ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Health

Toilet : మొబైల్‌ ఫోన్ పట్టుకుని వెళ్తున్నారా..?

Toilet : మొబైల్‌ ఫోన్ పట్టుకుని వెళ్తున్నారా..?
ADVERTISEMENT

మీ ఫోన్‌ను చేతి నుంచి దూరంగా ఉంచలేకపోతున్నారా? తినేటప్పుడు, నిద్రకి ముందు, నిద్ర లేచిన వెంటనే ఫోన్ చూడకుండా ఉండలేకపోతున్నారా?ఆఖరికి టాయిలెట్‌కు వెళ్లేప్పుడు కూడా ఫోన్ తీసుకెళ్తున్నారా? ఇది కచ్చితంగా ఆందోళన చెందాల్సిన అంశం.

 

నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండడం, ఫోన్ కాల్స్, ఈమెయిల్స్, మెసేజులు, రీల్స్ వంటి వాటితో మొబైల్ ఫోన్‌ను టాయిలెట్‌కి కూడా తీసుకెళ్లాలని అనిపిస్తుంది. ఆ సమయంలో, అక్కడ ఫోన్ చూస్తూ ఉండడం వల్ల ప్రమాదాలకు దగ్గరవుతున్నామని చాలా మంది గ్రహించడం లేదు.టాయిలెట్‌కి వెళ్లేప్పుడు మొబైల్ ఫోన్ తీసుకెళ్లడం వల్ల ఎలాంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందో మనం ఈ కథనంలో తెలుసుకుందాం.

 

మనలో చాలామందికి, ముఖ్యంగా యువతీయువకులకు టాయిలెట్‌కు ఫోన్ తీసుకెళ్లే అలవాటు ఉంటుంది. అయితే, అరగంట కంటే ఎక్కువసేపు టాయిలెట్‌లో గడిపేవారు వ్యాధుల బారినపడే అవకాశం ఎక్కువ.ఎవరైతే మొబైల్ ఫోన్‌ను ఎక్కువగా వాడుతుంటారో వారు ఒకేచోట ఎక్కువసేపు కూర్చుంటారు. ఇది మలవిసర్జనలో సాయపడే పాయువు (మలద్వారానికి పైన ఉండే భాగం – యానస్) దగ్గర కండరాలపై మరింత ఒత్తిడికి కారణమవుతుంది.

 

మలవిసర్జన చేయడానికి కష్టపడాల్సి రావడం కూడా అనేక రకాల వ్యాధులకు కారణమవుతుంది. వీటిలో హెమరాయిడ్స్ (పైల్స్), మలబద్దకం, ఫిస్టులా, ఫిషర్ వంటివి ఉంటాయి.ఒకేచోట ఎక్కువసేపు కూర్చోవడం వల్ల రక్తప్రసరణకు ఆటంకం కలుగుతుంది. మలవిసర్జన కోసం ఒకేచోట ఎక్కువసేపు కూర్చోవడం వల్ల మలబద్దకం, మలం గట్టిగా వచ్చే అవకాశాలు పెరుగుతాయి.

 

ఈ ఒత్తిడి మలద్వారం వద్దనున్న రక్తనాళాలపై ఒత్తిడికి కారణమవుతుంది. దీంతో అవి ఉబ్బిపోయి వివిధ రకాల ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశాలు పెరుగుతాయి.నిజానికి, కమోడ్ రకం టాయిలెట్ సహజంగానే యానస్ చుట్టూ ఉన్న ప్రాంతం, అక్కడి కండరాలపై ఒత్తిడికి కారణమవుతుంది.దానికితోడు, మనం అక్కడ ఎక్కువసేపు కూర్చోవడం వల్ల ఆ ఒత్తిడి మరింత పెరిగే అవకాశముంది. మలవిసర్జన ఆలస్యం కావడం లేదా విసర్జనలో ఇబ్బందులు ఎదురైనప్పుడు, ఎక్కువ మంది మరింత బలవంతంగా విసర్జన చేసేందుకు ప్రయత్నిస్తారు. దీంతో సమస్యల్లో చిక్కుకుంటారు.

 

అందువల్ల, వీలైనంత తక్కువ సమయంలో మలవిసర్జన చేసేందుకు ప్రయత్నించడం, టాయిలెట్‌లో ఫోన్ ఉపయోగించకపోవడం వంటివి గుర్తుంచుకోవడం ముఖ్యం.టాయిలెట్‌లో ఎక్కువసేపు కూర్చుని ఫోన్ చూడడం వల్ల మెడ, వెన్నుపూస శరీర భాగాలపై ఒత్తిడి పడుతుంది.

ఒకే స్థితిలో కదలకుండా ఉండటం వల్ల చేతులు, పాదాలకు తిమ్మిర్లు, కాళ్లు భారంగా అనిపించడం, కొద్దిసేపు ఇతర అవయవాలను కదలించలేకపోవడం వంటివి జరుగుతాయి.వంగి కూర్చుని, ఎక్కువసేపు మొబైల్ చూడడం వల్ల ఒత్తిడి పెరిగి అది మెడనొప్పికి, వెన్నునొప్పికి కారణం కావొచ్చు.

 

కోవిడ్ మహమ్మారి తర్వాత, గత ఐదేళ్లలో జీవనశైలిలో చోటుచేసుకున్న మార్పుల ప్రభావం కూడా స్పష్టంగా కనిపిస్తోంది. ఎక్కువసేపు ఒకేచోట కూర్చోడం, ఒకేచోట కూర్చుని పనిచేయడం, కనీసం ఇంటి నుంచి బయటికి కూడా రాకపోవడం, వ్యాయామాలు, యోగా లాంటివి చేయకపోవడం, ఫాస్ట్ ఫుడ్, ప్యాకేజ్డ్ ఫుడ్ తీసుకోవడం వంటివి పెరిగాయి.అలాగే, వీటికి సంబంధించిన చాలా లావాదేవీలు మొబైల్ ఫోన్ల ద్వారానే జరుగుతాయి కాబట్టి, ఫోన్ వినియోగం పెరిగింది. నిరంతరం ఫోన్లను వాడడం వల్ల వాటిని టాయిలెట్‌కు తీసుకెళ్లే అలవాటు కూడా పెరిగింది.

 

ఒకేచోట కదలకుండా కూర్చోవడం వల్ల గుండెజబ్బులు, మధుమేహం, ఊబకాయం, మెడనొప్పి, వెన్నునొప్పి, కండరాల బలహీనత, నరాలు ఉబ్బడం, స్ట్రోక్ రావడం, కండరాలు, కీళ్లనొప్పులు వంటి ఆరోగ్య సమస్యలు మాత్రమే కాకుండా ఉబ్బరం, బరువు పెరిగిపోవడం, జీర్ణప్రక్రియ మందగించడం, మానసిక ఆరోగ్యంపై ప్రభావం వంటి దుష్పరిణామాలు ఏర్పడుతున్నాయి.

 

ఈ సెడెంటరీ లైఫ్‌స్టైల్ (నిశ్చల జీవనశైలి) యాంగ్జైటీ, డిప్రెషన్, ఒత్తిడితో పాటు అతిగా తినడం వంటి రుగ్మతలకు దారితీస్తుంది.సెడెంటరీ లైఫ్‌స్టైల్, ఎలాంటి శారీరక శ్రమ లేకుండా ఎక్కువసేపు ఒకేచోట కూర్చోవడం వంటివి అనేక ఆరోగ్య సమస్యలకు కారణమవుతాయి.ఎక్కువసేపు కూర్చోవడం వల్ల రక్తంలో షుగర్, ఇన్సులిన్ స్థాయిలను అదుపులో ఉంచుకునే శరీర సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ఇది టైప్ 2 డయాబెటిస్‌కు దారితీయొచ్చు. అలాగే యాంగ్జైటీ, డిప్రెషన్, ఊబకాయం, కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులు, బీపీ, కొలెస్ట్రాల్ స్థాయిలు పెరగడం, స్ట్రోక్, గుండెజబ్బులకు దారితీస్తుంది.

 

ఎక్కువసేపు ఒకేచోట కూర్చోవడం వల్ల వెన్ను కండరాలపై ఒత్తిడి పెరిగి వెన్నెముక సమస్యలు తలెత్తుతాయి. ఈ నిశ్చల జీవనశైలి వెన్నునొప్పి, మెడనొప్పి, ఆస్టియోపోరోసిస్, వెరికోస్ వెయిన్స్ వంటి ఆరోగ్య సమస్యలకు కారణమవుతుంది.

”పైల్స్ వంటి వ్యాధులకు ఫైబర్ తక్కువగా ఉండే ఆహారం తినడం మాత్రమే కాకుండా, టాయిలెట్‌‌లో ఎక్కువసేపు కూర్చోవడం, అక్కడే కూర్చుని ఫోన్ వాడడం వంటివి కూడా కారణమవుతాయి. యానస్ సమీప రక్తనాళాలపై అధిక ఒత్తిడి కారణంగా ఇలాంటి అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. పైల్స్ వల్ల రక్తం కారడం మొదలైతే, చాలా ఇబ్బందికరంగా మారుతుంది. అలాగే, మొబైల్ ఫోన్‌పై ఉండే క్రిములు మీ చేతులు, ముఖం ద్వారా శరీరంలోకి చేరి, ఇన్ఫెక్షన్లు ఉదరంలోకి వ్యాపించే అవకాశం ఉంటుంది”

Tags: #DigitalHabits#GermAlert#HealthWarning#MobileAddiction#PhoneInToilet#SmartphoneProblems#StopPhoneInBathroom#TechHabits#ToiletHygiene#UnhealthyHabits
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

Hyderabad : ఏమిటీ ఫ్యూచర్ సిటీ..హైదరాబాద్‌కి ఎటువైపు రాబోతుంది..?

Next Post

Vidadala Rajini : చిక్కుల్లో విడదల రజనీ!

Related Posts

Telangana Cabinet
Big Story

Telangana Cabinet : ఉద్యోగులకు రెండు డీఏలు.. కరువు, విద్యుత్‌పై కీలక నిర్ణయాలు

Captain Smith Macher
Big Story

Captain Smith Macher: కత్తి దాడి జరిగినా విమానాన్ని కాపాడిన భారతీయ పైలట్.. రియల్ హీరోకు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు

Essential Commodity Prices
Big Story

Essential Commodity Prices: ఆకాశాన్ని తాకుతున్న నిత్యావసరాల ధరలు.. సామాన్యుడి బతుకు భారమేనా?

Sigma Movie
Entertainment

Sigma Movie: ఫరియా అబ్దుల్లా కొత్త అవతారం.. సందీప్ కిషన్‌తో యాక్షన్ ఎంటర్‌టైనర్

Bhagat Singh
Big Story

Bhagat Singh: భగత్ సింగ్ తాత్విక వారసత్వం.. నేటి సమాజానికి ఆయన సందేశం

RevanthReddy
Big Story

RevanthReddy: సైమన్ గో బ్యాక్‌.. రానున్న రోజుల్లో సర్ గో బ్యాక్‌: సీఎం రేవంత్ రెడ్డి

Next Post
Vidadala Rajini : చిక్కుల్లో విడదల రజనీ!

Vidadala Rajini : చిక్కుల్లో విడదల రజనీ!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
వాట్సాప్ గవర్నెన్స్

వాట్సాప్ గవర్నెన్స్

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

Telangana Cabinet

Telangana Cabinet : ఉద్యోగులకు రెండు డీఏలు.. కరువు, విద్యుత్‌పై కీలక నిర్ణయాలు

Captain Smith Macher

Captain Smith Macher: కత్తి దాడి జరిగినా విమానాన్ని కాపాడిన భారతీయ పైలట్.. రియల్ హీరోకు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు

Essential Commodity Prices

Essential Commodity Prices: ఆకాశాన్ని తాకుతున్న నిత్యావసరాల ధరలు.. సామాన్యుడి బతుకు భారమేనా?

Sigma Movie

Sigma Movie: ఫరియా అబ్దుల్లా కొత్త అవతారం.. సందీప్ కిషన్‌తో యాక్షన్ ఎంటర్‌టైనర్

Recent News

Telangana Cabinet

Telangana Cabinet : ఉద్యోగులకు రెండు డీఏలు.. కరువు, విద్యుత్‌పై కీలక నిర్ణయాలు

Captain Smith Macher

Captain Smith Macher: కత్తి దాడి జరిగినా విమానాన్ని కాపాడిన భారతీయ పైలట్.. రియల్ హీరోకు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు

Essential Commodity Prices

Essential Commodity Prices: ఆకాశాన్ని తాకుతున్న నిత్యావసరాల ధరలు.. సామాన్యుడి బతుకు భారమేనా?

Sigma Movie

Sigma Movie: ఫరియా అబ్దుల్లా కొత్త అవతారం.. సందీప్ కిషన్‌తో యాక్షన్ ఎంటర్‌టైనర్

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info

No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info