వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉన్నారు. ఆయన ఈ నెల 23 దాకా తిరిగి రారు. ఒక లాంగ్ జర్నీకి ఆయన ప్లాన్ చేసుకుని వెళ్ళారు. తన ఫ్యామిలీ కోసం ఆయన ఈ టూర్ ని షెడ్యూల్ చేశారు. ఇక ఆయన తిరిగి వచ్చిన తరువాతనే పార్టీ రాజకీయాలను గ్రేరప్ చేస్తాను అని చెప్పి మరీ వెళ్లారని అంటున్నారు. ఇక ఏపీలో మెడికల్ వార్ కి వైసీపీకి తెర తీసింది. ప్రైవేట్ విధానంలో వాటిని కట్టబెట్టడమేంటి అని వైసీపీ నేతలు గట్టిగా ప్రశ్నిస్తున్నారు. ఇది వైసీపీ విపక్షంలోకి వచ్చాక తీసుకున్న అతి పెద్ద ప్రోగ్రాం.
వైసీపీ తన హయాంలో 17 మెడికల్ కాలేజీలను ఏపీలో ఏర్పాటు చేసింది. ఇందులో అయిదు పూర్తి అయ్యాయి, మిగిలినవి వివిధ స్టేజీలలో ఉన్నాయి. మరో వైపు చూస్తే ఇవన్నీ తాము సృష్టించిన సంపదగా వైసీపీ చెబుతోంది. ఒక విధంగా వైసీపీ ప్రతిష్టాత్మకంగానే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను తీసుకుంది. సైలెంట్ మోడ్ లో ఉన్న క్యాడర్ ని రెడీ చేసేందుకు కూడా ఆందోళనలకు పిలుపు ఇచ్చింది. మరి ఇంతటి పెద్ద కార్యక్రమం తీసుకున్న తరువాత జగన్ కూడా రంగంలోకి దిగి నర్శీపట్నంలో మెడికల్ కాలేజీని సందర్శించిన తరువాత ఇపుడు అధినేత దేశంలో లేకుండా ఈ ఉద్యమం ఎలా ముందుకు తీసుకుని వెళ్తారు అన్నదే చర్చగా ఉంది.
అధినేత అధినాయకత్వం ఎంత సీరియస్ గా ఉంటే అంతగా పార్టీ పరుగులు తీస్తుంది. అంతే కాదు ఇష్యూ మీద వారి ఫోకస్ ఏ విధంగా ఉందో గమనించి దిగువ స్థాయిలో క్యాడర్ లీడర్ రంగంలోకి దిగుతారు. కానీ వైసీపీ అధినాయకత్వం అయితే ఇంత పెద్ద ఇష్యూ జరుగుతూండంగా ఈ విధంగా విదేశాలకు వెళ్ళడం మీదనే చర్చ సాగుతోంది. జగన్ విదేశాలకు వెళ్లడం తప్పు పట్టరు, అలాగే ఫ్యామిలీ టూర్ వేయడాన్ని ఎవరూ నిందించరు కానీ కరెక్ట్ టైం లో పార్టీ ఒక స్టాండ్ తీసుకుని కూటమి మీద పోరాడుతున్న నేపథ్యంలో జనాలలో ఇపుడిపుడే వైసీపీ మీద కొంత డిస్కషన్ సాగుతున్న నెపథ్యంలో ముందుండి నడిపించాల్సిన అధినేత ఫారిన్ టూర్ చేయడం వల్ల సీరియస్ నెస్ ఇష్యూ మీద క్యాడర్ లోనే కాదు జనంలోనూ తగ్గుతుందేమో అన్న చర్చ అయితే ఉంది అని అంటున్నారు.
ఇక అధినేత రిలాక్స్ మూడ్ లో ఉంటూ తమకు టాస్క్ ఇచ్చారని కనుక క్యాడర్ అనుకుంటే మొత్తానికే పడిన శ్రమ వృధా అవుతుందని అంటున్నారు. అంతే కాదు ఈ విషయంలో ఇచ్చిన ప్రకారం క్యాడర్ అనుకున్నంత చురుకుగా జోష్ తో వస్తుందా అన్నదే చర్చగా ఉందిట. ఏది ఏమైనా జగన్ దేశంలో లేని ఈ పది రోజులలోనూ వైసీపీ ఉద్యమం ఏ విధంగా చేస్తుంది మెడికల్ వార్ పీక్స్ లో ఉన్న దశలో ఆ వేడిని ఏ విధంగా కంటిన్యూ చేస్తుంది అన్నది చూడాల్సి ఉంది అని అంటున్నారు.