సూపర్ స్టార్ మహేష్ ఎంత బిజీ స్టారో తెలిసిందే. ఐతే ఆయన ఎంత పెద్ద స్టార్ హీరో అయినా ఫ్యామిలీకి ఇవ్వాల్సినంత టైం ఇస్తాడు. తెలుగు హీరోల్లో మహేష్ వెళ్లినన్నిసార్లు ఫారిన్ ట్రిప్స్ మరో హీరో తన ఫ్యామిలీతో వెళ్లి ఉండడు. సినిమాలు, ఫ్యామిలీ రెండిటినీ చాలా బ్యాలెన్స్ గా చేస్తూ వస్తాడు మహేష్. అందుకే మహేష్ ని అందరు ఫ్యామిలీ మ్యాన్ అని అంటారు. సినిమా సినిమా మధ్య గ్యాప్ లో మహేష్ ఫ్యామిలీతో కలిసి అలా ఒక వెకేషన్ కి వెళ్లి సినిమా కోసం పడిన కష్టాన్ని అంతా కూడా మర్చిపోతాడు.
ఐతే మహేష్ గుంటూరు కారం సినిమా టైం లో ఒకే ఇయర్ లో తన తల్లిదండ్రులను తన బ్రదర్ ని కోల్పోయాడు. ఆ టైం లో తన బాధ బయట పెట్టకుండా మహేష్ ఫ్యామిలీని చాలా బాగా చూసుకున్నారని. తన బాధని తానే దిగమింగుకుని బయటకు మాత్రం ఏమి కనబడనివ్వలేదని అన్నారు మహేష్ మరదరు శిల్పా శిరోద్కర్. నమ్రత సోదరి అయిన ఆమె మహేష్, నమ్రతల గురించి సూపర్ స్టార్ ఫ్యామిలీ గురిచి అప్పుడప్పుడు మాట్లాడుతుంది. మహేష్ తన పేరెంట్స్ తో పాటు అతి తక్కువ టైంలోనే అన్నయ్యని కోల్పోవడం తో ఆ టఫ్ టైం ని చాలా స్ట్రాంగ్ గా హ్యాండిల్ చేశాడు. ఫ్యామిలీ మెంబర్స్ కి సపోర్ట్ గా ఉన్నాడని అన్నారు శిల్పా శిరోద్కర్. ఇక తన సోదరి నమ్రత గురించి చెబుతూ తనంటే నాకు చాలా ఇష్టమని అన్నారు శిల్ప. నమ్రత కూడా నన్ను అంతే బాగా ఇష్టపడుతుందని అన్నారు.
శిల్పా బాలీవుడ్ లో కొన్ని సినిమాలు చేశారు. 90ల్లో సినిమాలు చేసిన ఆమె తర్వాత మళ్లీ మూవీస్ చేయలేదు. ఐతే ఈమధ్యనే బిగ్ బాస్ సీజన్ 18 లో శిల్పా శిరోద్కర్ వన్ ఆఫ్ ది కంటెస్టెంట్ గా వెళ్లారు. బాలీవుడ్ లో మహేష్ ఫ్యామిలీ గురించి శిల్పా చెప్పే కొన్ని విషయాలు మన సూపర్ స్టార్ ఫ్యాన్స్ ని ఎగ్జైట్ చేస్తాయి. మహేష్ సినిమాల విషయానికి వస్తే రాజమౌళితో మూవీ సెట్స్ మీద ఉంది. ఈ సినిమాను 2027 లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. మహేష్ బర్త్ డే సందర్భంగా ఆగ్ష్టు 9న ఎస్.ఎస్.ఎం.బి 29 ఏదైనా అప్డేట్ వస్తుందేమో అని ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఐతే రాజమౌళి ముందు పోస్టర్ అయినా వదులుదామని అనుకోగా సినిమాకు ఇంకా చాలా టైం ఉంది కాబట్టి ఏమి అవసరం లేదన్నట్టుగా అంటున్నారట. మరి ఆగష్టు 9న మహేష్ రాజమౌళి సినిమా అప్డేట్ ఏదైనా ఉంటుందా లేదా అన్నది మరికొద్ది రోజుల్లో తెలుస్తుంది.