హీరోయిన్ అవ్వాలనే ఆశయంతో సీరియల్స్ ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది మృణాల్ ఠాకూర్. పలు సీరియల్స్ లో మెప్పించి ఆ తర్వాత మరాఠీ, హిందీ సినిమాల ద్వారా హీరోయిన్ గా మారింది. అలా నార్త్ లో సినిమాలు చేస్తున్న టైంలో మృణాల్ ఠాకూర్ కి తెలుగులో సీతారామం అనే సినిమాలో అవకాశం వచ్చింది. ఈ సినిమా మృణాల్ సినీ జీవితాన్నే మార్చేసిందని చెప్పవచ్చు. ఈ సినిమాతో మృణాల్ కి చాలా క్రేజ్ కూడా వచ్చింది. ఆ తర్వాత వరుస అవకాశాలు తలుపు తట్టాయ్. అయితే చాలామంది హీరోయిన్లు సౌత్ సినిమాల ద్వారా ఫేమస్ అయినప్పటికీ… వారి దృష్టంతా బాలీవుడ్ పైనే ఉంటుంది. బాలీవుడ్ లో స్టార్ గా రాణించాలని కలలు కంటారు.
కానీ అక్కడ చేసే సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో మళ్ళీ సౌత్ ఇండస్ట్రీ పైపే అడుగులు వేస్తున్నారు. అలాంటి వారిలో మృణాల్ ఠాకూర్ కూడా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొదట నార్త్ లో సినిమాలు చేసి సక్సెస్ కాలేదు.కానీ సౌత్ లో చేసిన సీతారామం సినిమాతోనే సక్సెస్ అయింది. అలా సీతారామం తర్వాత హాయ్ నాన్న సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. 2024లో వచ్చిన ఫ్యామిలీ స్టార్ మూవీ నిరాశపరిచినప్పటికీ సౌత్ లో మృణాల్ క్రేజ్ అయితే తగ్గలేదు.
అయితే అలాంటి మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ మీద ఉన్న ఇంట్రెస్ట్ తో సన్ ఆఫ్ సర్దార్ 2 మూవీలో చేసింది. కానీ ఈ సినిమా విడుదలై బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. అంతేకాకుండా ఈ సినిమాలో మృణాల్ కి అంత ప్రాధాన్యత కూడా లేదు. దాంతో మృణాల్ కెరీర్ ఇరకాటంలో పడిపోయింది. పైగా ఈమెకు అవకాశం ఇవ్వడానికి కూడా బాలీవుడ్ లో ఎవరు ఆసక్తి కనబరచలేదనే వార్తలు వినిపిస్తున్నాయి. అలా సొంత ఇలాకాలో అవకాశాలు కోల్పోతుండడంతో ప్రస్తుతం మృణాల్ ఠాకూర్ ఆశలన్నీ సౌత్ సినిమాల పైన పెట్టుకుంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ అడివి శేష్ డెకాయిట్ మూవీలో చేస్తోంది. ఈ సినిమా గనుక హిట్ కాకపోతే సౌత్ లో కూడా మృణాల్ మార్కెట్ పడిపోతుంది. అందుకే తన ఫోకస్ మొత్తం సౌత్ సినిమాలపైనే పెట్టిందట.
ప్రస్తుతం మృణాల్ డెకాయిట్ మూవీ తోపాటు అట్లీ , అల్లుఅర్జున్ కాంబోలో వస్తున్న సినిమాలో కూడా హీరోయిన్ గా ఫిక్స్ అయినట్టు సినీ వర్గాల్లో రూమర్స్ వినిపిస్తున్నాయి. ఒకవేళ ఈ సినిమాలు హిట్ కొట్టినా చాలు మృణాల్ దశ తిరిగినట్టే.. మరి మృణాల్ ఠాకూర్ కెరీర్ మళ్ళీ గాడిన పడుతుందా? లేదా? అనేది చూడాలి. ఇదిలా ఉండగా మరోవైపు తాజాగా మృణాల్ ధనుష్ తో డేటింగ్ లో ఉన్నట్టు రూమర్లు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇలా వార్తలు వస్తున్నా నేపథ్యంలో సడన్ గా ధనుష్ ఇంట్లో మెరిసింది ఈ అమ్మడు. దీంతో ఈ రూమర్స్ కి మరింత ఆజ్యం పోసినట్టయింది. మరి నిజంగానే ధనుష్ తో డేటింగ్ లో ఉందా..లేక వీరి కాంబోలో ఏదైనా కొత్త సినిమా రాబోతోందా అనేది తెలియాల్సి ఉంది.