పవన్ కళ్యాణ్ కెరీర్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న OG సినిమా ప్రస్తుతం ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొల్పింది. ముంబై అండర్‌వర్‌ల్డ్ నేపథ్యంగా సాగే ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో పవన్ ఓ గ్యాంగ్‌స్టర్ అవతారంలో అలరించబోతున్నాడు. దర్శకుడు సుజీత్ ఈ సినిమాను రూపొందిస్తుండగా, తమన్ సంగీతం, డీవీవీ దానయ్య నిర్మాణ విలువలు మరో లెవెల్‌లో ఉండబోతున్నాయని తెలుస్తోంది.
ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌తో సినిమాపై హైప్ నెక్ట్స్ లెవెల్‌కు వెళ్లింది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ రైట్స్ చుట్టూ ఆసక్తికర చర్చలు నడుస్తున్నాయి. ఉత్తరాంధ్ర, ఈస్ట్ గోదావరి రైట్స్ కోసం కాకినాడ ఎంపీగా ఉన్న జనసేన నేత ఉదయ్ మరియు ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ సత్యనారాయణ కలిసి ముందుకు వచ్చారని టాక్. ఒకరికి రాజకీయ బలం, మరొకరికి మార్కెట్‌లో గుర్తింపు ఉండటంతో ఈ డీల్ గట్టిగానే చర్చల్లో ఉంది.
ఇప్పటివరకు అధికారికంగా ఏమీ వెల్లడి కాకపోయినా, వీరిద్దరూ కలిసి OG హక్కులను సొంతం చేసుకుంటే, అది ఫ్యాన్స్‌లో నూతన ఉత్సాహాన్ని నింపే అంశమే. ఎందుకంటే పవన్ సినిమాలంటేనే ఈ రీజియన్లలో క్రేజ్ అమాంతం పెరిగిపోతుంది. గతంలో వకీల్ సాబ్, భీమ్లా నాయక్ సినిమాలు ఈ రెండు ప్రాంతాల్లో ఘన వసూళ్లు సాధించాయి.
రిలీజ్ డేట్‌గా సెప్టెంబర్ 27ను టార్గెట్ చేస్తూ బిజీగా షెడ్యూల్ ప్లాన్ చేస్తుండగా, OG రైట్స్ పోరు ఇప్పటినుంచే వేడెక్కుతోంది. పెద్ద డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు కూడా ఈ సినిమాపై కన్నేసినట్లు తెలుస్తోంది. అయితే, ఉదయ్ సత్యనారాయణ కాంబో ముందుగానే చర్యలు తీసుకోవడం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. అయితే వీరి రేటు ఎంత? డీల్ ఖరారు అయ్యిందా? అన్న విషయాలపై ఇంకా క్లారిటీ రాలేదు.
పవన్ కళ్యాణ్ ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫుల్ బిజీ అయ్యారు. ఇంత బిజీ షెడ్యూల్లో కూడా పవన్ కళ్యాన్ తాను ఒప్పుకున్న సినిమాలను పూర్తి చేసే పనిలో పడ్డాడు. ఇప్పటికే ఈయన హీరోగా ‘హరిహర వీరమల్లు’ సినిమా రెండు భాగాలుగా రాబోతుంది. తాజాగా ‘హరి హర వీరమల్లు’ సినిమా ఫస్ట్ పార్ట్ కు సంబంధించిన షూటింగ్ పూర్తైయింది. దీంతో త్వరలో ఈ సినిమా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేయనున్నారు.
మరోవైపు హరి హర వీరమల్లు రెండో పార్ట్ కూడా త్వరలో పూర్తి చేయనున్నారు. ఆ సినిమా కాకుండా సుజిత్ దర్శకత్వంలో ‘ఓజీ’ సినిమా చేస్తున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ దాదాపు పూర్తి చేశారు. మరో 30 రోజులు డేట్స్ ఇస్తే ఈ మూవీ షూటింగ్ పూర్తవుతోంది. తాజాగా పవన్ కళ్యాణ్ ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేయనున్నారు. మరో వారంలో ఈ సినిమా షూటింగ్ లో పవన్ జాయిన్ కానున్నారు. హీరో, విలన్ మధ్య సన్నివేశాలతో ఈ సినిమా షూటింగ్ పూర్తి కానుంది.
ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసి త్వరలో రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేయనున్నారు. దీంతో పాటు పవన్ కళ్యాణ్.. హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాను పూర్తి చేయనున్నారు. మొత్తంగా పవన్ కళ్యాణ్ ఓ వైపు రాజకీయాలు చేస్తూనే నెలలో 10 నుంచి 15 రోజులు పాటు సినిమా షూటింగ్ లకు కేటాయించనున్నారు. దీంతో ఇప్పటికే ఒప్పుకున్న సినిమాలు..సగంలో ఉన్న సినిమాలు పూర్తి చేసి పూర్తిగా సినిమాలపైనే దృష్టి కేంద్రీకరించబోతున్నట్టు సమాచారం.