క్రష్ లేని హీరోయిన్ ఉండదు. స్టార్ హీరోలపై నవతరం భామల క్రష్ ఎప్పటికప్పుడు రివీల్ చేస్తూనే ఉంటా రు. సినిమాల్లోకి రాకముందే? స్కూల్….కాలేజ్…జాబ్ చేస్తోన్న సమయంలోనూ భామా మణుల క్రష్ విష యాలు ఎంతో ఓపెన్ గా చెబుతుంటారు. సినిమాల్లోకి వచ్చిన తర్వాత హీరోలపై క్రష్‌ని అంతే ఓపెన్ అవుతుంటారు. తాజాగా కృతిశెట్టి క్రష్ గురించి రివీల్ చేసింది. బేబమ్మకు ఏ హీరోపై క్రష్ లేదు కానీ ..స్కూల్లో ఉన్న సమయంలో స్నేహితుడి స్నేహితుడిపై మాత్రం క్రష్ ఉండేదని తెలిపింది.
స్కూల్ అంటే హైస్కూల్ కూడా కాదు. ఎలిమెంట్రీ స్కూల్ క్రష్ ఇది. మూడవ తరగతి చదువుతోన్న సమ యంలో ఉన్న క్రష్ ఇది. తొలిసారి అబ్బాయిపై క్రష్ అన్నది ఉప్పొనొచ్చినట్లు వచ్చి పోయిందని తెలిపింది. ఆ తర్వాత ఎవరి మీద ఎలాంటి క్రష్ లేదని తెలిపింది. స్కూల్..కాలేజ్..సినిమాల్లోకి వచ్చిన తర్వాత ఎవరైనా? అంటే ఛాన్సే లేదని తేల్చేసింది. అంటే బేబమ్మకు ఏ హీరోపైనా క్రష్ లేదని క్లియర్ చెప్పినట్లు. ఇక ఈ కన్నడిగి జర్నీ గురించి చెప్పాల్సిన పనిలేదు.
టాలీవుడ్ కి తారా జువ్వలా దూసుకొచ్చినా? కెరీర్ ని మాత్రం సక్సస్ పుల్ గా కొనసాగించ లేకపోయింది. `ఉప్పెన` తో మెరిసినా ఆసక్సెస్ ని సరిగ్గా ట్రాక్ ఎక్కించలేకపోయింది. అవకాశాలొచ్చినా? అమ్మడికి సక్సస్ రూపంలో అదృష్టం కలిసి రాలేదు. కృతి అందం..అభినయానికి పెద్ద స్టార్ అవుతుందనుకున్న వారి అంచనాలు తల్లకిందులయ్యాయి. ప్రస్తుతం కృతి కోలీవుడ్ లో కెరీర్ ని నెట్టికొస్తుంది. అక్కడ మాత్రం మంచి అవకాశాలే అందుకుంటుంది. కార్తీ హీరోగా నటిస్తోన్న `వా వత్తైయార్` లో నటిస్తోంది.
ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. అలాగే నయనతార ప్రొడక్షన్ హౌపస్ లో తెరకెక్కుతోన్న ‘లవ్ ఇన్సురెన్స్ కంపెనీ’ లో నటిస్తోంది. ఇందులో ప్రదీప్ రంగనాధ్ హీరో. అన్ని పనులు పూర్తి చేసుకుని సెప్టెంబర్ లో రిలీజ్ కానుందీ చిత్రం. అలాగే ‘జెన్నీ’ అనే మరో చిత్రం లోనూ నటిస్తోంది. ఈ రెండు సినిమాలపై కృతి చాలా ఆశలు పెట్టుకుంది. సక్సస్ తో కోలీవుడ్ లో స్ట్రాంగ్ గా నిలబడాలని చూస్తోంది. అక్కడ విజయాలతో టాలీవుడ్ లోనూ కంబ్యాక్ అవ్వాలని చూస్తోంది. ఇక్కడ అవకాశాలు వదిలేయలేదు. పాత పరిచయాలతో కొత్త అవకాశాల కోసం ప్రయత్నిస్తోంది.