ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Andhra Pradesh

kakani Govardhan Reddy: ఎట్టికేలకు అరెస్టు..!

kakani Govardhan Reddy: ఎట్టికేలకు అరెస్టు..!
ADVERTISEMENT

వైసీపీ ప్రభుత్వంలో తమకు తిరుగే లేదన్నట్లుగా వ్యవహరించిన నేతలు ఒకరు తర్వాత ఒకరుగా అరెస్టు అవుతున్నారు. తాజాగా ఆ జాబితాలో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. 55 రోజులుగా అతడ్ని అదుపులోకి తీసుకునేందుకు ఏపీ పోలీసులు కిందా మీదా పడినా అతడి ఆచూకీ కనిపెట్టే విషయంలో ఏపీ పోలీసులు ఫెయిల్ అవుతూ వచ్చారు. తాజాగా బెంగళూరు సమీపంలోని ఒక పల్లెటూరిలోని రిసార్ట్ లో ఉన్నట్లుగా గుర్తించిన పోలీసుల్ని ఆయన్ను అదుపులోకి తీసుకొని అరెస్టు చేసినట్లు ప్రకటించారు.

ఇంతకూ ఏ కేసులో మాజీ మంత్రి కాకాణి అరెస్టు అయ్యారు? అన్న విషయంలోకి వెళితే.. క్వార్జ్ అక్రమ తవ్వకాలు.. అక్రమ రవాణా.. నిబంధనలకు విరుద్ధంగా పేలుడు పదార్థాల వినియోగం.. అభ్యంతరం వ్యక్తం చేసిన గిరిజనులపై బెదిరింపులకు తెగబడటం లాంటి నేరారోపణలు ఆయనపై ఉన్నాయి. నెల్లూరుజిల్లా పొదలకూరు పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసులో ఏ4గా కాకాణి ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి పోలీసు విచారణకు హాజరు కావాలని పలుమార్లు నోటీసులు ఇచ్చినా ఆయన పట్టించుకోలేదు. అనంతరం నిందితుడిగా (ఏ4) ప్రకటించిన తర్వాత కూడా ఆయన వెనక్కి తగ్గలేదు.

ఈ కేసులో అరెస్టు ఖాయమన్న విషయంపై అవగాహన వచ్చినంతనే.. కాకాణి కనిపించకుండా పోయారు. అండర్ గ్రౌండ్ లోకి వెళ్లిపోయిన ఆయన్ను పట్టుకునేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నించినా ఆచూకీ లభించలేదు. అదే సమయంలో తాను బయటకు రాకుండా తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ హైకోర్టు.. సుప్రీంకోర్టుల్లో పిటిషన్లు దాఖలు చేశారు. అయితే.. ఆయా న్యాయస్థానాలు ఆ పిటిషన్లను కొట్టేశాయి. కాకాణి మీద తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. ఆయన కన్ను పడితే ఎలాంటి మైన్ అయినా.. దాని లీజుదారు ఎవరైనా సరే రాజీకి రావటం.. ఆయనకు సమర్పించుకోవటం తప్పనిసరి అన్నట్లుగా చెబుతారు.

నిబంధనలకు విరుద్ధంగా మైనింగ్ చేయటం.. పెద్ద ఎత్తున పేలుడు పదార్థాల్ని వినియోగించటం.. అందుకు అభ్యంతరం చెప్పే వారిని తనదైన శైలిలో బెదిరింపులకు గురి చేయటం లాంటివి కాకాణికి వెన్నతో పెట్టిన విద్యగా చెబుతారు. ఆయన తీరును నిరసిస్తూ అప్పట్లో సీనియర్ టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దీక్ష చేపడితే.. ఆయనపైకి వైసీపీ నేతల్ని.. హిజ్రాలు.. రౌడీలను ఉసిగొల్పిన వైనం అప్పట్లో సంచలనంగా మారింది. దీంతో మరింత మొండిగా కాకాణికి వ్యతిరేకంగా సోమిరెడ్డి పని చేశారు.

అతడి అక్రమ తవ్వకాల గురించి కలెక్టర్.. ఎస్పీ మొదలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి.. డీజీపీ.. ప్రధానమంత్రి.. కేంద్ర మంత్రి వరకు పలుమార్లు కంప్లైంట్లు చేశారు. దీంతో.. గత ఎన్నికలకు కాస్త ముందు గనులు.. రెవెన్యూ శాఖకు చెందిన అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా షాకింగ్ అంశాలు వెలుగు చూశాయి. కాకాణి మొత్తంగా 61,313 టన్నుల క్వార్జ్ ను అక్రమంగా తవ్వేసినట్లుగా గుర్తించారు. దీనికి సంబంధించి ఫైన్ గా రూ.7.56 కోట్లు చెల్లించాలని షోకాజ్ నోటీసులు ఇచ్చినా పట్టించుకోలేదు. ఈ అంశంపై అధికారులు కంప్లైంట్ చేయటంతో పొదలకూరు పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు ఆయన ఇంటికి వెళ్లగా అక్కడ లేరు. దీంతో ఇంటికి నోటీసులు అతికించి వచ్చేవారు. అందులో పేర్కొన్నట్లుగా మార్చి 31న పోలీసుల ఎదుట హాజరుకాలేదు. అనంతరం రెండుసార్లు ఆయన కుటుంబ సభ్యులకు నోటీసులు ఇచ్చినా ఆయన విచారణకు రాలేదు. ఆ గడువు ముగిసిన తర్వాత నుంచి పోలీసులకు కనిపించకుండా పోయారు. హైదరాబాద్.. తమిళనాడు.. కేరళ.. కర్ణాటక రాష్ట్రాల్లో కొన్నిరోజులు తలదాచుకున్న ఆయన.. మరింత రిమోట్ లోకి వెళ్లిపోయారు. తాజాగా బెంగళూరుకు సమీపంలోని ఒక పల్లెటూరు రిసార్ట్స్ లో దాక్కోవటం.. అతడి జాడను గుర్తించిన పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకోవటంతో కాకాణి కథ ప్రస్తుతానికి పోలీసు లాకప్ వరకు చేరింది. తర్వాత ఏమవుతుందో చూడాలి.

Tags: #APpolitics#IllegalMining#KakaniArrest#KakaniGovardhanReddy#PoliticalControversy#QuartzMiningScam#YCPLeaders
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

TCS: భార్య వేధింపులతో టెకీ ఆత్మహత్య..వెలుగులోకి సంచలన విషయాలు..!

Next Post

Shanaya Kapoor: సీనియ‌ర్ హీరోతో రొమాన్స్..!

Related Posts

MalaikaArora
Entertainment

MalaikaArora:వివాహ వేడుకలో మెరిసిన మలైకా అరోరా.. కృతికా కమ్రా–గౌరవ్ కపూర్ పెళ్లిలో గ్లామర్ హైలైట్

RechargeScam
Big Story

RechargeScam:28 రోజుల “నెలవారీ” రీఛార్జ్ స్కామ్.. పార్లమెంటులో లేవనెత్తిన అంశం, వినియోగదారులకు అదనపు భారమా?

EVPolicy
Big Story

EVPolicy:తెలంగాణలో ఎలక్ట్రిక్ వాహనాలకే ప్రాధాన్యం.. జిల్లా కేంద్రాల చుట్టూ రింగ్ రోడ్లు నిర్మాణం: సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

APMinisters
Andhra Pradesh

APMinisters:ఫైళ్ల క్లియరెన్స్‌పై మంత్రులకు సీఎం చంద్రబాబు రేటింగ్.. అచ్చెన్నాయుడు మొదటి స్థానం, వంగలపూడి అనిత చివరి స్థానంలో!

Virosh
Entertainment

Virosh:రష్మిక మందన్నా, విజయ్ దేవరకొండ క్యూట్ మూమెంట్స్‌తో మెరిసిన వేడుక

LiquorScam
Andhra Pradesh

LiquorScam:జగన్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు – ఈడీ విచారణ, ఆస్తుల జప్తు వివాదం

Next Post
Shanaya Kapoor: సీనియ‌ర్ హీరోతో రొమాన్స్..!

Shanaya Kapoor: సీనియ‌ర్ హీరోతో రొమాన్స్..!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

సచివాలయ అధికారుల సంఘంTelangana | నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ

సచివాలయ అధికారుల సంఘంTelangana | నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

MalaikaArora

MalaikaArora:వివాహ వేడుకలో మెరిసిన మలైకా అరోరా.. కృతికా కమ్రా–గౌరవ్ కపూర్ పెళ్లిలో గ్లామర్ హైలైట్

RechargeScam

RechargeScam:28 రోజుల “నెలవారీ” రీఛార్జ్ స్కామ్.. పార్లమెంటులో లేవనెత్తిన అంశం, వినియోగదారులకు అదనపు భారమా?

EVPolicy

EVPolicy:తెలంగాణలో ఎలక్ట్రిక్ వాహనాలకే ప్రాధాన్యం.. జిల్లా కేంద్రాల చుట్టూ రింగ్ రోడ్లు నిర్మాణం: సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

APMinisters

APMinisters:ఫైళ్ల క్లియరెన్స్‌పై మంత్రులకు సీఎం చంద్రబాబు రేటింగ్.. అచ్చెన్నాయుడు మొదటి స్థానం, వంగలపూడి అనిత చివరి స్థానంలో!

Recent News

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info