మలయాళ నటిగా పేరు సంపాదించిన మాళవికా మేనన్.. తెలుగు, తమిళ్, మలయాళం వంటి భాషలలో కూడా నటించి, ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. ఎక్కువగా తన మాతృభాషలో నటిస్తూ కోలీవుడ్ లో కూడా పలు అవకాశాలను అందుకుంటోంది. తెలుగులో అయితే అమ్మాయిలు అంటే అదో రకం, వందనం తదితర చిత్రాలలో నటించింది. అయితే ఈమెకు మాత్రం తెలుగులో పెద్దగా క్రేజ్ రాకపోవడంతో అవకాశాలు కూడా తగ్గిపోయాయి. నిత్యం సోషల్ మీడియాలో మాత్రం చాలా స్టైలిష్ లుక్ లో గ్లామర్ ని వలకబోస్తూ హైలెట్ గా నిలుస్తూ ఉంటుంది మాళవిక మేనన్.
మాళవిక మేనన్.. అవకాశాల కోసమే గ్లామరస్ గా కనిపించడానికి సిద్ధమయ్యిందని.. ఈమె ఫోటోలను చూస్తే అర్థమవుతుంది అంటూ పలువురు కామెంట్లు చేశారు. పైగా గతంలో ఇదే విషయంపై ప్రశ్నించగా.. గ్లామర్ గా నటించడంలో ఎలాంటి తప్పు లేదని, మలయాళ చిత్రాలలో గ్లామర్ గా నటించే అవకాశం ఉండదని, కేవలం తెలుగు, తమిళ వంటి భాషలలో మాత్రమే అలా నటించవచ్చంటూ వెల్లడించింది. అంతేకాదు తాను గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తేనే మీరు ఇలా అడుగుతున్నారు కదా.. తాను ఒక్కటే ఇలా చేయడం లేదు కదా అంటూ కూడా గట్టి కౌంటర్ వేసింది.
అలా ఎప్పటికప్పుడు తన ఫోటోలపై వచ్చే ట్రోల్స్ కి గట్టి కౌంటర్ ఇచ్చే ఈ ముద్దుగుమ్మ.. తాజాగా ఓనమ్ పండుగ స్పెషల్ సందర్భంగా.. మరో కొన్ని ఫోటోలను ఇంస్టాగ్రామ్ వేదికగా పంచుకుంది. అందులో కేరళ సాంప్రదాయ చీరకట్టులో కనిపించడమే కాకుండా.. హాట్ అందాలను వలకబోస్తూ మైమరిపిస్తోంది. ఒక్కో ఫోటోలో ఒక్కో రకమైన స్టిల్స్ ఇస్తూ హైలెట్ అవుతోంది మాళవిక మేనన్. ఈ ఫోటోలను ఈమె అభిమానులు లవ్ ఎమోజీలతో తెగ వైరల్ గా చేస్తున్నారు. మొత్తానికి తన క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో మాళవిక మేనన్ షేర్ చేసిన ఈ ఫోటోలు ఓనం పండుగని హైలెట్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇక సాంప్రదాయ కేరళ దుస్తుల్లో కనిపించిన ఈమె అందుకు తగ్గట్టుగా సింపుల్ జువెలరీతో తన లుక్ ను ఫినిష్ చేసింది.
మాళవిక మేనన్ కెరియర్ విషయానికి వస్తే.. 1998 మార్చి 6న కేరళ కొడుంగల్గూర్ లో జన్మించింది.2011లో సహాయనటిగా కెరియర్ ప్రారంభించిన ఈమె.. 2012లో ‘916’ అనే సినిమా ద్వారా హీరోయిన్గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఎక్కువగా మలయాళం , తమిళ్ చిత్రాలలో నటించిన ఈమె ‘అమ్మాయిలు అంటే అదో రకం’ అనే సినిమా ద్వారానే తెలుగు ప్రేక్షకులను పలకరించింది. 2022లో వచ్చిన పురు, కడువా అనే మలయాళం చిత్రాలలో చివరిగా నటించింది. ఒక అప్పటినుంచి మరో సినిమాలో నటించలేదు. కానీ ఇప్పుడు నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ప్రేక్షకులను గ్లామర్ తోనే కట్టిపడేసే ప్రయత్నం చేస్తోంది. ఇక ఈమె నటి మాత్రమే కాదు మంచి డాన్సర్ కూడా.
Malavika Menon 🤩 #MalavikaMenon pic.twitter.com/k8ovfFxre3
— news7telugu (@news7telug2024) September 6, 2025