మెక్సికోలోని గ్వానాజువాటో లో కొంతమంది దుండగులు రెచ్చిపోయి మరి సంబరాలు చేసుకుంటున్న ప్రాంతంలో కాల్పులు జరగడంతో ఒక్కసారిగా అక్కడ రక్తపాతం ఏరులై పారుతోంది .సెయింట్ జాన్ ది బాప్టిస్ట్ వేడుకలు జరుగుతున్న సమయంలో కొంతమంది దుండగులు ఇలా విచక్షణారహితంగా కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది.. ముఖ్యంగా సెయింట్ జాన్ ది బాప్టిస్ట్ అంటే ఇరావు లో చాలా ఘనంగా జరుపుకొనే ఒక స్ట్రీట్ సెలబ్రేషన్స్ అన్నట్లుగా తెలుస్తోంది. అయితే ఇందులో స్థానికుల సైతం మద్యం సేవించి మరి , డాన్స్ చేస్తూ చాలా గ్రాండ్గా ఈ వేడుకలను జరుపుకుంటారట.
అలా జరుపుకుంటున్న సమయంలో కొంతమంది గుర్తు తెలియని దుండగులు ఆ ప్రాంతంలోకి వచ్చి మరి కాల్పులు జరిపారు. ఈ కాల్పులలో సుమారుగా 12 మంది అక్కడికక్కడే మరణించగా మరో 20 మందికి పైగా గాయాలైనట్లుగా సమాచారం.. అయితే ఈ కాల్పులు జరిగిన చోట ఆ కాల్పులు జరగక ముందు కొన్ని నిమిషాల క్రితం ఒక గృహప్రవేశం జరుగుతూ ఉండగా ఆ డాబాలో బ్యాండ్ వాయిస్తూ అక్కడి ప్రజలు కూడా నృత్యం చేస్తున్న ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నది. సడన్గా తుపాకుల కాల్పులు శబ్దంతో అక్కడివారు భయపడుతున్నట్లు కనిపిస్తోంది.
ఇరాపువాటో అధికారులు తెలియజేస్తూ 12 మంది మరణించారని 20 మందికి పైగా గాయాలయ్యాయని ధ్రువీకరించారు. అయితే ఈ దాడిని మెక్షికన్ అధ్యక్షురాలు క్లాడియ షిన్బాయ్ మాత్రం తీవ్రంగా ఖండిస్తూ ఈ విషయం పైన దర్యాప్తు చేయాలంటూ ఆదేశాలను జారీ చేశారు. మెక్సికో నగరానికి వాయువ్యంగా ఉన్నటువంటి గ్వానాజు వాటో గడిచిన కొండేళ్ల క్రితం మెక్సికోలా చాలా అత్యంత హింసాత్మకమైన రాష్ట్రాలలో ఒకటిగా పేరు సంపాదించింది.. ఈ రాష్ట్రంలో ఈ ఏడాది ఇప్పటివరకు సుమారుగా 1400కు పైగా హత్యలు జరిగాయని అక్కడ అధికారులు తెలియజేస్తున్నారు. మొత్తానికి మెక్సికో ప్రాంతంలో జరిగిన చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. అంతేకాకుండా ఈ దాడికి సంబంధించిన వీడియో కూడా వైరల్గా మారుతున్నది.