సోషల్ మీడియా వల్ల ఎంత ప్రయోజనం ఉంటుందో నష్టం కూడా అంతే ఉంటుంది. సోషల్ మీడియా వల్ల ఇప్పటికే చాలా మంది ఎన్నో రకాల ఇబ్బందులకు గురయ్యారు. ముఖ్యంగా సెలబ్రెటీలు.. చాలా మంది సినీ సెలబ్రెటీలు సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ బిజీగా ఉంటారు. తమ సినిమా అప్డేట్స్ తో పాటు వ్యక్తిగత విషయాలను కూడా పంచుకుంటూ ఉంటారు. అయితే చాలా మందికి సోషల్ మీడియాలో ట్రోల్స్ బారిన పడుతూ ఉంటారు. కొంతమంది నెటిజన్స్ సీలబ్రెటీలను ట్రోల్స్ చేస్తూ ఉంటారు. అయితే కొంతమంది హీరోయిన్స్ అభిమానులతో సోషల్ మీడియాలో ముచ్చటిస్తూ ఉంటారు. అయితే కొంతమంది నెటిజన్స్ పిచ్చి పిచ్చి ప్రశ్నలతో హీరోయిన్స్ ను విసిగిస్తూ ఉంటారు. తాజాగా ఓ హీరోయిన్ కు కూడా ఇలాంటి సమస్యే ఎదుర్కొంది.
ఇంతకీ నువ్వు వర్జినా కదా చెప్పు అని ఓ నెటిజన్ హీరోయిన్ ను ప్రశ్నించాడు.. దానికి ఆ హీరోయిన్ అదిరిపోయే అన్సర్ ఇచ్చింది. ఇంతకూ ఆ హీరోయిన్ ఎవరో తెలుసా.? ఆమె మరెవరో కాదు మాళవిక మోహనన్. ఈ ముద్దుగుమ్మ చేసింది తక్కువ సినిమాలే కానీ క్రేజ్ మాత్రం విపరీతంగా సొంత చేసుకుంది. మాళవిక మోహనన్ 7 ఆగస్టు 1992న ముంబైలో జన్మించింది. ఆమె తండ్రి యుకె మోహనన్ బాలీవుడ్ చిత్రాలకు ప్రసిద్ధ సినిమాటోగ్రాఫర్. తల్లి వీణా మోహనన్. ఆమె ప్రస్తుతం తన స్వస్థలమైన కేరళ బియ్యూర్‌లో తన కుటుంబంతో నివసిస్తుంది.
మాళవిక మోహనన్ హీరోయిన్ గా రాణిస్తుంది. ఈ ముద్దుగుమ్మ 2013 సంవత్సరంలో “బట్టం బోలే” చిత్రంతో మలయాళ చిత్రసీమలోకి అడుగుపెట్టింది. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన పెట్టా చిత్రంలో నటించి తమిళ అభిమానుల దృష్టిని ఆకర్షించిన నటి మాళవిక మోహనన్. ఆ తర్వాత నటుడు విజయ్ సరసన లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో మాస్టర్ సినిమాలో నటించి అభిమానుల గుండెల్లో స్థానం సంపాదించుకుంది. ఇప్పుడు ప్రభాస్ హీరోగా నటిస్తున్న రాజా సాబ్ సినిమాతో ఈ అమ్మడు టాలీవుడ్ కు పరిచయం కానుంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ అమ్మడు సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటించింది. ఓ నెటిజన్ ఈ చిన్నదాన్ని వర్జినా కదా చెప్పు.? అని అడిగాడు. దానికి అదిరిపోయే ఆన్సర్ ఇచ్చింది. ఈ రకమైన చెత్త ప్రశ్నలు ఎందుకు అడుగుతున్నారు. ఇలాంటివి అడగడం మానేయండంటూ కౌంటరిచ్చింది. ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.