తనదైన అందం, ప్రతిభతో నిరంతరం యువతరం దృష్టిని ఆకర్షిస్తున్న మలైకా అరోరా యాభై వయసులోను స్టన్నర్ అని నిరూపిస్తోంది. తాజాగా పాపులర్ మ్యాగజైన్ రూపొందించిన `షోస్టాపర్` కార్యక్రమంలో మలైకా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ముఖ్యంగా మలైకా ఈ కార్యక్రమం కోసం ఎంపిక చేసుకున్న సిల్వర్ కలర్ డిజైనర్ డ్రెస్ ప్రత్యేక ఆకర్షణగా మారింది. మెడలో అందమైన వెండి నెక్లెస్ అందరి దృష్టిని ఆకర్షించింది.
మలైకా ఏజ్ లెస్ బ్యూటీగా మెరిసిపోతోంది అంటూ అభిమానులు ఈ ఫోటోషూట్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. వయసు పెరిగే కొద్దీ మలైకా షైన్ అవుతోందని కొందరు నెటిజనులు కాంప్లిమెంట్లు ఇస్తున్నారు. చాలా మంది లవ్, హార్ట్ ఈమోజీలను షేర్ చేస్తూ ఈ సీనియర్ భామపై ప్రేమను కురిపిస్తున్నారు. మలైకా చయ్యా చయ్యా గాళ్ గా తెలుగు ప్రజలకు కూడా సుపరిచితురాలు. పవన్ కల్యాణ్ గబ్బర్ సింగ్ లో కెవ్వు కేక ప్రత్యేక గీతంలోను నర్తించింది. ఆ తర్వాత ఈ భామకు సౌత్ లో అంతగా అవకాశాల్లేవ్. బాలీవుడ్ లో అడపా దడపా ఐటమ్ పాటల్లో నర్తిస్తోంది. తదుపరి రష్మిక- ఆయుష్మాన్ జంటగా నటిస్తున్న థామ చిత్రంలోను మలైకా ఒక స్పెషల్ పాత్రలో కనిపించనుంది. మరోవైపు బుల్లితెర రియాలిటీ షోల జడ్జిగాను మలైకా ఆర్జిస్తోంది. ఇక ముంబైలో నిరంతరం క్యాట్ వాక్ ఈవెంట్లను మలైకా మిస్ కావడం లేదు. సోషల్ మీడియాల్లో అద్భుతమైన ఫాలోయింగ్ ఉన్న ఈ బ్యూటీ తన అభిమానులను ఎప్పడూ నిరాశపరచదు. రెగ్యులర్ గా ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ యంగేజ్ చేస్తూనే ఉంది. మలైకా ఇన్ స్టాలో షేర్ చేసిన తాజా ఫోటోషూట్ ఇంటర్నెట్ లో వైరల్ గా మారుతోంది.
#MalaikaArora serving looks, as always 💫 pic.twitter.com/SqfEq1I943
— news7telugu (@news7telug2024) August 29, 2025