ప్రస్తుత కాలంలో హీరోయిన్లు ఏ రేంజ్ లో ఫిట్నెస్ మైంటైన్ చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నాలుగు పదుల వయసు దాటినా ఇంకా అంతే అందంగా కనిపిస్తూ ఆకట్టుకుంటున్నారు. దీనికి తోడు ఇద్దరు పిల్లల తల్లులైనా సరే తమ అందంతో.. నిత్యయవ్వనంతో అలరిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ హీరోయిన్స్ ని చూస్తే వీళ్ళు పిల్లల తల్లుల్లాగా అనిపించడం లేదు అంటూ నెటిజన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు.. అలా ఎప్పటికప్పుడు తన అందంతో, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న వారిలో కాజల్ అగర్వాల్ కూడా ఒకరు.
ఈమధ్య నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ప్రేక్షకులను అలరిస్తున్న ఈ ముద్దుగుమ్మ.. అటు సినిమాలలో కూడా అవకాశాలు అందుకుంటూ బిజీగా మారిపోయిన విషయం తెలిసిందే.. ఈ క్రమంలోనే తాజాగా ప్రేక్షకులను అలరించడానికి మరో ఔట్ ఫిట్ తో ఇంస్టాగ్రామ్ వేదికగా మన ముందుకు వచ్చేసింది. ఇందులో బ్లాక్ అండ్ వైట్ ట్రెండీ అవుట్ ఫిట్ ధరించి అందాలతో అలరిస్తోంది. కాజల్ అగర్వాల్ ను చూస్తే ఇంకా స్వీట్ 20 లాగే ఉంది అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. కాటుక కళ్ళతో మాయ చేస్తూ నెటిజన్స్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా కాజల్ అగర్వాల్ షేర్ చేసిన ఈ ఇంస్టాగ్రామ్ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
కాజల్ అగర్వాల్ సినిమా కెరియర్ విషయానికి వస్తే.. తేజ దర్శకత్వంలో వచ్చిన లక్ష్మీ కళ్యాణం ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించింది. 2007లో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత 2009లో మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ హీరోగా, రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన మగధీర సినిమాలో నటించిన కాజల్ కి ఇద్దరికీ ఇది రెండవ సినిమా కావడం గమనార్హం. అంతేకాదు ఈ ఇద్దరికీ బ్రేక్ ఇచ్చిన సినిమా కూడా ఇదే అని చెప్పవచ్చు.
తర్వాత రామ్ పోతినేనితో కలిసి గణేష్, అల్లు అర్జున్తో ఆర్య 2 వంటి చిత్రాలలో నటించిన ఈమె.. 2010లో కరుణాకరన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వచ్చిన డార్లింగ్ సినిమాలో నటించింది. ఆ తర్వాత బృందావనం, నా పేరు శివ, బిజినెస్ మాన్ ఇలా పలు చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న ఈమె తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పేరు సొంతం చేసుకుంది.
తెలుగులోనే కాదు తమిళ్, హిందీ భాషల్లో కూడా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న కాజల్ అగర్వాల్.. 2020 కరోనా లాక్డౌన్ సమయంలో వ్యాపారవేత్త, తన చిన్ననాటి స్నేహితుడైన గౌతమ్ కిచ్లును వివాహం చేసుకుంది. 2022 ఏప్రిల్ 19న వీళ్లకు ఒక మగ బిడ్డ కూడా జన్మించారు. ప్రస్తుతం ఇండియన్ 3 చిత్రంతో పాటు మరో రెండు మూడు సినిమాల లో నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ.