నేచురల్ స్టార్ నాని వరుస విజయాలతో మంచి జోష్ లో ఉన్నారు. ఓ వైపు హీరోగా సినిమాలు చేస్తూ సక్సెస్ అవుతూనే మరోవైపు నిర్మాతగా సినిమాలు నిర్మిస్తూ మంచి విజయాలను అందుకుంటున్నారు. ఆఖరిగా హిట్3తో ప్రేక్షకుల్ని పలకరించిన నాని, ఆ సినిమాతో ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయారు. కాగా ప్రస్తుతం నాని ది ప్యారడైజ్ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.
నానికి దసరా సినిమాతో బ్లాక్ బస్టర్ ను అందించిన శ్రీకాంత్ ఓదెల నే ది ప్యారడైజ్ సినిమాకు కూడా దర్శకత్వం వహిస్తున్నారు. దసరా తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న సినిమా అవడంతో ది ప్యారడైజ్ పై మంచి అంచనాలున్నాయి. దానికి తగ్గట్టే సినిమాను అనౌన్స్ చేస్తూ రిలీజ్ చేసిన గ్లింప్స్ కూడా ఆ అంచనాలను మరింత పెంచింది.
శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి నాని పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ తో పాటూ క్యారెక్టర్ నేమ్ ను రివీల్ చేశారు మేకర్స్. ది ప్యారడైజ్ లో నాని జడల్ అనే పాత్రలో చాలా డిఫరెంట్ లుక్ లో కనిపించి ఆడియన్స్ ను ఆకట్టుకున్నారు. నాని క్యారెక్టర్ ను పరిచయం చేస్తూ అల్లికగా ప్రారంభమై, విప్లవంగా ముగిసిందంటూ మేకర్స్ పేర్కొన్నారు.
నాని కెరీర్లోనే భారీ బడ్జెట్
ఇక మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్ లో నాని రెండు జడలు వేసుకుని గడ్డం, మీసం తో పాటూ కళ్లద్దాలు పెట్టుకుని కనిపిస్తూ పోస్టర్ తోనే నాని మరోసారి కొత్తగా ట్రై చేస్తున్నాడనిపించేలా కనిపించారు. నాని కెరీర్లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఎస్ఎల్‌వి సినిమాస్ బ్యానర్ లో సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ది ప్యారడైజ్ లో ప్రముఖ బాలీవుడ్ నటుడు రాఘవ్ జుయల్ విలన్ గా నటిస్తుండగా వచ్చే ఏడాది మార్చి 26న ది ప్యారడైజ్ రిలీజ్ కానుంది.