అందాల భామ మీనాక్షి చౌదరి తెలుగులో సూపర్ హిట్ అందుకుంటున్నా కూడా అమ్మడి కెరీర్ జోరందుకోవట్లేదు. లాస్ట్ ఇయర్ తెలుగు, తమిళ భాషల్లో దాదాపు ఆరు సినిమాల్లో నటించింది మీనాక్షి చౌదరి. అందులో సూపర్ స్టార్ మహేష్ తో గుంటూరు కారం తో పాటు దళపతి విజయ్ ది గోట్ సినిమా కూడా ఉన్నాయి. ఆ 6 సినిమాల్లో అమ్మడు కేవలం రెండు సినిమాలతోనే హిట్ అందుకుంది. లక్కీ భాస్కర్ సూపర్ హిట్ కాగా.. గుంటూరు కారం, గోట్ ఆశించిన స్థాయి ఫలితాన్ని అందుకోలేదు.
ఐతే గుంటూరు కారం సినిమా మీనాక్షి అసలెందుకు చేసిందని ఆమె ఫ్యాన్స్ డౌట్ పడుతున్నారు. హీరోయిన్ గా చేస్తున్న మీనాక్షి ఇలా ఒక సైడ్ రోల్ కి అంకితమవడం డిజప్పాయింట్ చేసింది. ఐతే అది త్రివిక్రం, మహేష్ కాంబో సినిమా కాబట్టి ఏదో అలా నడిచింది. ఐతే మీనాక్షి ఈ ఇయర్ మొదట్లో సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో సెన్సేషనల్ హిట్ అందుకుంది. మీనాక్షి చౌదరి ఆ సినిమా హిట్ తో మళ్లీ జోష్ పెంచుకుంటుందని అనుకోగా కానీ అమ్మడి ఆశించిన స్థాయి ఛాన్స్ లు అందుకోవట్లేదు.
మీనాక్షి చౌదరి ప్రెజెంట్ నవీన్ పొలిశెట్టితో అనగనగా ఒక రాజు సినిమా చేస్తుంది. ఆ సినిమా తప్ప మరో సినిమా ఛాన్స్ అందుకోలేదు అమ్మడు. మరి తెలుగు, తమిళ్ లో వరుస సినిమాలు చేస్తూ హిట్లు ఫ్లాపులు సమతూకం చేసుకుంటున్న మీనాక్షి సడెన్ గా ఇలా ఛాన్స్ లు లేకపోవడం ఫ్యాన్స్ కి షాక్ ఇస్తుంది. ప్రెజెంట్ అమ్మడు జపాన్ టూర్ కి వెళ్లింది. జపాన్ వీధుల్లో ఫోటోస్ దిగుతూ వాటిని తన సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది మీనాక్షి.
ప్రస్తుతం మీనాక్షి ఫోటోలు సోషల్ మీడియా వైరల్ అయ్యాయి. మీనాక్షి కూడా వచ్చిన సినిమానే చేద్దాం అనుకుంటూ ఉంది. మరి మీనాక్షి అనగనగా ఒక రాజు తర్వాత మరో సినిమా ఏం చేస్తుంది అన్నది త్వరలో తెలుస్తుంది. మీనాక్షి చౌదరికి తెలుగులో మంచి క్రేజ్ ఏర్పడింది. ఐతే అమ్మడు చేస్తున్న సినిమాల్లో చాలా వరకు మిస్ ఫైర్ అవుతున్నాయి. అందుకే కెరీర్ విషయంలో ఆచి తూచి అడుగులేస్తుంది. సంక్రాంతికి వస్తున్నాం తర్వాత నవీన్ సినిమానే చేస్తుంది మీనాక్షి. ఒకటి రెండు ఆఫర్లు వచ్చినా చేయనని చెప్పిందట. నవీన్ తో చేస్తున్న అనగనగా ఒక రాజు సినిమా సక్సెస్ అయితే మళ్లీ జోష్ అందుకునే ఛాన్స్ ఉంటుంది.
Meenakshi Chaudhary #MeenakshiChaudhary pic.twitter.com/dDU9qv0fmZ
— news7telugu (@news7telug2024) August 21, 2025