టాలీవుడ్ నవ దళపతి సుధీర్ బాబు ఇప్పుడు జటాధర మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. రిజల్ట్ తో సంబంధం లేకుండా వరుస సినిమాల్లో నటిస్తున్న ఆయన.. ఇప్పుడు సరైన హిట్ కోసం వెయిట్ చేస్తున్నారు. మరికొద్ది రోజుల్లో సూపర్ నేచురల్ థ్రిల్లర్ జటాధరతో సందడి చేయనున్నారు.
వెంకట్ కళ్యాణ్, అభిషేక్ జైస్వాల్ దర్శకత్వంలో రూపొందుతున్న ఆ సినిమా.. నవంబర్ 7వ తేదీన తెలుగు, హిందీ భాషల్లో వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా విడుదల కానుంది. దీంతో మేకర్స్ ఇప్పటికే ప్రమోషన్స్ ను మొదలుపెట్టారు. వరుస అప్డేట్లతో సందడి చేస్తున్నారు. ఇప్పటికే అద్భుతమైన పోస్టర్లు రిలీజ్ చేసి మంచి బజ్ క్రియేట్ చేశారు.
ఇటీవల సినిమా నుంచి ‘సోల్ ఆఫ్ జటాధర’ అనే థీమ్ సాంగ్ ను కూడా మేకర్స్ విడుదల చేయగా.. అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ‘ఓం నమః శివాయ’ మంత్రంతో సాగే ఆ పాట.. సినిమాలోని ఆధ్యాత్మిక భావనను తెలియజేస్తూ ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంది. రాజీవ్ రాజ్ స్వరపరిచిన ఆ సాంగ్.. సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా మారింది.
ఇప్పుడు అదే జోష్ తో దుర్గా పూజ పండుగను పురస్కరించుకుని మరో పాటను తాజాగా తీసుకొచ్చారు మేకర్స్. సినిమా నుంచి ‘ధన పిశాచి’ అనే మరో కొత్త పాటను విడుదల చేశారు. అందులో బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా కనిపించారు. నెవ్వర్ బిఫోర్ అనేలా ఉగ్రరూపంలో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారని చెప్పాలి.
సాంగ్ లో తన ఎక్స్ప్రెషన్స్ తో అందరినీ ఫిదా చేస్తున్నారు. ఎనర్జిటిక్ డ్యాన్స్ మూమెంట్స్ తో పాటకు కొత్త ఊపు తెచ్చారని చెప్పాలి. భారీ సెట్ లో చిత్రీకరించిన ఆ పాట.. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సమీర కొప్పికర్ సంగీతం అందించిన ఆ పాటను మధుబంతి బాగ్చి అద్భుతంగా ఆలపించి మెప్పిస్తున్నారు.
ఇక సినిమా విషయానికొస్తే.. సుధీర్ బాబుతో పాటు సోనాక్షి సిన్హా లీడ్ రోల్ పోషిస్తున్నారు. దివ్యా ఖోస్లా, శిల్పా శిరోద్కర్, ఇందిరా కృష్ణ, రవి ప్రకాష్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. జీ స్టూడియోస్ తో పాటు ఉమేశ్ కేఆర్ బన్సల్, ప్రేరణ అరోరా సమర్పిస్తున్నారు. ఉమేష్ కుమార్ బన్సల్, శివిన్ నారంగ్, అరుణ అగర్వాల్, ప్రేరణ అరోరా, శిల్పా సింగ్‌హల్, నిఖిల్ నందా నిర్మిస్తున్నారు. మరి జటాధర మూవీ ఎలా ఉంటుందో చూడాలి.