రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ అయినటువంటి ముఖేష్ అంబానీ తల్లి కోకిలాబెన్ అంబానీ ఆరోగ్య పరిస్థితి చాలా విషమంగా ఉంది అంటూ జాతీయ మీడియా ఛానల్స్ లో వార్తలు వినిపిస్తున్నాయి.. మరి ఇంతకీ ముకేశ్ అంబానీ తల్లి కోకిలాబెన్ కి ఏమైంది..? ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి వస్తున్న వార్తల్లో ఉన్న నిజమెంత? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
విషమంగా అంబానీ తల్లి ఆరోగ్యం..
దిగ్గజ పారిశ్రామికవేత్తగా.. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేతగా..దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఎన్నో పేరు ప్రఖ్యాతలు గాంచిన ముకేశ్ అంబానీ అంటే తెలియని వారు ఉండరు.. దేశంలో అత్యంత సంపన్నుడిగా పేరు తెచ్చుకున్న అంబానీ కి సంబంధించి ఏ విషయమైనా సరే క్షణాల్లో చాలా వైరల్ గా మారుతుంది. అయితే అలాంటి ముకేశ్ అంబానీ తల్లి గురించి తాజాగా ఒక సంచలన విషయం వెలుగు లోకి వచ్చింది. అదేంటంటే..ముఖేష్ అంబానీ తల్లి కోకిలాబెన్ అంబానీ గారి ఆరోగ్య పరిస్థితి చాలా విషమంగా ఉందని, జాతీయ మీడియా ఛానల్స్ లో గత కొద్ది గంటల నుండి వార్తలు వినిపిస్తున్నాయి.
91 ఏళ్ల వయసులో హాస్పిటల్లో చేరిన కోకిలాబెన్..
91 ఏళ్ల వయసు ఉన్న ముఖేష్ అంబానీ తల్లి కోకిలాబెన్ వృద్ధాప్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్టు తెలుస్తోంది. దాంతో కోకిలాబెన్ ని వెంటనే ముంబైలోని HN రిలయన్స్ హాస్పిటల్ కి శుక్రవారం ఉదయం తీసుకువెళ్లినట్టు తెలుస్తోంది. కోకిలాబెన్ ని ప్రత్యేకమైన హెలికాప్టర్ ద్వారా హాస్పిటల్ కి తీసుకు వెళ్లినట్టు జాతీయ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే కోకిలాబెన్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది అనే విషయం తెలియడంతోనే అంబానీ కుటుంబ సభ్యులందరూ హుటాహుటిన ముంబైలోని రిలయన్స్ హాస్పిటల్ కి వెళ్తున్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇప్పటికే ముకేశ్ అంబానీ ఫ్యామిలీ మొత్తం టైట్ సెక్యూరిటీతో హెచ్ ఎన్ హాస్పిటల్ కి చేరుకున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.అలాగే ముకేశ్ అంబానీ సోదరుడు అనిల్ అంబానీ కూడా ఆయన భార్యతో కలిసి హెచ్ ఎన్ హాస్పిటల్ కి వెళ్లారు..
ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందంటే?
అయితే ఉదయం నుండి కోకిలాబెన్ ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉన్నట్టు జాతీయ మీడియాలో వార్తలు వినిపిస్తున్నప్పటికీ ఇప్పటివరకు ముకేశ్ అంబానీ ఫ్యామిలీ నుండి ఎలాంటి అధికారిక ప్రకటన కూడా రాలేదు. అలాగే కోకిలాబెన్ ని జాయిన్ చేసిన హెచ్ఎన్ హాస్పిటల్ నుండి కూడా డాక్టర్లు ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి ఎలాంటి సమాచారం కూడా ఇవ్వలేదు.. ప్రస్తుతం కోకిలాబెన్ ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉన్నట్టు తెలుస్తోంది. సీనియర్ డాక్టర్ ల పర్యవేక్షణలో కోకిలాబెన్ కి ట్రీట్మెంట్ అందిస్తున్నట్టు సమాచారం.