రెబల్ స్టార్ ప్రభాస్ రాజా సాబ్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమవుతుంది మళయాల భామ మాళవిక మోహనన్. ఇదివరకు తమిళ డబ్బింగ్ సినిమాలతో తెలుగు ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ అమ్మడు డైరెక్ట్ తెలుగు సినిమా సైన్ చేసింది మాత్రం రాజా సాబ్ తోనే. ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ తో ఛాన్స్ అంటే అమ్మడి దశ తిరిగినట్టే అనుకున్నారు. మారుతి డైరెక్షన్ లో రాబోతున్న రాజా సాబ్ సినిమాలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ ఇద్దరు హీరోయిన్స్ గా నటిస్తున్నారు.
థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్ బాగా వస్తుంది అన్న టాక్ అయితే ఉంది. ఐతే మళయాళంలో సినిమాలు చేస్తూ ఉన్నా కూడా మాళవికకు ఆశించిన రేంజ్ లో స్టార్డం రాలేదు. స్టార్ మెటీరియల్ కి ఏమాత్రం తగ్గని అమ్మడి అందానికి ఎందుకో ఆశించిన విధంగా లక్ కలిసి రావట్లేదు. అందుకే అమ్మడు ప్రస్తుతం తన హోప్స్ అన్నీ కూడా రాజా సాబ్ మీద పెట్టుకుంది. ప్రభాస్ సినిమా అంటే నేషనల్ లెవెల్ లో బజ్ ఉంటుంది. సో ఈ సినిమా సక్సెస్ అయితే మాళవిక గురించి అందరు చర్చించే ఛాన్స్ ఉంటుంది. రాజా సాబ్ తో పాటు అమ్మడు కోలీవుడ్ స్టార్ కార్తితో సర్దార్ 2 సినిమా చేస్తుంది అమ్మడు. అంతేకాదు మళయాళంలో కూడా హృదయపూర్వం అనే సినిమా చేస్తుంది అమ్మడు. రాబోతున్న సినిమాల్లో ప్రభాస్ రాజా సాబ్ ఒక్కటి హిట్ పడితే మాత్రం తప్పకుండా అమ్మడి ఫేట్ మారే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు.
ప్రభాస్ రాజా సాబ్ ఈ సమ్మర్ రిలీజ్ అనుకోగా అది కాస్త డిసెంబర్ కి వాయిదా వేశారు. మారుతి మాత్రం ఈ సినిమా విషయంలో చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. థమన్ మ్యూజిక్ అందిస్తున్న రాజా సాబ్ సినిమా విషయంలో ప్రతిదీ చాలా స్పెషల్ గా ఉండబోతుందని తెలుస్తుంది. రాజా సాబ్ సినిమా నుంచి అప్డేట్స్ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. త్వరలోనే సినిమా నుంచి టీజర్ రాబోతుందని తెలుస్తుంది. సినిమాలో స్పెషల్ సర్ ప్రైజ్ లు చాలా ఉన్నాయని అంటున్నారు. ఇన్నేళ్ల ఫ్యాన్స్ నిరీక్షణకు తప్పకుండా డబుల్ ట్రీట్ అందించేలా ఉంటుందని చిత్ర యూనిట్ గట్టి నమ్మకంతో చెబుతున్నారు.