొచ్చు.