‘సీతారామం’ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ‘సీత’గా సుస్థిర స్థానం సంపాదించుకుంది మృణాల్ ఠాగూర్. తొలి సినిమాతోనే అద్భుతమైన నటన, సంప్రదాయమైన అందంతో అందరినీ ఆకట్టుకుని, టాలీవుడ్లో గోల్డెన్ లెగ్గా మారిపోయింది. అప్పటి నుంచి తెలుగులో వరుస అవకాశాలు అందుకుంటూ కెరీర్లో దూసుకుపోతోంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ, తాజాగా దీపావళి గ్లోతో మెరిసిపోతున్న ఫొటోలను షేర్ చేసింది.
రాయల్ బ్లూ కలర్ శారీలో, దానికి మ్యాచింగ్‌గా డిజైనర్ బ్లౌజ్ ధరించి ఎంతో హుందాగా, అందంగా కనిపిస్తోంది. “దివాలీ గ్లామ్ మోడ్ యాక్టివేటెడ్” అనే క్యాప్షన్‌తో పండగ శోభను ముందే తీసుకొచ్చింది. ఆమె లుక్‌కి, స్టైల్‌కి ఫ్యాన్స్ ముగ్ధులవుతున్నారు.మృణాల్ ఠాగూర్ కెరీర్ హిందీలో మొదట టెలివిజన్ సీరియల్స్‌తో ప్రారంభమైంది.
‘కుంకుమ్ భాగ్య’ వంటి పాపులర్ సీరియల్స్‌తో హిందీ ప్రేక్షకులకు దగ్గరైంది. ఆ తర్వాత మరాఠీ, హిందీ సినిమాల్లో తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అయితే, ‘సీతారామం’ ఆమె కెరీర్‌ను మరో స్థాయికి తీసుకెళ్లింది. ఆ తర్వాత వచ్చిన ‘హాయ్ నాన్న’తో మరో క్లాసిక్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది.
హిందీలో ‘పూజా మేరీ జాన్’, ‘సన్ ఆఫ్ సర్దార్ 2’ వంటి చిత్రాలతో పాటు, టాలీవుడ్‌లోనూ క్రేజీ ప్రాజెక్టులలో నటిస్తోంది. విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ నటిగా తనను తాను నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఒకవైపు గ్లామరస్ పాత్రలతో, మరోవైపు నటనకు ప్రాధాన్యమున్న పాత్రలతో మృణాల్ ఠాగూర్ తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ను క్రియేట్ చేసుకుంటోంది. ఆమె అందం, అభినయం, సినిమా సెలక్షన్ చూస్తుంటే ఇండస్ట్రీలో లాంగ్ ఇన్నింగ్స్ ఆడటం ఖాయమనిపిస్తోంది.