ఈ ఏడాది విడుదలైన చాలా సినిమాలు ఏదో ఒక కారణంతో వాయిదా పడుతూ ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అదే కోవలో నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన అఖండ–2 కూడా విడుదల తేదీ మార్పు ప్రభావాన్ని ఎదుర్కొంది. వాస్తవానికి ఈ సినిమా డిసెంబర్ 5న విడుదల కావాల్సి ఉండగా, ఫైనాన్షియల్ ఇబ్బందుల కారణంగా డిసెంబర్ 12కు వాయిదా పడింది.
సినిమా విడుదలైన తర్వాత ప్రేక్షకుల నుంచి వచ్చిన స్పందన మాత్రం అంచనాలను మించింది. సనాతన ధర్మం, భారతదేశ ఔన్నత్యాన్ని దర్శకుడు బోయపాటి శ్రీను అత్యంత పవర్‌ఫుల్‌గా తెరపై ఆవిష్కరించారని అభిమానులు ప్రశంసల జల్లు కురిపించారు. ముఖ్యంగా బాలకృష్ణను ఒక రకంగా ‘సూపర్‌మ్యాన్’లా, శివతత్వానికి ప్రతీకగా చూపించిన విధానం శివభక్తులను పూనకాలతో ఊగిపోయేలా చేసింది.
సినిమా చూసిన అభిమానులు బాలయ్యను శివునిగా ఊహించుకుంటూ ‘ఇది మా సినిమా’ అంటూ గర్వంగా చెప్పుకుంటున్నారు. హిందూ ధర్మాన్ని ఆరాధించే భక్తులు ఈ చిత్రాన్ని నిండుమనసుతో ఆశీర్వదించడం ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ అంశం.
అయితే ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం, ఒక సినిమా విడుదల కావాల్సిన సమయంలో విడుదల కాకుండా వాయిదా పడితే కలెక్షన్లపై దాదాపు 20 శాతం వరకు ప్రభావం పడటం ఖాయం. అదే ప్రభావం ‘అఖండ–2’ విషయంలోనూ కనిపించినట్టు సమాచారం.
ఇప్పటికే కొన్ని కేంద్రాల్లో ఈ సినిమా సేఫ్ జోన్‌లో నిలిచింది, మరికొన్ని చోట్ల ఇంకా రన్ అవుతోంది. ఇక రాజాసాబ్ విడుదలయ్యే వరకు ‘అఖండ–2’ రన్ ఇలానే కొనసాగితే, ట్రేడ్ వర్గాలు, డిస్ట్రిబ్యూటర్లు అందరూ సేఫ్‌గా బయటపడతారని ఇండస్ట్రీలో చర్చ సాగుతోంది.
మొత్తానికి, వాయిదా ప్రభావం ఉన్నప్పటికీ ‘అఖండ–2’ సృష్టించిన ఆధ్యాత్మిక ఊపు, అభిమానుల స్పందన ఈ సినిమాను ప్రత్యేకంగా నిలబెట్టిందని చెప్పాలి.
జస్ట్ వెయిట్ అండ్ సీ…
Akhanda2
















