శివ కార్తికేయన్ హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో రూపొందిన ‘మదరాసి’ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. మురుగదాస్ గత చిత్రాల ఫలితాల నేపథ్యంలో ఈ సినిమా విషయంలో మొదటి నుంచే కాస్త నెగిటివ్ అభిప్రాయం ఉంది. తమిళనాట శివ కార్తికేయన్ అభిమానులు మదరాసి సినిమా కోసం వెయిట్ చేశారు, కానీ ఇతర భాషల్లో మాత్రం మదరాసి సినిమాకి పెద్దగా బజ్ క్రియేట్ కాలేదు. తెలుగులో సినిమాను డైరెక్ట్ మూవీ మాదిరిగా కాస్త ఎక్కువ థియేటర్‌లలోనే విడుదల చేశారు. కానీ ఫలితం పెద్దగా కనిపించడం లేదు. మొదటి రోజు డీసెంట్ ఓపెనింగ్స్ నమోదు అయినప్పటికీ ఆ తర్వాత నుంచి మినిమం వసూళ్లు సైతం రావడం లేదు అనేది బాక్సాఫీస్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. తమిళనాట మాత్రం ఈ సినిమాకు డీసెంట్ ఓపెనింగ్స్ నమోదు అయ్యాయి.
శివ కార్తికేయన్‌కి ఉన్న క్రేజ్ నేపథ్యంలో ఈ సినిమాకి మంచి ఓపెనింగ్స్ రావడంతో పాటు, లాంగ్ రన్‌లోనూ మంచి నెంబర్స్ ను నమోదు చేసే అవకాశాలు ఉన్నాయి. ఫస్ట్ వీకెండ్ పూర్తి అయ్యేప్పటికి స్ట్రాంగ్ గా సినిమా నిలిచింది అంటూ కోలీవుడ్ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. అయితే బ్రేక్ ఈవెన్ ఎంత వరకు సాధ్యం అనేది మాత్రం ఈ వీక్ డేస్‌లో వచ్చే వసూళ్లను బట్టి అర్థం అవుతుంది. తమిళనాట శివ కార్తికేయన్‌కి ఉన్న యూత్ ఫాలోయింగ్ కారణంగా మంచి వసూళ్లు నమోదు అయ్యాయి అని, కంటెంట్ విషయంలో దర్శకుడు మురుగదాస్ ఇంకాస్త బెటర్‌గా ప్రయత్నించి ఉండాల్సింది అనేది కొందరి మాట. సినిమా కంటెంట్ బాగుండి ఉంటే ఖచ్చితంగా శివ కార్తికేయన్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ మూవీగా ఈ సినిమా నిలిచేదని, మంచి కాంబోగా ఈ కాంబినేషన్ మిగిలేది అనేది తమిళ సినీ వర్గాల, మీడియా సర్కిల్స్ మాట.
దర్శకుడు ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో రూపొందిన కొన్ని సినిమాలు తమిళ్‌తో పాటు తెలుగులో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. తెలుగులోనూ ఆయన డైరెక్ట్ సినిమాలు చేసిన నేపథ్యంలో ఆయనపై కొందరికి నమ్మకం ఇప్పటికీ ఉంది. అయితే గత కొన్నాళ్లుగా ఆయన దర్శకత్వంలో వచ్చిన సినిమాలు, వస్తున్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడ్డాయి. ముఖ్యంగా బాలీవుడ్ మూవీ సికిందర్ ఏ స్థాయిలో డిజాస్టర్‌గా నిలిచిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సల్మాన్ బ్రాండ్ ఇమేజ్ సైతం సికిందర్ సినిమాను కాపాడలేక పోయింది. ఇప్పుడు మదరాసి సినిమా తెలుగులో పెద్దగా ఆడక పోవడంకు కారణం ఇక్కడ ఆ కంటెంట్ వర్కౌట్ కాలేదు అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అంతే కాకుండా తమిళ ఫ్లేవర్ ఎక్కువగా ఉండటం అనే రివ్యూలు వచ్చాయి.
శివ కార్తికేయన్‌కి తెలుగు రాష్ట్రాల్లో మంచి మార్కెట్ ఉంది. గత చిత్రాలతో ఆయన తెలుగు రాష్ట్రాల్లో మంచి వసూళ్లు సొంతం చేసుకున్న దాఖలాలు ఉన్నాయి. కానీ మదరాసి సినిమాలో తెలుగు ప్రేక్షకులను మెప్పించే విధంగా కంటెంట్ లేకపోవడంతో పాటు, దర్శకుడు మురుగదాస్ పై ఉన్న నెగిటివిటీ కారణంగా మదరాసి సినిమా గురించి చాల ఆమంది ప్రేక్షకులు కనీసం ఆలోచించడం లేదు అనేది బాక్సాఫీస్ వర్గాల అంచనా. ఆకట్టుకోని కథ, కథనంతో పాటు, మురుగదాస్ గత చిత్రాల ఫలితాల కారణంగా మదరాసి సినిమా తెలుగు రాష్ట్రాల్లో నిలువలేక పోయింది. సినిమా చేసిన బిజినెస్ కొంచమే అయినా బ్రేక్ ఈవెన్ కావడం సాధ్యం కాకపోవచ్చు అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. లాంగ్ రన్‌లో అయినా తెలుగు రాష్ట్రాల్లో మదరాసి మినిమం వసూళ్లు సాధిస్తుందేమో చూడాలి.