వినాయక నిమజ్జనం వేళ ముంబై భద్రతకు తీవ్ర ముప్పు వాటిల్లనుందని వచ్చిన మెసేజ్‌లు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే, దర్యాప్తులో ఈ బాంబు బెదిరింపులు అంతర్జాతీయ ఉగ్రవాద గ్రూపుల నుంచి కాదని, వ్యక్తిగత ప్రతీకారంతో పాల్పడిన చర్యగా తేలింది.
శుక్రవారం ముంబయిలో భారీ వేడుకల ఏర్పాట్లు జరుగుతున్న సమయంలో ముంబై ట్రాఫిక్ పోలీసులకు విచిత్రమైన బెదిరింపు మెయిల్స్ అందాయి. 34 వాహనాల్లో మానవ బాంబులు నింపి, మొత్తం నగరాన్ని కుప్పకూల్చేలా ఉగ్రవాదులు సిద్ధంగా ఉన్నారని, 400 కిలోల ఆర్డీఎక్స్ పేలుడు పదార్థాలు ఉన్నాయంటూ పోలీసులకు వచ్చిన మెయిల్స్ ఒక్కసారిగా కలకలం రేపాయి. ‘లష్కర్ ఏ జిహాదీ’ అనే ఖాతా నుంచి పంపిన మెయిల్స్‌లో ఉగ్రవాద గ్రూప్ సభ్యుడిగా తనను పరిచయం చేసుకున్న నిందితుడు, సంఘటితంగా ఓ వర్గం పేరిట మోసం చేసినట్ల పోలీసుల విచారణలో వెల్లడైంది.
నిందిుతడిని బిహార్‌కు చెందిన అశ్వినికుమార్ అని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. అశ్విన్ కుమార్ వృత్తిరీత్యా జ్యోతిష్కుడు. గతంలో తన స్నేహితుడైన ఫిరోజ్ తో వివాదం కారణంగా మూడు నెలల జైలు శిక్షను అనుభవించాడు. దీంతో స్నేహితుడిపై ప్రతీకారం పెంచుకున్నాడు. ఫిరోజ్ పేరుతో ముంబయి ట్రాఫిక్ పోలీసులకు బెదిరింపు మెయిల్స్ పంపాడు. తన కోపాన్ని ఓ వర్గం నుంచి ముప్పుగా చూపించే ప్రయత్నం చేశాడని పోలీసులు పేర్కొన్నారు.
పోలీసుల సహజ నైపుణ్యంతో నిందితుడి నుంచి ఏడు మొబైల్ ఫోన్లు, మూడు సిమ్ కార్డులు, ఆరు మెమొరీ కార్డుల హోల్డర్లు, రెండు డిజిటల్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. మెయిల్స్ ట్రేస్ చేయడంతో నిందితుడి వివరాలు చిక్కాయి. ఉగ్రవాద సంస్థలు పాల్గొనకుండా, వ్యక్తిగత కోపం, ప్రతీకారం తోనే దుశ్చర్యకు పాల్పడినట్లు తేలింది.
ప్రకృతి విపత్తులు, మహా ఉత్సవాలు జరుగుతున్న సమయంలో కూడా మానవీయతను మించిపోయే మత ఆచారాలు మిగిలిపోతాయన్న ఆలోచన ఎంతో ఆలోచింపజేస్తుంది. వ్యక్తిగత కోపానికి మతం ముసుగు వేసి ఉగ్రవాద కోణంలో బెదిరింపులకు పాల్పడటం దారుణం.
అశ్వినికుమార్ ఘటన మానవతా విలువల కంటే వ్యక్తిగత కోపానికి ప్రాధాన్యం ఇచ్చే సమాజానికి హెచ్చరికగా నిలుస్తున్నది. ప్రాణాల కంటే మత ఆచారాలు ముందుంటే మానవతా నైతిక విలువలు నశించిపోతాయి. ఈ సంఘటన సమాజానికి ఒక పాఠంగా నిలవాలి.