క్లాసీ అందంతో మతులు చెడగొట్టడంలో `ఉప్పెన` బ్యూటీ కృతి శెట్టి తర్వాతే. జెన్ జెడ్ స్టార్ గా కెరీర్ బండిని విజయవంతంగా ప్రారంభించిన కృతి కొన్ని వరుస ఫ్లాపులతో డీలా పడింది. అయినా ఇప్పటికీ అవకాశాలకు కొదవేమీ లేదు. టాలీవుడ్ లో స్పీడ్ తగ్గినా కానీ, కోలీవుడ్ లో మ్యానేజ్ చేస్తోంది. ప్రస్తుతం ప్రదీప్ రంగనాథన్, ఎస్.జె.సూర్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రంలో కృతి శెట్టి కీలక పాత్రను పోషిస్తోంది.
మరోవైపు సోషల్ మీడియాల్లో తన అభిమానులకు అవిశ్రాంతంగా అన్ లిమిటెడ్ ట్రీటిస్తోంది. కృతి శెట్టి వరుస ఫోటోషూట్లు యువతరంలో వైరల్ గా మారుతున్నాయి. తాజాగా కృతి బ్లాక్ కలర్ పోల్కా డ్రెస్ లో అద్భుతంగా మెరిసిపోతున్న ఫోజ్ ఇంటర్నెట్‌ని షేక్ చేస్తోంది. తన 21వ పుట్టినరోజు సందర్భంగా ఇది స్పెషల్ ఫోటోషూట్.
బ్లాక్ అండ్ వైట్ పోల్కా డాట్ హాల్టర్ నెక్ మినీ డ్రెస్‌లో కృతి ఎంతో అందంగా కనిపిస్తోంది. ఫెయిర్ లుక్, సింపుల్ చిరునవ్వుతో కుర్రకారు గుండెల్ని గిల్లుతున్న ఈ బ్యూటీ పాల నురుగు దేహశిరులను అందంగా ఎలివేట్ చేసేందుకు తపిస్తున్న తీరు ఆకట్టుకుంటోంది.
ప్రదీప్ రంగనాథన్, ఎస్.జె సూర్య కీలక పాత్రలు పోషిస్తున్న తాజా చిత్రం ఎల్.ఐ.కె లో కృతి కథానాయికగా నటిస్తోంది. త్వరలోనే ఈ సినిమా విడుదల కానుంది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన స్పెషల్ బర్త్ డే ఫోటోషూట్ ఇంటర్నెట్ లో వైరల్ గా మారుతోంది. కెరీర్ ఆరంభమే కొన్ని పెద్ద ప్రాజెక్టుల్లో అవకాశం అందుకున్న కృతి సరైన బ్లాక్ బస్టర్ అందుకోవడంలో తడబడింది. అది ఈ భామ కెరీర్ జోష్ ని తగ్గించిందని చెప్పాలి. ఓటీటీలు ఏల్తున్న ఈ రోజుల్లో కృతి శెట్టి తదుపరి కొన్ని స్పెషల్ ప్రాజెక్టులతో దూసుకు రానుందని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి.