దేశంలో అన్ని రాష్ట్రాలూ ఒక ఎత్తు జమ్మూ కాశ్మీర్ ఒక ఎత్తు. దేశానికి శిఖ లాంటిది కాశ్మీర్ అని వర్ణిస్తారు. భౌగోళికంగా చూసినా అదే నిజం. కాశ్మీర్ ఎంతో కీలక ప్రాంతం. వ్యూహాత్మకంగా దేశానికి అతి ముఖ్య క్షేత్రం. భారత్ పాక్ విడిపోయినా పేగు బంధంలా కాశ్మీర్ విషయంలోనే ఘర్షణలు జరుగుతూనే ఉంటున్నాయి. అయితే కాశ్మీర్ భారత్ లో అంతర్భాగం అని బీజేపీ పలు మార్లు ఉధ్ఘాటిస్తూ వచ్చింది. ఇక నరేంద్ర మోడీ దేశ ప్రధాని అయ్యాక కాశ్మీర్ విషయంలో తన పార్టీ ఆకాంక్షలకు అనుగుణంగా అలాగే సువిశాలమైన దేశ ప్రజల ఆలోచనలకు అనుగుణంగా కీలక సంచలన నిర్ణయం తీసుకున్నారు.
సరిగ్గా ఆరేళ్ల క్రితం 2019 ఆగస్టు 5న జమ్మూ కాశ్మెర్ కి ఉన్న ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేస్తూ కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. 370 అధికరణాన్ని ఆ విధంగా రద్దు చేసి కాశ్మీర్ ని దేశంలో ఆచరణాత్మకంగా అంతర్భాగం చేసింది. అంతే కాదు జమ్మూ కాశ్మీర్ కి ఉన్న రాష్ట్ర హోదాను రద్దు చేసి జమ్మూ కాశ్మీర్ లను రెండుగా చేసింది. ఆ రెండింటినీ కేంద్ర పాలిత ప్రాంతాలుగా మార్చేసింది. ఆ మీదట దాదాపుగా అయిదేళ్ళ పాటు కేంద్ర ప్రభుత్వం నియమించిన గవర్నర్ తోనే పాలన సాగింది. కాశ్మీర్ లో రాష్ట్రపతి పాలన అంతా సాగిన సమయంలోనే స్థానికంగా ఎన్నికలు పెట్టాలని విపక్షాలు డిమాండ్ చేస్తూ వచ్చాయి.
ఇక సుప్రీం కోర్టు తీర్పు మేరకు గత ఏడాది కాశ్మీర్ లో ఎన్నికలు నిర్వహించారు. ఆ సందర్భంగా తాము కనుక అధికారంలోకి వస్తే జమ్మూ కాశ్మీర్ కి రాష్ట్ర హోదా తిరిగి పునరుద్ధరిస్తామని బీజేపీ పెద్దలు ప్రకటించారు. అయితే ఎన్నికలు ముగిసాయి. కాశ్మీర్ లో నేషనల్ కాంఫరెన్స్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. ప్రతిపక్షంలో బీజేపీ ఉంది అయినా రాష్ట్ర హోదా అయితే ఇవ్వలేదు. మరి అది ఎపుడూ అన్న చర్చ అయితే ఉండనే ఉంది.
ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో వరస భేటీలు నిర్వహించారు. ఇలా ఒకరి తరువాత ఒకరు రాష్ట్రపతితో భేటీ అవడంతో కాశ్మీర్ విషయంలో కేంద్రం కీలామైన నిర్ణయం తీసుకోబోతోంది అని ప్రచారం అయితే జోరుగా సాగుతోంది. ఏ ఆగస్టులో అయితే కేంద్ర పాలిత ప్రాంతాలుగా కాశ్మీర్ ని విభజించారో అదే ఆగస్టులో అవే వర్షాకాల సమావేశాలలో కాశ్మీర్ కి రాష్ట్ర హోదా ఇస్తారని ప్రచారం అయితే సాగుతోంది. దాంతో మరోసారి కాశ్మీర్ మీద అందరి ఫోకస్ పడుతోంది. కాశ్మీర్ కి రాష్ట్ర హోదా ఇచ్చి జమ్మూని కేంద్ర పాలిత ప్రాంతంగా ఉంచుతారా లేక అంతా కలిపి పూర్వం మాదిరిగా చేస్తారా అన్నదే చర్చగా ఉంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో.