జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పాయింట్స్.
జగ్గంపేట నియోజకవర్గంలో జ్యోతుల పాపారావు లిఫ్ట్ ఇరిగేషన్ పధకానికి భూమి పూజ చేసిన జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు.
పురుషోత్తమపట్నం లిఫ్ట్ ఇరిగేషన్ పధకం స్టేజ్-2 ప్రెషర్ మెయిన్ ద్వారా మామిడాడ ట్యాంక్ కు నీటి సరఫరా కల్పించేలా 3.49 కోట్లతో భూమిపూజ.జగ్గంపేట నియోజకవర్గంలో సీతారాముడు చెరువు, జగ్గవాని చెరువు, అచ్చన్న చెరువు వంటి చెరువులకు నీరందడం ద్వారా 3,500 ఎకరాల ఆయకట్టు స్ధిరీకరణ సాధ్యమౌతుంది.
రాష్ట్రంలో ఏ ఇరిగేషన్ ప్రాజెక్టు చూసినా మొదలు పెట్టి, పూర్తి చేసిన ఘనత ఎన్టీఆర్, చంద్రబాబులకే దక్కుతుంది.కూటమి ప్రభుత్వం వచ్చిన ఏడాదిలోనే 3750 కోట్లు ఖర్చు చేసి, హంద్రీనీవా ద్వారా 738 కిలో మీటర్లకు దూరం కృష్ణాజలాలు తరలించి కుప్పంకు నీరందించాం.
రాష్ట్రంలో 1040 లిఫ్ట్ స్కీమ్స్ ఉంటే కేవలం 140 మాత్రమే పని చేస్తున్నాయంటే 5 ఏళ్ళ జగన్ పాలనా పాపమే కారణం.జగన్ విధ్వంశం చేసిన ఇరిగేషన్ రంగాన్ని గాడిలోపెట్టి, కీలక ప్రాజెక్టులు పూర్తి చేసే లక్ష్యంతో పనులు చేస్తున్నాం.
2026 ఖరీఫ్ సీజన్ నాటికి పోలవరం ఎడమ కాలువ పనులు పూర్తి చేసి, గోదావరి జలాలను ఉత్తరాంధ్రకు తరలిస్తాం.చంద్రబాబు వాటర్ మేనేజ్మెంట్ విధానం ద్వారా రాష్ట్రంలో రిజర్వాయర్లు నిండుకుండలా కళకళలాడుతున్నాయి.
వరద జలాలను సద్వినియోగం చేసుకుని చెరువులను సైతం పూర్తి స్దాయిలో నింపి, భూగర్భజలాలు పెంచేలా పనిచేస్తున్నాం.మోధీ సహాకారంతో ముఖ్యమంత్రి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు రాష్ట్రాన్ని అభివృద్ది, సంక్షేమం దిశగా పరుగులు పెట్టిస్తున్నారు.


















