ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home Big Story

Telangana: తీవ్ర ఉత్కంఠ రేపుతోన్న జూబ్లీహల్స్‌ ఎన్నికలు

Telangana: తీవ్ర ఉత్కంఠ రేపుతోన్న జూబ్లీహల్స్‌ ఎన్నికలు
ADVERTISEMENT

తెలంగాణ రాష్ట్ర చూపు మొత్తం జూబ్లీహిల్స్ ఎన్నికపైకి మళ్లీంది. ఇక్కడ ఎవరు విజయం సాధిస్తారు అనేది చాలా ఆసక్తికరంగా మారింది. ఓవైపు మరణించిన ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ భార్య బీఆర్ఎస్ నుంచి పోటీలో ఉంది. ఇంకోవైపు బిజెపి అభ్యర్థిని ఇంకా ప్రకటించలేదు. ఇదే సమయంలో కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ పేరు ఫైనల్ అయిపోయింది. ఈ విధంగా ముక్కోనపు పోరులో ఎవరు విజయం సాధిస్తారు. ఎవరికి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అనేది ఇప్పుడు చూద్దాం. అయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ సెంటిమెంట్ వర్కౌట్ చేయాలని చూస్తోంది. ఎందుకంటే అక్కడ లాస్ట్ టైం ఎలక్షన్స్ లో గెలిచినటువంటి మాగంటి గోపీనాథ్ మరణించడం ఆయన భార్య కి టికెట్ ఇవ్వడం వల్ల ఆ సెంటిమెంట్ తో ఎలాగైనా గెలవాలని ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇప్పటికే ప్రచారం కూడా సాగిస్తోంది.

ఇక్కడ విజయం సాధిస్తే మళ్లీ బీఆర్ఎస్ లో కొత్త ఊపు వస్తుందని బీఆర్ఎస్ శ్రేణులు ఆశిస్తున్నారు. అలాంటి ఈ టైం లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ రంగంలోకి దిగారు. అయితే ఈయన ఇప్పటికే జూబ్లీహిల్స్ లో పలుమార్లు పోటీ చేసి ఓడిపోవడం తెలిసిన విషయమే. అలాంటి నవీన్ యాదవ్ గెలిచే అవకాశాలు ప్రధానంగా మూడు ఉన్నాయి. అవి ఏంటో చూద్దాం.. నవీన్ యాదవ్ 2014 ఎన్నికల్లో మజిలీస్ పార్టీ నుంచి పోటీ చేసి 41 వేల 656 ఓట్లు సాధించి రెండవ స్థానంలో నిలిచారు.. అంతేకాకుండా 2018 ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీ చేసి 18,000 ఓట్లు సాధించారు. ఇక ఈ మధ్యనే కాంగ్రెస్ లో పార్టీ లో చేశారు. ఈ విధంగా రెండుసార్లు పోటీ చేసి ఓడిపోవడం నవీన్ యాదవ్ కు కలిసి వచ్చే అంశం.

ఇదే కాకుండా నవీన్ యాదవ్ స్థానికుడు కావడం ఆయనకు యూత్లో ఫాలోయింగ్ ఉండడం మరో విధంగా కలిసివస్తుంది. ఇక ప్రధానంగా ఆయనకు మజిలీస్ పార్టీ నుంచి ముస్లింలంతా సపోర్ట్ చేయడం అనేది ఎంతోకాలంగా జరుగుతూ వస్తోంది. ఎన్నికల్లో కూడా మజిలీస్ పార్టీ ముస్లింలంతా ఆయనకు సపోర్ట్ చేస్తారు. ఇక ఇదే కాకుండా ఇంతకుముందు గెలిచిన వారంతా స్థానికేతరులే. కానీ ఈసారి నవీన్ యాదవ్ స్థానికుడు కావడం ఇదే అంశాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం లాంటివి చేస్తున్నారు. ఇంకో అంశం ఏమిటంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడం నవీన్ యాదవ్ కి కలిసొచ్చే అంశం. ఈ విధంగా నవీన్ యాదవ్ కు ఏ వైపు చూసుకున్న గెలుపు అవకాశాలు మాత్రం ఎక్కువగానే ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

హైద‌రాబాద్ నగరంలోని ప్రతిష్టాత్మకమైన జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం మరోసారి రాజకీయంగా హాట్‌స్పాట్‌గా మారింది. ఉపఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రధాన పార్టీలు తమ వ్యూహాలను వేగంగా అమలు చేస్తూ, అభ్యర్థుల ఎంపికను పూర్తి చేస్తున్నాయి. ఈ నెల 13 నుంచి నామినేషన్లు ప్రారంభం కానుండగా, నవంబర్ 11న పోలింగ్ జరగనుంది. ఫలితాలు నవంబర్ 14న వెలువడనున్నాయి. ఈ పరిణామాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిని అధికారికంగా ప్రకటించింది. బుధవారం రాత్రి ఆలస్యంగా పార్టీ నాయకత్వం బీసీ వర్గానికి చెందిన యువ నాయకుడు నవీన్ యాదవ్‌ను జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఎంపిక చేసింది.

నవీన్ యాదవ్ రాజకీయ జీవితం 2014లో ప్రారంభమైంది. రాష్ట్ర విభజన అనంతరం ఆయన ఎంఐఎంలో చేరి, అదే సంవత్సరం జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఆయన రెండో స్థానంలో నిలిచినా, గెలుపు గుర్రం ఎక్క‌లేక‌పోయారు. అప్పటి నుంచి ఆయన నియోజకవర్గంలో నిరంతరం క్రియాశీలకంగా పనిచేస్తూ ప్రజల్లోకి వెళ్ళే ప్రయత్నం చేశారు. 2018లో టికెట్ దక్కకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినా, అప్పుడు కేవలం 7,000 ఓట్లు మాత్రమే దక్కించుకుని డిపాజిట్ కూడా కోల్పోయారు. త‌ర్వాత కాలంలో ఆయన కాంగ్రెస్ లో చేరి, పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నారు. 2023 ఎన్నికల్లో టికెట్ ఆశించినా దక్కలేదు. అయితే, పార్టీపై విశ్వాసం కోల్పోకుండా పనిచేస్తూ, ఈసారి చివరికి కాంగ్రెస్ అధినేతలు ఆయనకు అవకాశం కల్పించారు. ఆర్థికంగా బలమైన నాయకుడిగా, స్థానికంగా యువతలో కొంత ప్రాచుర్యం కలిగిన నేతగా పేరు తెచ్చుకున్నారు.

అయితే, నవీన్ యాదవ్‌కు గెలుపు అంత సులభం కాదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. వ్యక్తిగతంగా ప్రజల్లో పట్టు అంతగా లేకపోవడం, గత రెండు సార్లు ఓటమిపాలు కావడం ఆయనకు ప్రధాన సవాలు. అంతేకాకుండా, జూబ్లీహిల్స్‌లో బీఆర్ఎస్, బీజేపీ బలంగా ఉండడం న‌వీన్‌కు అంత సులువు కాదు. అయినా అధికార పార్టీ అభ్యర్థిగా పోటీ చేయడం ఆయనకు పెద్ద అదృష్టం. ఇక ప్రస్తుత ఎన్నికల్లో యువత, బీసీ వర్గం ఓటు బ్యాంకును ఆకర్షించగలిగితేనే ఆయన గెలుపు సాధ్యమని భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఆయన వెనుక నిలబడి, వ్యూహాత్మక ప్రచారానికి సిద్ధమవుతోంది. మొత్తంగా, జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో నవీన్ యాదవ్ పోటీ రాజకీయంగా ఆసక్తికర మలుపు తిప్పే అవకాశముంది.

Tags: #bjp#BreakingPoliticalNews#BRS#ByElection#ByPollNews#congress#ElectionBattle#ElectionCampaign#HyderabadPolitics#JubileeHills#JubileeHillsByPoll#NaveenYadav#PoliticalUpdates#PoliticalWar#revanthreddy#Telangana#TelanganaElections#TelanganaNews#TelanganaPolitics#TGPolitics#VoterTurnout
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

Cm ChandraBabu: రుషికొండ ప్యాలెస్‌ల వినియోగం ఎన్నడు?

Next Post

Guntur: చదివింది ఇంజినీరింగ్..చేసేది సైబర్ నేరాలు.. పోలీసులకు ఎలా దొరికాడంటే?

Related Posts

TelanganaEducation
Big Story

TelanganaEducation:తెలంగాణ విద్యా కమిషన్ నివేదిక సమర్పణ | సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచనలు

APAssembly
Andhra Pradesh

APAssembly: సీఎం చంద్రబాబు వైసీపీపై తీవ్ర విమర్శలు, రాయలసీమ–ఉత్తరాంధ్ర ప్రాజెక్టులపై కీలక ప్రకటన

T20WorldCup
Big Story

T20WorldCup:జింబాబ్వేపై భారత్ ఘన విజయం | 72 పరుగుల తేడాతో టీమిండియా సత్తా

ViroshWedding
Entertainment

ViroshWedding:విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న రొమాంటిక్ & ఎలిగెంట్ సెలబ్రిటీ వెడ్డింగ్ హైలైట్స్

IndiaHealth
Big Story

IndiaHealth:పాలు, కూరగాయలు, మసాలాల్లో రసాయనాలు – ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం

RealLifeBichagadu
Andhra Pradesh

RealLifeBichagadu:భార్య ఆరోగ్యం కోసం భిక్షాటన చేస్తున్న అడ్వకేట్ జలందర్ రెడ్డి

Next Post
Guntur: చదివింది ఇంజినీరింగ్..చేసేది సైబర్ నేరాలు.. పోలీసులకు ఎలా దొరికాడంటే?

Guntur: చదివింది ఇంజినీరింగ్..చేసేది సైబర్ నేరాలు.. పోలీసులకు ఎలా దొరికాడంటే?

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

సచివాలయ అధికారుల సంఘంTelangana | నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ

సచివాలయ అధికారుల సంఘంTelangana | నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

అనంతపూర్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే అనంతకి షాక్ఇవ్వనున్న సాంబశివారెడ్డి

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

TelanganaEducation

TelanganaEducation:తెలంగాణ విద్యా కమిషన్ నివేదిక సమర్పణ | సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచనలు

APAssembly

APAssembly: సీఎం చంద్రబాబు వైసీపీపై తీవ్ర విమర్శలు, రాయలసీమ–ఉత్తరాంధ్ర ప్రాజెక్టులపై కీలక ప్రకటన

T20WorldCup

T20WorldCup:జింబాబ్వేపై భారత్ ఘన విజయం | 72 పరుగుల తేడాతో టీమిండియా సత్తా

ViroshWedding

ViroshWedding:విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న రొమాంటిక్ & ఎలిగెంట్ సెలబ్రిటీ వెడ్డింగ్ హైలైట్స్

Recent News

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info