`కాంతార చాప్టర్ వన్` పై తెలుగు మార్కెట్ లో అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో? చెప్పాల్సిన పనిలేదు. చెప్పుకో వడానికే ఇది కన్నడ సినిమా? కానీ బజ్ మాత్రం తెలుగు స్ట్రెయిట్ సినిమాకు ఉన్నంత ఉంది. ఇటీవల రిలీజ్ అయిన ట్రైలర్ తో అది పీక్స్ కు చేరింది. ఈ చిత్రాన్ని బన్నీ వాస్ సమర్పించడం సినిమాకు కలిసొచ్చింది. ఓ పెద్ద నిర్మాణ సంస్థ కూడా రిలీజ్ లో భాగమవ్వడంతో ఈ రేంజ్ బజ్ కి మరో కారణంగా చెప్పొచ్చు. మరి ఈ సినిమా తెలుగు మార్కెట్ నుంచే వంద కోట్లు రాబట్టే సత్తా ఉందా? అంటే అవుననే టాక్ వినిపిస్తోంది. ట్రేడ్ వర్గాలు సైతం ఈ విషయాన్ని నొక్కి వొక్కాణిస్తున్నాయి.
`కాంతారా` చాప్టర్ వన్ లో ఏం చెప్పబోతున్నారు? అన్న దానిపై తెలుగు ఆడియన్స్ లో ఒకటే ఆసక్తి నెలకొంది. రెండవ భాగాన్ని మరింత రిచ్ గా డిజైన్ చేసినట్లు ట్రైలర్ తో క్లారిటీ వచ్చేసింది. ఇవన్నీ `కాంతార 2`కి కలిసొచ్చే అంశాలే. సినిమాలో తెలుగు నటులు లేకపోయినా ఈ రేఉంజ్ లో బజ్ కి కారణం ప్రేక్షకులు చూపిస్తోన్న ఆదరణ కారణమని తెలుగు వెర్షన్ నిర్మాతలు అభిప్రాయపడుతున్నారు. ఓసారి వంద కోట్ల వసూళ్ల లెక్కలోకి వెళ్తే..కాంతార ఎలాంటి అంచనాలు లేకుండానే 50కోట్లు తెలుగు నుంచే రాబట్టింది.
అప్పటికి రిషబ్ శెట్టి ఎవరో తెలియదు. కేవలం సినిమాలో కంటెంట్ తో ఈ రేంజ్ లో వసూళ్లు రాబట్టింది. కన్నడ సంస్కృతిని కథలో హైలైట్ చేయడం కలిసొచ్చింది. క్లైమాక్స్ కూడా అంతే ఆసక్తికరంగా ముగిస్తూ `కాంతార 2`ని ప్రకటించారు. దీంతో `కాంతార`కు ముందు కథను ప్రేక్షకులు `కాంతార 2` లో చూడబోతున్నారు. దీంతో అక్కడ పండగ సంప్రదాయానికి కథలో పెద్ద పీట వేస్తారనే అంచనాలు బలంగా ఉన్నాయి.
తొలి షోతో టాక్ పాజిటివ్ గా తెచ్చుకుంటే వంద కోట్లు పెద్ద విషయం కాదని ట్రేడ్ అంచనా వేస్తోంది. `అక్టోబర్ 2`న రిలీజ్ అవుతున్న సినిమాకు పోటీగా కూడా మరే సినిమా లేదు. దసరా కానుకగా రిలీజ్ అవుతోన్న ఏకైక పెద్ద చిత్రంగా `కాంతార` చాప్టర్ వన్ మాత్రమే కనిపిస్తోంది. దీంతో థియేటర్ల పరంగా ఎలాంటి ఇబ్బంది ఉండదు. కావాల్సినన్ని థియేటర్లు అందుబాటులో ఉంటాయి.