బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ హాలీవుడ్ ఎంట్రీ కి రెడీ అవుతోంది. కంగన ప్రధాన పాత్రలో` బ్లెస్డ్ బి ది ఈవిల్` అనే ఇంగ్లీష్ చిత్రానికి సన్నాహాలు జరుగుతున్నాయి. కంనగ కోసం లయన్ మూవీస్ ప్రత్యేకంగా సిద్దం చేసిన స్క్రిప్ట్ ఇది. గర్భస్రావం తర్వాత బిడ్డను కోల్పోయిన బాధలో ఓ జంట ఉంటుంది. మళ్లీ కొత్త జీవితం ప్రారంభించాలనుకుంటున్న వారిని ఓ దుష్ట శక్తి ఎలాంటి తిప్పలు పెడుతుంది అనే కథాంశం చుట్టూ తిరుగుతుంది.
అతీంద్రీయ శక్తులు…జానపద కథల నేపథ్యంలో అనురాగ్ రుద్ర తెరెక్కిస్తున్నాఉ. టైలర్ పోసీ, స్కార్లెట్ రోజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ వేసవిలోనే చిత్రాన్ని న్యూయార్క్ లో ప్రారంభించా లనుకుం టున్నారు. అమెరికాలోని చిత్ర నిర్మాణాలకు ట్రంప్ విధించిన టారిఫ కు సంబంధించిన పనులు పూర్తయిన వెంటనే లాంచింగ్ కార్యక్రమం ఉంటుంది. అయితే ఈ సినిమా లో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా కూడా నటిస్తుందనే ప్రచారం బాలీవుడ్ లో మొదలైంది.
ఇంగ్లీష్ లో చేస్తోన్న చిత్రం కావడం తో కంగన పీసీని ఓ గెస్ట్ రోల్ పోషించమని రిక్వెస్ట్ చేసిందట. పీసీ కూడా నో చెప్పలేదని సమాచారం. సమయం దొరికితే కచ్చితంగా చేస్తామని మాట ఇచ్చిందట. ఈ సినిమా షూటింగ్ అంతా కూడా న్యూయార్క్ లోనే ఉంటుంది. ప్రారంభోత్సవం కూడా అక్కడే జరుగుతుంది. కాబట్టి పీసీ కి పెద్దగా సమస్య ఉండదు. ఎందుకంటే ప్రియాంక చోప్రా కాపురం కూడా న్యూయార్క్ లోనే ఉంటుంది.
ఈ మధ్యనే ఎస్ ఎస్ ఎంబీ 29 సినిమాకు ఒకే చెప్పడంతో హైదరాబాద్ వచ్చి వెళ్తుంది. ప్రస్తుతం షూటింగ్ లేకపోవడంతో ప్రియాంక అమెరికాలోనే ఉంది. జూన్ నుంచి కొత్త షెడ్యూల్ మొదలవుతుంది. మళ్లీ అప్పుడు ఇండియాకు వచ్చే అవకాశం ఉంది. ఈ లోగా కంగన సినిమా ప్రారంభోత్సవం జరగుతుందని తెలుస్తుంది