ఒక్క సినిమా హీరోయిన్ ఫేట్ మార్చేస్తుంది అని చాలా మంది కథానాయికల కెరీర్ లో ప్రూవ్ అయ్యింది. ఇప్పుడు అదే తరహాలో ఒక హీరోయిన్ ని ఓవర్ నైట్ స్టార్ ని చేసింది. అంతకుముందు నుంచి సినిమాలు చేస్తున్నా కూడా ఒక సినిమాలో అది కూడా ఆమె చేసిన సెకండ్ హీరోయిన్ రోల్ తో సూపర్ పాపులర్ అయ్యింది. ఇంతకీ ఎవరా హీరోయిన్ అంటే డ్రాగన్ బ్యూటీ కయదు లోహార్ అని తెలుస్తుంది. కోలీవుడ్ లో పలు సినిమాల్లో నటించిన అమ్మడు శ్రీవిష్ణు చేసిన అల్లూరి సినిమాలో హీరోయిన్ గా చేసింది.
ఐతే అప్పుడు అసలేమాత్రం జనాల దృష్టిలో పడని కయదు రీసెంట్ గా ప్రదీప్ రంగనాథ్ చేసిన డ్రాగన్ సినిమాతో అదరగొట్టేసింది. సినిమాలో ప్రదీప్ ఫస్ట్ హాఫ్ అనుపమని లవ్ చేస్తాడు సెకండ్ హాఫ్ లో కయదుతో పెళ్లికి రెడీ అవుతాడు. డ్రాగన్ సినిమాలో కయదు ఎంట్రీ మామూలుగానే అనిపించినా సినిమా నడుస్తున్నా కొద్దీ ఆమె నచ్చేస్తుంది. ఒకదశలో కయదుతో ప్రేమలో పడేలా చేస్తుంది. ఇక అమ్మడి గ్లామర్ షోకి కూడా కుర్రాళ్లు ఫిదా అయిపోయారు. సో అలా కయదు లోహార్ డ్రాగన్ సినిమాతో సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. ఆ సినిమా రిలీజ్ తర్వాత ఆమె సోషల్ మీడియా ఫాలోవర్స్ కూడా బీభత్సంగా పెరిగారు. మరోపక్క కయదు లోహార్ తెలుగులో విశ్వక్ సేన్ సరసన ఫంకీ సినిమాలో ఛాస్ అందుకుంది. ఆ సినిమాతో అమ్మడు మరోసారి తెలుగు ఆడియన్స్ ముందుకు వస్తుంది. ఐతే సౌత్ ఆడియన్స్ ని ఎప్పటికప్పుడు వాచ్ చేస్తున్న ముంబై మేకర్స్ కయదు మీద ఉన్న ఈ బజ్ చూసి ఆమెని అక్కడ సినిమాల్లోకి తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నారట. ఓ విధంగా ఇది గొప్ప విషయమని చెప్పొచ్చు. డ్రాగన్ సినిమాతో కయదు నిజంగానే తన సత్తా చాటి అదరగొట్టే ఛాన్స్ లు అందుకుంటుంది. అమ్మడు ఇటు సౌత్ తో పాటు బాలీవుడ్ లో కూడా ఛాన్స్ అందుకుంటే మాత్రం అక్కడ ఆడియన్స్ ని కూడా తన బుట్టలో వేసుకునే ప్రయత్నం చేస్తుందని చెప్పొచ్చు. నిజంగానే కయదు బాలీవుడ్ షిఫ్ట్ అయితే మాత్రం అక్కడే టాప్ రేంజ్ కి వెళ్లే ఛాన్స్ లు ఉన్నాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.