మొన్నటిదాకా బాలీవుడ్ లో హీరోయిన్ కియరా అద్వాని పేరు మారుమోగింది. అమ్మడు ఏం చేసినా అదో అద్భుతం అన్నట్టుగా ఉండేది. సినిమాలు, సీరీస్ లతో బీ టౌన్ ఆడియన్స్ కి నిద్ర పట్టకుండా చేస్తూ వచ్చింది కియరా. ఆ క్రేజ్ తోనే తెలుగు సినిమాల ఛాన్స్ లు కూడా అందుకుంది. మహేష్ తో భరత్ అనే నేను చేసిన అమ్మడు రాం చరణ్ తో వినయ విధేయ రామ, గేం ఛేంజర్ రెండు సినిమాలు చేసింది.
ఐతే గేం ఛేంజర్ మీద ఎన్నో ఆశలు పెట్టుకోగా అది కాస్త బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. మొన్నటిదాకా కియరా హిందీలో సూపర్ ఫాం కొనసాగించగా సడెన్ గా ఆమె కెరీర్ గ్రాఫ్ పడిపోతూ వచ్చింది. ఐతే దీనికి ఆమె పెళ్లి చేసుకోవడం ఒక కారణమని కొందరు చెబుతున్నారు. పెళ్లే కారణం అయితే ఆఫ్టర్ మ్యారేజ్ కూడా సక్సెస్ ఫాం కొనసాగిస్తున్న భామలు చాలా మంది ఉన్నారు. సో ఆ రీజన్ కరెక్ట్ అని చెప్పలేం.
ఇక కథల సెలక్షన్ లో కియరా చేస్తున్న మిస్టేక్స్ కెరీర్ కి కాస్త బ్రేకులు వేస్తున్నాయన్నట్టుగా చెప్పొచ్చు. గేం ఛేంజర్ తర్వాత కియరా పరిస్థితి ఏంటి అనుకునే వారికి ఆమె చేస్తున్న రెండు సినిమాలు హోప్స్ కలిగిస్తున్నాయి. ముందుగా అమ్మడు హృతిక్ రోషన్, ఎన్ టీ ఆర్ కలిసి చేస్తున్న వార్ 2 లో నటిస్తుంది. ఈ సినిమాలో కియరా గ్లామర్ కూడా అదిరిపోతుందని టాక్. వార్ 2 తో పాటు యష్ టాక్సిక్ లో కూడా నటిస్తుంది అమ్మడు. టాక్సిక్ సినిమాలో యష్ తో కియరా జత కడుతుంది. ఈ రెండు సినిమాలతో కియరా తిరిగి సరైన ట్రాక్ లోకి రావాలని అనుకుంటుంది. కచ్చితంగా ఈ రెండు సినిమాలు ఆమెకు మంచి మైలేజ్ తెస్తాయని చెప్పొచ్చు. కియరా బాలీవుడ్ ఫాం చూసి దిష్టి పెట్టారు కాబట్టే ఆమెకు అవకాశాలు రావట్లేదు అనుకుంటున్న వారు ఉన్నారు. కానీ ఆమె నుంచి రాబోతున్న వార్ 2, టాక్సిక్ ఈ రెండు సినిమాల వల్ల తప్పకుండా మళ్లీ తన సత్తా చాటుతుందని భావిస్తున్నారు. మరి కియరా కంబ్యాక్ ఇవ్వాలని ఆమె సౌత్ ఫ్యాన్స్ కూడా కోరుతున్నారు. మళ్లీ అమ్మడు ఇక్కడ సినిమాలు చేయాలని ఆశిస్తున్నారు.