రిషబ్ శెట్టి.. ‘కాంతార’ సినిమాతో పాన్ ఇండియా హీరోగా పేరు సొంతం చేసుకున్న ఈయన.. 2010లో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసేవారు. ఆ తర్వాత 2016లో రికి, కిరిక్ పార్టీ చిత్రాలకు దర్శకత్వం వహించారు. అటు దర్శకుడిగా చేస్తూనే 2018లో వచ్చిన ‘బెల్ బాటమ్’ అనే సినిమాలో హీరోగా నటించి పర్వాలేదనిపించుకున్నారు. అదే ఏడాది ఈయన దర్శకత్వం వహించిన ‘కొడుగే: రామన్న రాయ్’ చిత్రానికి ఏకంగా నేషనల్ అవార్డు అందుకున్నారు. ఇకపోతే 18 శతాబ్దంలో మొదలైన ఒక ప్రాంతీయ కథను కాంతార గా రూపొందించి తెరపై చూపించి, సంచలనం సృష్టించారు రిషబ్ శెట్టి. ఇప్పుడు ఈ చిత్రానికి ప్రీక్వెల్ గా ‘కాంతారా: చాప్టర్ వన్’ అంటూ అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే.
అయితే ఇలాంటి సమయంలో తాజాగా హీరో రిషబ్ శెట్టిపై యాక్షన్ కొరియోగ్రాఫర్ అర్జున్ రాజ్ చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ముఖ్యంగా ఆయన చెప్పిన మాటలు వింటుంటే.. అభిమానులే కాదు సినీ ప్రేక్షకులు కూడా ఈయన్ని చూసి నేర్చుకోండి అంటూ పలువురికి కామెంట్లు చేస్తున్నారు. మరి అర్జున్ రాజ్ రిషబ్ శెట్టి గురించి ఏం చెప్పారు అనే విషయాన్నికొస్తే.. సాధారణంగా ఒక సినిమా రూపొందించేటప్పుడు అందులో హీరోలు కష్టమైన యాక్షన్ సీక్వెన్స్ వచ్చినప్పుడు డూప్ ను వాడుతూ ఉంటారు అన్న విషయం అందరికీ తెలిసిందే.
అయితే రిషబ్ శెట్టి మాత్రం డబుల్ బాడీ అవసరం లేకుండా క్లిష్టమైన సన్నివేశాలను స్వయంగా పూర్తి చేశారు అని.. ఆయన పై ప్రశంసలు కురిపించారు. యాక్షన్ కొరియోగ్రాఫర్ అర్జున్ రాజ్ మాట్లాడుతూ.. “రిషబ్ శెట్టి ఈ సినిమాలో చాలా అద్భుతంగా నటించారు. ఆయన కోసం మేము ఎటువంటి బాడీ డబుల్స్ ఉపయోగించలేదు. ముఖ్యంగా ఆయన లుక్ ను ఏ డూప్ అనుకరించలేని విధంగా ప్రత్యేకమైన బాడీ లాంగ్వేజ్ తో ప్రదర్శన ఇచ్చారు. కలరియపట్టు, కత్తి యుద్ధం, గుర్రపు స్వారీ లలో కఠినంగా శిక్షణ తీసుకొని.. సంకల్ప శక్తితో అన్నింటిని చాలా చక్కగా పూర్తి చేశారు. ముఖ్యంగా రిస్క్ తీసుకొని మరీ ఈ సినిమాలో ఆయన స్వయంగా యాక్షన్ సీక్వెన్స్ చేయడం మాకే ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇప్పటివరకు నేను ఎంతోమంది నటులతో కలిసి పనిచేశాను. కానీ రిషబ్ శెట్టి లాంటి నటుడిని ఇప్పటివరకు చూడలేదు. “నేను బ్రతికున్నంత వరకు నా శాయశక్తులా ప్రయత్నం చేస్తానని” ఆయన చెప్పడం నాకు మరింత స్ఫూర్తిని కలిగించింది”. అంటూ అర్జున్ రాజ్ కామెంట్లు చేశారు. మొత్తానికైతే హీరో పై ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి . కాంతార చాప్టర్ 1 సినిమా విషయానికి వస్త.. శాండిల్ వుడ్ బడా నిర్మాణ సంస్థగా పేరు సొంతం చేసుకున్న హోంభలే ఫిలిమ్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని అక్టోబర్ 2న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. మరి భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ సినిమా మరెన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.