పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాలతో పాటు సినిమాలతో కూడా బిజీగా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇటీవల ఆయన హరహర వీర మల్లు సినిమాకు సంబంధించిన పనులు ముమ్మరం చేయడంతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ సమావేశాల్లో కూడా పాల్గొంటున్నారు.
అయితే చిరంజీవి-పవన్ కళ్యాణ్ సోదరుల తల్లి అంజనా దేవి ఆరోగ్యం విషమించిందని, అందుకే పవన్ కళ్యాణ్ కేబినెట్ సమావేశం మధ్యలోనే తర్జన భర్జనగా వెళ్లిపోయారని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఇవన్నీ కేవలం వదంతులే అని తెలుస్తోంది.
మెగా ఫ్యామిలీ వర్గాలు తెలిపిన సమాచారం ప్రకారం.. అంజనా దేవి పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారు. ఆమెకు ఎటువంటి ఆరోగ్య సంబంధిత సమస్యలు లేవని స్పష్టం చేశారు. ఆమె ఆరోగ్యం గురించి ప్రచారంలో ఉన్న న్యూస్ పూర్తిగా నిరాధారమైనదని, అభిమానులు, జనసేన కార్యకర్తలు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
ఇదిలా ఉంటే.. పవన్ కళ్యాణ్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘హరిహర వీర మల్లు’ భారీ ఎత్తున జూలై 24, 2025న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. రికార్డు స్థాయిలో స్క్రీన్లలో ఈ సినిమా రిలీజ్ చేయనుండటంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.ఇక రాజకీయంగా కూడా పవన్ కళ్యాణ్ ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమైన సమావేశాల్లో పాల్గొంటూ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.అంతిమంగా పవన్ కళ్యాణ్ తల్లి ఆరోగ్యంపై వస్తున్న వదంతుల్లో నిజం లేదు అని మరోసారి అధికారికంగా స్పష్టమైంది.