Nara Lokesh: తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ ఇటీవల రొట్టెల పండుగ సందర్భంగా నెల్లూరు జిల్లా పర్యటనలో బిజీగా ఉన్నారు ఈ పర్యటనలో భాగంగా ఈయన పెద్ద ఎత్తున కార్యకర్తలను కలుస్తూ సందడి చేస్తున్నారు ఈ క్రమంలోనే ఒక కార్యక్రమంలో భాగంగా నారా లోకేష్ వైయస్ జగన్మోహన్ రెడ్డికి తనదైన శైలిలోనే కౌంటర్ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి తన తండ్రి హయాంలోని 140 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను చంపేశారు అప్పుడే మేము భయపడలేదు ఇప్పుడు నీ రప్పా.. రప్పాలకు భయపడతామా అంటూ జగన్మోహన్ రెడ్డికి కౌంటర్ ఇచ్చారు.
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నేత ఇంటి గేటుకు కూడా తాళ్లు కట్టిన సందర్భాలు ఉన్నాయి అలాంటిది ఇప్పుడు పర్యటనలకు అనుమతి ఇవ్వలేదు అంటూ మాపై నిందలు వేయడం సరైనది కాదని తెలిపారు. ఈ ప్రజాస్వామ్యంలో ఎవరికైనా స్వేచ్ఛగా తిరిగే హక్కు ఉంది కానీ అందరిని చంపుకుంటూ వెళ్లకూడదని లోకేష్ తెలిపారు. గత జగన్మోహన్ రెడ్డి పర్యటనలో భాగంగా మరణించిన కుటుంబాన్ని పరామర్శించడం కోసం ముగ్గురిని చంపేశారని ఎద్దేవా చేశారు.
స్వయంగా జగన్మోహన్ రెడ్డి కారు కింద పడి సింగయ్య అనే వ్యక్తి మరణించినా కూడా జగన్మోహన్ రెడ్డి పట్టించుకోకుండా అలాగే వెళ్లిపోయారని అలా కాకుండా దిగి తనని వెంటనే హాస్పిటల్ కి తరలించి ఉంటే సింగయ్య బ్రతికేవాడని లోకేష్ గుర్తు చేసుకున్నారో అలాగే తన కుటుంబ సభ్యులను జగన్ వెళ్లి పరామర్శించడం పోయి వారిని ఇంటికి రప్పించుకున్నారని వారికి కనీసం మంచినీళ్లు కూడా ఇచ్చిన పాపాన పోలేదు అంటూ జగన్ పై విమర్శలు చేశారు. ఇక తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలే పార్టీ గుండె చప్పుడు అని తెలిపారు. కార్యకర్తలు కష్టకాలంలో పార్టీకి ఎంతో అండగా నిలిచారని మీరు లేకపోతే పార్టీన లేదని కార్యకర్తలపై ప్రశంసలు కురిపించారు. గత ఎన్నికలలో వైసిపికి దీటుగా బుద్ధి చెప్పారని దెబ్బ అదుర్స్ అంటూ కార్యకర్తలను ఉద్దేశించి లోకేష్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.