బీఆర్ఎస్ లోని ఇంటిపోరు తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది. హరీశ్ రావు.. సంతోష్ రావులు తమ కుటుంబాన్ని విచ్చిన్నం చేసే ప్రయత్నాలు చేస్తున్నారని కవిత సంచలన ఆరోపణలు చేయటం తెలిసిందే. అంతేకాదు.. కేసీఆర్ హరితహారం పేరుతో ప్రోగ్రాం చేస్తే.. దాన్ని గ్రీన్ ఛాలెంజ్ పేరుతో హ్యాపీ రావు హైజాక్ చేసినట్లుగా ఆమె చేసిన విమర్శలు సంచలనంగా మారాయి. ఈ ఆరోపణలు ఇలా ఉంటే కవిత మద్దతుదారులు సోషల్ మీడియా వేదికగా మరిన్ని ఆరోపణలు చేస్తున్నారు.
హ్యాపీ రావు విషయం గురువారం మధ్యాహ్నం మూడు గంటలకు బయటపెడతామని ఉదయమే పోస్టు పెట్టటం.. అందుకు తగ్గట్లే మధ్యాహ్నం పోస్టు చేయటం గమనార్హం. ట్రాక్టర్లతో సంతోషం గా హ్యాపీ రావు రూ.120 కోట్లు నొక్కేశారని కవిత మద్దతుదారులు చేసిన ఆరోపణలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. కవితక్క అప్ డేట్స్ పేరుతో ఉన్న ఎక్స్ ఐడీలో ఈ ఆరోపణలు షేర్ కావటంతో కొత్త కలకలం మొదలైంది. రానున్న పదిహేను రోజులు ఒక్కోరోజు ఒక్కో అంశం మీద సిరీస్ రూపంలో సంచలనాలు పోస్టు కావటం ఖాయమని.. అందుకు తగ్గట్లు ఏర్పాట్లు చేసినట్లుగా తెలుస్తోంది.
ఇంతకూ సదరు పోస్టులో ఏమున్నదంటే.. ‘‘కేసీఆర్ ప్రభుత్వం మహాత్మాగాంధీ స్ఫూర్తితో పల్లెప్రగతి అనే అద్భుతమైన కార్యక్రమాన్ని ప్రారంభించింది. కానీ.. ప్రభుత్వం ప్రతి గ్రామ పంచాయితీకి ఇచ్చే ట్రాక్టర్లపై హ్యాపీ రావు కన్ను పడింది. దాంతో సిద్ధిపేట జిల్లా కోహెడ మండలం వరికోలు గ్రామానికి చెందిన కోడిపందేలు నిర్వహించే స్నేహితుడితో రూ.120 కోట్లకు పైగా కమిషన్ కోసం హ్యాపీ రావు స్కెచ్ వేశారు. అప్పటికే ఆ బినామీకి ట్రాక్టర్లకు సంబంధించిన బిజినెస్ అనుభవం ఉండటంతో బెంగళూరులో ట్రాక్టర్ కంపెనీలను పిలిపించుకొని ఒక్కో ట్రాక్టర్ మీద రూ.లక్ష ఇవ్వాలని ఒప్పందం కుదుర్చుకున్నారు’’ అంటూ తీవ్ర ఆరోపణల్ని పోస్టు చేశారు.
ఈ ఒప్పందంలో అప్పటి మంత్రి (సదరు శాఖ)ని పక్కన పెట్టేశారని.. దీంతో సదరు మంత్రి గట్టిగా అడిగితే అతడికో ఖరీదైన కారును బహుమతిగా ఇచ్చారన్నారు. ఆ తర్వాత కారుకు ఈఎంఐ కూడా కట్టకపోవటంతో సదరు మంత్రి తన సొంత డబ్బులతో కారు ఈఎంఐ కట్టుకోవాల్సి వచ్చిందన్నారు. ట్రాక్టర్ల కొనుగోళ్లలో రూ.120 కోట్లకు పైగా డబ్బును హ్యాపీ రావు.. అతడి బినామీ పంచుకొని నాటి మంత్రికి మాత్రం మొండిచేయి చూపించారు’’ అంటూ చేసిన పోస్టు సంచలనంగా మారింది.
కేసీఆర్ గారు మహాత్మా గాంధీ గారిని స్ఫూర్తిగా తీసుకొని పల్లె ప్రగతి అనే ఒక అద్భుతమైన కార్యక్రమం ప్రారంభించారు.
సంతోషంగా హ్యాపీ రావు గ్రీన్ ఇండియా అనే కొత్త డ్రామా మొదలు పెట్టాడు. అతని కన్ను ప్రతి గ్రామ పంచాయతీకి ఇచ్చే ట్రాక్టర్ల మీద పడింది. తన బినామీ అయిన వరికోలు వాసి, కోడిపందాలు… pic.twitter.com/MNzbkedEzo
— 𝐊𝐚𝐯𝐢𝐭𝐡𝐚𝐤𝐤𝐚 𝐔𝐩𝐝𝐚𝐭𝐞𝐬 (@KavithakkaUpdts) September 4, 2025