ముంబై బ్యూటీ మృణాల్ ఠాకూర్ చిత్ర పరిశ్రమలో ఎలా ఎదిగందన్నది చెప్పాల్సిన పనిలేదు. బుల్లి తెరపై ఎంట్రీ ఇచ్చి అక్కడ సక్సెస్ అనంతరం వెండి తెరకు ప్రమోట్ అయింది. ఈ మధ్యలో ఎన్నో అవమానాలు…సవాళ్లు ఎదుర్కుంది. ఇండస్ట్రీలో బ్యాక్ గ్రౌండ్ లేకపోతే ఎదురయ్యే అన్ని రకాల ఇబ్బందులు ఎదుర్కుంది. బాలీవుడ్ అనే మహాస ముద్రంలో తాను చేప పిల్లలా మొదలై పెద్ద చేపగా మారింది. అక్కడ నుంచి సీతారామంతో టాలీవుడ్ లోనూ సంచలన భామగా మారింది. కేవలం సక్సస్ మాత్రమే తనని ఇంత దూరం తీసుకొచ్చింది.
ఎన్నో హేళనలు..అవమానాల తర్వాత ఈ స్థాయికి చేరుకుంది. కొత్తగా వచ్చే వాళ్లకు పరిశ్రమలో ఇవన్నీ సహజమే. వాటిని పట్టించుకుంటే గమ్యాన్ని చేరడం అసాధ్యం. కానీ జీవితంలో మర్చిపోలేని ఓ సంఘటనని తనని బాలీవుడ్ వైపు స్ట్రాంగ్ గా ఉండేలా చేసిందని తెలుస్తోంది. ఇటీవలే అమ్మడు కష్టపడి సంపాదించిన డబ్బుతో లగ్జరీ మెర్స్ డెస్ బెంజ్ కారు కొంది. ఈ సందర్భంగా ఓ అవమానం గురించి మరోసారి గుర్తు చేసుకుంది. తన చేతుల్లో డబ్బులేని సమయంలో? చిన్న తనంలో తన తల్లిని చుట్టాలే కారు ఎక్కించుకోవాలంటే? ఆలోచించేవారుట.
ఓ సారి అయితే కారు ఎక్కే అర్హతే తన తల్లికి లేదన్నట్లు అవమానించారట. అలా ఓసారి తన తల్లిని ఒంటరిగా వదిలేసి కారులో వెళ్లిపోయారట. ఆ సంఘటన గుర్తొచ్చినప్పుడల్లా తానెంతో బాధపడతానంది. ఆ ఘటన తర్వాత డబ్బు సంపాదించి ఖరీదైన కారులో అమ్మను తీసుకెళ్లాలని బలంగా డిసైడ్ అయిందిట. ఆ కల ఇప్పటికి నెర వేరిందని తెలిపింది. తమ బంధువుల్లో ఎవరికీ బెంజ్ కారు లేదని…తానే ఆ కారు మొదట కొన్న వ్యక్తిగా చెప్పు కొచ్చింది. ఇప్పుడా కారులో అమ్మను ఎక్కించుకుని తిరుగుతున్నప్పుడు ఆ పాత సంఘటనలు గుర్తొచ్చాయంది.
అప్పుడు వాళ్లు అవమానించారని..ఇప్పుడు వాళ్లను తక్కువ చేయడం తన ఉద్దేశం కాదని..దగ్గర అనుకునే వాళ్లు కొందరు ఎలా ఉంటారు? అన్నది డబ్బు లేనప్పుడే తెలుస్తుంది. డబ్బు లేనప్పుడు సమభావంతో చూసిన వాళ్లే గొప్ప మనసున్న వ్యక్తలు అవుతారంది. ఇప్పుడు తాను డబ్బు సంపాదించినా? డబ్బు లేని రోజుల్ని మాత్రం ఎప్పటికీ మర్చిపోనంది. ప్రస్తుతం మృణాల్ హిందీ సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అలాగని తెలుగు సినిమాలకు దూరమవ్వలేదు. అడవి శేష్ హీరోగా నటిస్తోన్న `డెకాయిట్` లో నటిస్తోంది. అలాగే అల్లు అర్జున్ హీరోగా నటిస్తోన్న 26వ చిత్రంలోనూ ఓ హీరోయిన్ గా నటిస్తోంది. వీటితో పాటు మరికొన్ని కమిట్ మెంట్లు కూడా ఉన్నాయి. కానీ వాటి వివరాలు ఇంకా అధికారికంగా బయటకు రాలేదు.


















