ఎవరికైనా సక్సెస్, ఫెయిల్యూర్లు సహజం. అయితే సక్సెస్ ఎవరికైనా కిక్కిస్తే ఫెయిల్యూర్ మాత్రం చాలా డిజప్పాయింట్ చేస్తుంది. అయితే కొందరు మాత్రం ఫెయిల్యూర్ ను దృష్టిలో పెట్టుకుని, మళ్లీ అలాంటివి రాకుండా జాగ్రత్త పడితే, ఇంకొందరు మాత్రం ఫెయిల్యూర్ వచ్చినంత మాత్రాన దిగులు పడుతూ కూర్చుంటే ఎలా అని కెరీర్లో ముందుకెళ్తూ ఉంటారు.
జాన్వీ కపూర్ ఇందులో ఆఖరి కోవలోకి వస్తుంది. అతిలోక సుందరి శ్రీదేవి కూతురిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన జాన్వీ, తక్కువ టైమ్ లోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. రీసెంట్ గా జాన్వీ నుంచి వచ్చిన పరమ్ సుందరి, సన్నీ సంస్కారీ కీ తులసీ కుమారి సినిమాలు బాక్సాఫీస్ వద్ద అనుకున్న ఫలితాల్ని అందుకోలేకపోయాయి. అయినప్పటికీ జాన్వీ కృంగి పోలేదు.
ఆ సినిమాలు ఫ్లాప్ అయినా జాన్వీ మాత్రం తర్వాతి సినిమాను లైన్ లో పెట్టి అందరికీ షాకిచ్చింది. టైగర్ ష్రాఫ్, లక్ష్య ప్రధాన పాత్రల్లో కరణ్ జోహార్ నిర్మాణంలో ఓ కొత్త యాక్షన్ డ్రామాకు జాన్వీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే జాన్వీ ఈ సినిమా ఒప్పుకోవడానికి కారణం.. తాను కేవలం రొమాంటిక్ సినిమాలు మాత్రమే కాదు, ఏ జానర్ సినిమాలైనా చేయగలనని నిరూపించుకోవాలనుకోవడం.
రాజ్ మెహతా దర్శకత్వంలో రానున్న ఈ సినిమా యాక్షన్, రివెంజ్, ఇంటెన్స్ డ్రామాతో రూపొందనుందని వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు, ఈ మూవీలో జాన్వీకి చాలా స్ట్రాంగ్ రోల్ దక్కిందని, ఈ సినిమా ద్వారా తన ఎనర్జీ, ఎమోషన్, స్క్రీన్ ప్రెజెన్స్ ను మరింత బలంగా చూపించే అవకాశముందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఫ్యాన్స్ మాత్రం టైగర్ ష్రాఫ్, లక్ష్యతో జాన్వీ కెమిస్ట్రీ ఎలా ఉంటుందోనని డిస్కస్ చేసుకుంటున్నారు.
రెండు ఫ్లాపుల తర్వాత జాన్వీ ఇలాంటి అడుగు వేయడం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఇలాంటి సినిమాలు ఎంచుకుని, ఫ్లాపులు తన కెరీర్ ను డిసైడ్ చేయలేవని జాన్వీ నిరూపించుకోవాలని చూస్తుంది. అంతేకాదు, నటిగా కూడా తనను ఛాలెంజ్ చేసే సినిమాలను ఎంచుకోవాలని డిసైడై, అలాంటి క్యారెక్టర్లపైనే జాన్వీ ఫోకస్ చేసి రిస్క్ చేయడానికి కూడా జాన్వీ రెడీ అయిందని బాలీవుడ్ మీడియా వర్గాలంటున్నాయి. ఈ సినిమా సక్సెస్ అయితే ఇప్పటివరకు ఉన్న జాన్వీ క్రేజ్ మరో లెవెల్ కు వెళ్లడం ఖాయం. ఎవరైనా వరుస ఫ్లాపులు వచ్చినప్పుడు సేఫ్ ప్రాజెక్టులను సెలెక్ట్ చేసుకుని హిట్ అందుకోవాలని చూస్తారని, కానీ జాన్వీ మాత్రం భిన్నంగా ఆలోచించి తన సత్తా ఏంటో చాటాలని కసిగా ఉందని, ఏ నటికైనా ఇలాంటి లక్షణమే ఉండాలని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.














