అన్యాయం, అక్రమం, పీడనం… ఇవన్నీ సమాజంలో అడ్డగోలుగా నడుస్తున్న రోజుల్లో ఉన్నత విద్యావంతుడైన ఓ యువకుడు ప్రజల కోసం తుపాకీ పట్టుకున్నాడు. అతని పేరు మల్లోజుల వేణుగోపాలరావు. పేదల కోసం, పీడిత వర్గాల కోసం సమానత్వ సమాజాన్ని నిర్మించాలనే తపనతో ఆయన అరణ్యాల్లోకి అడుగుపెట్టారు. అప్పటి నుంచి ఆయన జీవితం అడవుల్లోనే సాగింది. విప్లవమే మార్గమని, తుపాకీ ద్వారానే సమాజ మార్పు సాధ్యమని నమ్మిన ఆయన చివరికి ఆ తుపాకీని నేలకేసి వేశారు.
వేణుగోపాలరావు మావోయిస్టు పార్టీలో కేంద్ర కమిటీ, పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఎదిగారు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, కోయ భాషల్లో అనర్గళంగా మాట్లాడగల ఆయన దండకారణ్యం ప్రాంతంలో ప్రజా ప్రభుత్వాన్ని నడిపించారు. అనేక ఉద్యమాలు, హింసాత్మక ఘటనల్లో కీలకపాత్ర పోషించారు. పీడిత ప్రజల కోసం పోరాడుతూ తన జీవితాన్ని అంకితం చేశారు. అయితే, చివరికి ఆయనలో ఆలోచనల మార్పు వచ్చింది. హింసతో కాదు, చర్చలతోనే ప్రజల మేలు సాధ్యమని ఆయన గుర్తించారు. అదే దిశగా వేణుగోపాలరావు ముందడుగు వేశారు.
మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో వేణుగోపాలరావు 60 మంది మావోయిస్టు దళ సభ్యులతో కలిసి పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఈ నిర్ణయాన్ని చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విజయవర్మ స్వాగతించారు. “మావోయిస్టు నేతలు ప్రజా స్రవంతిలో కలవాలి. హింస అంతం కావాలి. ఇదే ప్రజల ఆకాంక్ష,” అని సీఎం తెలిపారు. వేణుగోపాలరావు ఇప్పటికే ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఒక కీలక లేఖ విడుదల చేసి.. “ఇకపై ఆయుధాలను వదిలి శాంతి చర్చలకు సిద్ధం” అని ప్రకటించారు. ఆయన లేఖలో “ప్రజల కోసం తుపాకీ పట్టుకున్నాం. కానీ ఇప్పుడు అదే ప్రజల ప్రాణాలు తీస్తోంది. ఇక హింస మార్గం కాదు. విప్లవం కొనసాగాలంటే ప్రజల్లోకి వెళ్ళాలి, తుపాకీని వదిలేయాలి” అని పేర్కొన్నారు.
వేణుగోపాలరావు లేఖలో భావోద్వేగం, బాధ, పరిణితి కనిపించాయి. “వందలమంది మావోయిస్టులు చనిపోతున్నారు. పార్టీ కష్టకాలంలో ఉంది. పిడివాదం పెరిగింది. మిగిలిన వారిని కాపాడుకోవాలంటే శాంతి మార్గమే మార్గం” అని ఆయన రాశారు. అయన నిర్ణయాన్ని కొందరు మావోయిస్టు నేతలు వ్యతిరేకించినా, ఆయన వెనుకడుగు వేయలేదు. చివరికి తనతో ఉన్న దళ సభ్యులతో కలిసి ప్రభుత్వానికి లొంగిపోయారు.
వేణుగోపాలరావు తుపాకీని వదిలిన ఈ నిర్ణయం మావోయిస్టు ఉద్యమంలో ఒక కొత్త దిశను చూపిస్తుంది. హింస కంటే సంభాషణలు, మార్పు కంటే మార్పు దిశలో ఆలోచన.. ఇవే ఆయన సందేశం. దండకారణ్యంలో ఎన్నో సంవత్సరాల పాటు విప్లవ దీపాన్ని వెలిగించిన ‘మల్లోజుల’ ఇప్పుడు శాంతి దీపాన్ని వెలిగించారు. తుపాకీతో మొదలైన ఈ ప్రయాణం చివరికి శాంతితో ముగిసింది. మల్లోజుల వేణుగోపాలరావు కథ.. విప్లవం నుండి విశ్రాంతి దిశగా ఒక ఆలోచనాత్మక మార్గం.
మావోయిస్టు పార్టీ కేంద్ర నాయకత్వం చరిత్ర లో ఒక్క సారి కలవర పడిన దినంగా అక్టోబర్ 14 నిలిచిపోతుంది.కారణం ఆపార్టీ చరిత్రలో 60 మంది పార్టీ నాయకులు ఆయుధాలతో ఇద్దరు సీసీ సభ్యులు కలిసి లొంగిపోయిన సంచలనం చోటుచేసుకుంది.
సీపీఐ (మావోయిస్ట్) పొలిట్ బ్యూరో మెంబర్ మల్లోజుల వేణుగోపాల్ రావు అలియాస్ అభయ్ అలియాస్ సోను ఇవాళ మహారాష్ట్రలోని గడ్చిరోలి లో ఆయుధాలను వదిలిపెట్టి పోలీసుల ఎదుట లోంగిపోయినట్లుగా మంగళ వారం మీడియా లో వార్తలు వచ్చాయి.
మావోయిస్టు పార్టీ మూల సిద్ధాంతం మీద నమ్మకం లేని నాయకులు తుపాకీ సంస్కృతి వీడేందుకు సిద్ధంగా ఉన్నారని రుజువు చేశారు.పార్టీ నాయకులు ఎన్కౌంటర్ లో సీసీ ముఖ్యులు ఓ వైపు నేల కూలుతున్న సమయంలో ముక్కమిడిగా వనవాసం విడిచి పెట్టి మరీ తుపాకులతో బయటకు వచ్చిన తీరు విప్లవ రాజకీయాలకు షాక్ ఇచ్చింది.
ఆయనతో పాటు మరో 60 మావోయిస్టు పార్టీ సభ్యులు కూడా అస్త్ర సన్యాసం చేసినట్లుగా తెలుస్తోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశాల మేరకు దేశ వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో పోలీసులు, భద్రతా బలగాలు నిర్వహిస్తున్న ‘ఆపరేషన్ కగార్’ ఇప్పటికే తీవ్ర రూపం దాల్చింది. వరుస ఎన్‌కౌంటర్లలో వందల కొద్దీ మావోయిస్టులు ప్రాణాలు కోల్పోతున్నారు.
ఈ నేపథ్యంలోనే ఇటీవల మల్లోజుల వేణుగోపాల్ రావు అలియాస్ అభయ్ తాము ఆయుధాలు వదిలి పెట్టేందుకు సిద్ధమని ప్రతికా ప్రకటన చేశారు. నెల రోజులుగా జరుగుతున్న పరిణామాలను గమనించిన తర్వాత కూడా ఆయన నిర్ణయానికి ఛత్తీస్‌గఢ్‌తో సహా దేశంలోని ఇతర మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోని కేడర్లు కూడా మద్దతు తెలిపాయి. దీంతో ఇవాళ మల్లోజుల వేణుగోపాల్ రావు మహారాష్ట్రలోని గడ్చిరోలిలో పోలీసుల ఎదుట ఆయుధాలను వదిలేసి లొంగిపోయారు.
అయితే మల్లోజుల సహా పలువురు మావోయిస్టులు ఆయనను అనుసరిస్తూ వచ్చారు. ఈ క్రమంలో మహారాష్ట్ర ప్రభుత్వం ముఖ్య మంత్రి ఫడ్నవిస్ సమక్షంలో లొంగుబాటు చూపించే ప్రయత్నాలు ప్రారంభించారు.రేపు ఉదయం లేదా సాయంత్రం ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించి మావోయిస్టుల సరాండార్ ను చూపించే అవకాశం ఉంది.
మల్లోజుల వేణుగోపాల్ తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లా పెద్దపల్లిలో నజన్మించారు. అన్న మల్లోజుల కోటేశ్వర రావు (కిషన్‌జీ)ను విప్లవ స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని మావోయిస్టు పార్టీలో చేరి అత్యంత కీలక వ్యవహరించారు. 2011 నవంబరు 24న బెంగాల్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో అన్న మల్లోజుల కోటేశ్వర రావు అలియాస్ కిషన్‌జీ మృతి చెందారు. తదనంతర పరిణామాల నేపథ్యంలో మావోయిస్ట్ కమాండర్ అయిన మల్లోజుల వేణుగోపాల్ భార్య తారాక్క కూడా మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఎదుట లొంగిపోయారు. ఆమె గడ్చిరోలి రీజియన్‌లో మోస్ట్ వాంటెడ్ నక్సల్స్ లిస్టులో కూడా ఉన్నారు.
కామ్రేడ్ మల్లోజుల వేణుగోపాల్ పూర్వ పీపుల్స్‌వార్ గ్రూపులో భూపతి, సోనూ, మాస్టర్, అభయ్ వంటి పేర్లతో పని చేశారు. అదేవిధంగా మావోయిస్టు పార్టీలో చేరాక మహారాష్ట్రలోని గడ్చిరోలి ప్రాంతంలో దండకారణ్య ప్రత్యేక జోనల్ కమిటీకి అధిపతిగా ఉన్నారు. దక్షిణ భారత దేశంలోని పశ్చిమ కనుమలకు రెండు వైపులా, కేరళలోని గోవా నుంచి ఇడుక్కి వరకు ఉన్న గెరిల్లా జోన్‌ను నెలకొల్పడంలో కీలక పాత్ర పోషించారు. పార్టీలో చెరుకూరి రాజ్‌కుమార్ (ఆజాద్) మరణం తరువాత ఆయన సీపీఐ (మావోయిస్టు) పార్టీకి అధికార ప్రతినిధిగా నియమితులయ్యారు. అతను పార్టీలో ప్రచురణల విభాగంలో నిర్వహణ బాధ్యతలను స్వీకరించారు. ఏప్రిల్ 2010 దంతెవాడ ఘటనలో 76 మంది సెంట్రల్ రిజర్వ్ పోలీసు ఫోర్సు కు చెందిన పోలీసుల మరణానికి వెనుక మల్లోజుల హస్తం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు అనుమానిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ పోలీసులు మల్లోజులపై భారీ ఎత్తున రివార్డులు ప్రకటించారు. మల్లోజుల కోటేశ్వర రావు అలియాస్ కిషన్‌జీ మరణం తరువాత వేణుగోపాల్ రావు పశ్చిమ బెంగాల్‌లో ఆపరేషన్ గ్రీన్ హంట్‌కు వ్యతిరేకంగా జరిగిన ‘లాల్‌గడ్ ‘ఉద్యమానికి నాయకుడిగా నియమితులయ్యారు