తెలుగు నటి కోమలి ప్రసాద్ పరిచయం అసవరంలేని పేరు. నేను సీతాదేవి, నెపోలియన్, రౌడీబోయ్స్ లాంటి చిత్రాల్లో నటించింది. ఇటీవల రిలీజ్ అయిన `హిట్ 3`లోనూ నటించింది. అంతకుముందు రిలీజ్ అయిన `హిట్ 2`లోనూ అలరించింది. అయితే కోమలి ప్రసాద్ డాక్టర్ గా ఉన్న ఓ ఫోటో ని పోస్ట్ చేసింది. దీంతో ఆ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది.
ఈ నేపథ్యంలో కోమలి సినిమాలకు రిటైర్మెంట్ ఇచ్చి డాక్టరమ్మగా స్థిరపడుతుందనే కథనాలు మొదల య్యాయి. ఆ ప్రచారం పీక్స్ కు చేరింది. ఈ నేపథ్యంలో ఈ ప్రచారంపై కోమలి వివరణ ఇచ్చింది. `యాప్రాన్ ధరించి షేర్ చేసిన ఫోటో అనవసరమైన ప్రచారానికి దారి తీసింది. నటన వదిలేసి వైద్యరాలిగా స్థిర పడతాను అన్న దాంట్లో నిజం లేదు. ఎంతో కాలం శ్రమిస్తే గాని నటిగా అవకాశాలు రాలేదు.
ఇప్పుడో పోజిషన్ లో ఉన్నాను. ఇప్పుడీ స్థానం వదిలి కొత్తగా మరో రంగంలోకి వెళ్లాలనుకోవడం లేదు. పరమేశ్వరుడి దయ వల్ల నటిగా స్థిరపడ్డాను.నన్ను, నా వాళ్లను ఇబ్బంది పెట్టేలా ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయోద్దు. విధిని నేను బలంగా నమ్ము తాను. అందువల్లే ఈ రంగం వైపు వచ్చాను. చివరి వరకూ ఇదే రంగంలో కొనసాగాలనుకుంటున్నాను. ఇంకా మంచి సినిమాలు చేయాలన్నది నా ఆశ. అది నెరవేరే దిశగా నేను కష్టపడతాను. నా పై నాకు నమ్మకం ఉంది. కథల ఎంపిక విషయంలో ఇకపై మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటాను. అందరూ గర్వపడేలా సినిమాలు చేయాలన్నది నా కోరిక. త్వరలోనే కొత్త సినిమా వివరాలను వెల్లడిస్తానని తెలిపింది. దీంతో కోమలిపై జరుగుతోన్న ప్రచారమంతా అవాస్తవమని తేలిపోయింది.