ఇటీవల రిలీజ్ అయిన యానిమేషన్ చిత్రం `మహావతార్ నరసింహ` ఎంత పెద్ద సక్సెస్ సాధించిందో తెలిసిందే. 20 కోట్ల బడ్జెట్ లో నిర్మించిన సినిమా బాక్సాఫీస్ వద్ద 300 కోట్ల వసూళ్లను సాధించింది. దీంతో యానిమేషన్ చిత్రాల్లో మహావతార్ ఓ రికార్డుగా నిలిచింది. అందులోనూ సౌత్ లో ఓ సంచనలంగా నిలి చింది. దీంతో ఈ సినిమా ఓటీటీ రైట్స్ కోసం తీవ్ర పోటీ నెలకొంది. టాప్ కంపెనీలన్నీ హక్కుల కోసం ప్రయత్నిస్తున్నాయి. ఎన్ని కోట్లు ఇచ్చైనా కొనేయాలని ఓటీటీలు పరుగులు పెడుతున్నాయి.
ఓటీటీల కండీషన్స్ :
నిర్మాతలు మాత్రం బిగ్ డీల్ కు సెట్ అయ్యేలా అన్ని ఓటీటీలతోనూ మంతనాలు జరుపుతున్నారు. ఓటీటీ రైట్స్ పరంగానూ రికార్డు దిశగానే ఉంటుందని చెప్పొచ్చు. ఈ మధ్య కాలంలో ఏ సినిమా కోసం ఓటీటీలు ఇలా పోటీ పడలేదు. ఓటీటీ సంస్థలు కొత్త సినిమా కొనాలంటే ఎలాంటి కండీషన్స్ పెడుతు న్నాయో తెలిసిందే. స్టార్ హీరోల చిత్రాలు సైతం శాషించే స్థాయికి ఓటీటీలు ఎదిగాయి. వాళ్లు రిలీజ్ స్లాట్ ఇస్తే గానీ థియే ట్రికల్ రిలీజ్ డేట్ వేసుకునే పరిస్థితి నిర్మాతకు ఉండటం లేదు.
డేరింగ్ డెసీషన్ ఇది:
మా సినిమా కొనండని బ్రతిమలాడుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అలాంటిది ఓ యానిమేషన్ సినిమా కోసం ఓటీటీలు క్యూలో నిలబెట్టడం ఇదే తొలిసారి. బలమైన కంటెంట్ తో సినిమా తీస్తే ఓటీటీలే కాళ్ల దగ్గరకు వస్తాయని మహావతార్ రూపంలో మరోసారి రుజువైంది. అందులోనూ ఓభక్తి సినిమా కోసం పోటీ పడటం అన్నది ఓ చరిత్రగానే చెప్పాలి. ఈ సినిమాపై నమ్మకంతో నిర్మాతలు ముందుగానే ఓటీటీ కి విక్రయించుకుండా తెలివైన నిర్ణయం తీసుకోవడం విశేషం. థియేట్రికల్ రిలీజ్ కు ముందు అయితే ఏ ఓటీటీ ముందుకు రాదు.
ఓటీటీల మధ్య పోటీ:
భారీ ధర కూడా పలకని కంటెంట్ గా మిగిలిపోయేది. కానీ ఇప్పుడా ఓటీటీల మధ్య మహహావతార్ పోటీ పెట్టింది. ఎవరు ఎక్కువిస్తే వాళ్లకే రైట్స్ అనే సంకేతాలు పంపించేసింది. మరి ఈ సినిమా హక్కులు ఏ సంస్థ దక్కించుకుంటుందో చూడాలి. నిర్మాతలు కూడా బలమైన కంటెంట్ తో సినిమాలు తీయాలని ఇలాంటి సినిమాలతో తెలుసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. నిర్మాత అంటే కేవలం పెట్టుబడి పెట్ట డమే కాదు. కథల ఎంపికలో సెలక్టివ్ గా ఉన్నప్పుడే ఇలాంటి అద్భుతాలు సాధ్యమవుతుందన్నది గ్రహించాలి.