కింగ్ నాగార్జున సడెన్ గా సోలో సినిమాలు వదిలేసి డిఫరెంట్ రోల్స్ చేయడం ఫ్యాన్స్ ని కాస్త డిజప్పాయింట్ చేస్తుంది. నాగార్జున రేంజ్ ఏంటి ఈ రోల్స్ ఏంటని అనుకుంటున్నారు. ఐతే నాగార్జున ఇలా చేయడం వెనక పెద్ద రీజనే ఉంది. వరుసగా రెండు సినిమాలు తమిళ హీరోలతో అందులో ఒకటి కుబేర, రెండోది కూలీ ఈ రెండు సినిమాల్లో నాగార్జున రోల్ ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేసింది. కుబేరలో దీపక్ రోల్ సంథింగ్ స్పెషల్ గా అనిపించినా.. కూలీలో సైమన్ గా నెగ్టివ్ రోల్ కాస్త సర్ ప్రైజ్ చేసింది.
నాగార్జున ఎలా ఈ సినిమా ఒప్పుకున్నారా అని అంతా క్యూరియస్ అయ్యారు. ఐతే నాగార్జున ఈ సినిమా ఒప్పుకోవడానికి మెయిన్ రీజన్ డిఫరెంట్ కాంబినేషన్ సెట్ చేయడమే అని తెలుస్తుంది. లోకేష్ లాంటి డైరెక్టర్ రజనీ హీరో సినిమాలో ఉపేంద్ర, అమీర్ ఖాన్ ఉంటారంటే నాగార్జున ఈ సినిమా చేసేలా కన్విన్స్ చేశాయి. ఐతే నాగార్జున నెక్స్ట్ సినిమా అయినా సోలోగా చేస్తారా అన్న దానికి క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది.
నాగార్జున బర్త్ డే సందర్భంగా ఈ నెల 29న తన 100వ సినిమా అప్డేట్ ఇస్తారని తెలుస్తుంది. నాగార్జున తమిళ దర్శకుడు కార్తీక్ తో సినిమా ఉండబోతుందని టాక్. ఆ సినిమా భారీగా ఉండబోతుందని.. యాక్షన్, ఎమోషన్ ఇలా అన్ని కలిసి ఉంటాయని అంటున్నారు. అంతేకాదు బర్త్ డే రోజు స్పెషల్ గ్లింప్స్ లాంటిది ఒకటి ప్లాన్ చేస్తున్నారట. అదే జరిగితే మాత్రం అక్కినేని ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయ్యే ఛాన్స్ ఉంటుంది.
నాగార్జున నా సామిరంగ తర్వాత కుబేర, కూలీ తీశారు కానీ. ఆ రెండు సినిమాల్లో ఆయనది సెకండ్ లీడ్ రోలే. కాబట్టి నెక్స్ట్ 100వ సినిమా కచ్చితంగా అంచనాలను మించి ఉండేలా చూస్తున్నారట. నాగార్జున ఈ సినిమా కథ కోసం దాదాపు రెండేళ్లుగా వర్క్ చేస్తున్నారని తెలుస్తుంది. 100వ సినిమా అది కూడా కెరీర్ లో మైల్ స్టోన్ మూవీ కాబట్టి సంథింగ్ స్పెషల్ గా ప్లాన్ చేస్తున్నారట.
ఈ సినిమాను పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారట. ఎలాగు తెలుగు సీనియర్ స్టార్స్ చిరంజీవి విశ్వంభరతో.. బాలయ్య అకహండ 2 తో పాన్ ఇండియా అటెంప్ట్ చేస్తున్నారు. వారి దారిలోనే నాగార్జున 100వ సినిమా పాన్ ఇండియా రిలీజ్ ఉంటుందని తెలుస్తుంది.