జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇక రాజకీయాల మీదనే ఫుల్ ఫోకస్ పెడతారు అని అంటున్నారు. ఆయన కమిట్ అయిన సినిమాలు వరసగా పూర్తి చేశారు. ఒక్క సినిమా బాలెన్స్ అయితే ఉంది, అది కూడా ఫినిష్ చేసి 2025 క్యాలడర్ ఇయర్ ని ముగించాలని ఆయన చూస్తున్నారు అని ప్రచారం సాగుతోంది. మరో మూడు నెలలలో కొత్త ఏడాది 2026 రానుంది. కొత్త ఎపుడూ అందరికీ ఆశలనే ఇస్తుంది. ఎవరి ప్లాన్స్ వారు రూపొందించుకుంటారు వైసీపీ కూడా కొత్త ఏడాదిలో ఫుల్ యాక్టివ్ కావాలని నిర్ణయించుకుంది. ఇక జనసేన కూడా 2026 లోనే తన యాక్షన్ ప్లాన్ ని రెడీ చేసుకుంది అని అంటున్నారు.
పవన్ కళ్యాణ్ ఏపీలో ఎన్నికల అనంతరం ఉప ముఖ్యమంత్రిగా ఫుల్ బిజీ అయ్యారు. ఇక ఈ మధ్యలో తన సినిమాలు కొన్ని చేశారు. అలా తొలి రెండేళ్ళూ జరిగిపోయాయి. ఇపుడు ఆయన జనంలోకి పెద్ద ఎత్తున రావాలని చూస్తున్నారు అని అంటున్నారు. దానికి ముహూర్తంగా 2026 ని పెట్టుకున్నారు అని చెబుతున్నారు. ఆ ఏడాది కాల్షీట్లు మొత్తం పాలిటిక్స్ కే అని చెబుతున్నారు. పవన్ డైరీలో ఆ ఏడాది మొత్తం రోజులు అన్నీ ఫుల్ గా రాజకీయాలకే అని అంటున్నారు జనంలోకి రావడం వారితో మమేకం కావడం అధికార స్థాయిలో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించడం వంటివి పవన్ చేస్తారు అని అంటున్నారు.
మరో వైపు చూస్తే పవన్ డిప్యూటీ సీఎం అయ్యాక పెద్దగా ఢిల్లీ వెళ్ళింది లేదు. బీజేపీ పెద్దలతో ఆయనకు మంచి రిలేషన్స్ ఉన్నాయి. కానీ ఆయన ఢిల్లీ టూర్లు అయితే వేయలేదు. కానీ 2026 లో అలా కాదని అంటున్నారు. పవన్ ఢిల్లీకి ఇక మీదట అవసరం అనుకున్నపుడల్లా వెళ్తారు అని అంటున్నారు. ఏపీకి సంబంధించిన అంశాల మీద కేంద్ర పెద్దలతో చర్చించి ఏపీకి నిధులు తీసుకుని వచ్చే కార్యక్రమాలు అభివృద్ధి పనుల మీద ఫోకస్ పెడతారు అని అంటున్నారు. అంతే కాదు కేంద్ర పెద్దలతో సాన్నిహిత్యాన్ని కూడా ఆయన మరింతగా పెంచుకుంటారు అని చెబుతున్నారు. తద్వారా కేంద్ర బీజేపీకి ఏపీలో నమ్మకమైన మిత్రపక్షంగా జనసేన ఉంది అన్నది మరింతగా ఫోకస్డ్ గా జనంలోకి వెళ్ళేలా చూసుకుంటారు అని అంటున్నారు
ఏపీలో చూస్తే రాజకీయం పూర్తిగా కూటమికి అనుకూలంగా ఉందనే పవన్ భావిస్తున్నారు అని అంటున్నారు. వైసీపీని మరోసారి అధికారంలోకి రానీయమని ధీమా కూడా ఆయనకు ఉంది అని చెబుతున్నారు. అందుకే పదే పదే మరో పదిహేనేళ్ళ పాటు మేమే అధికారంలో ఉంటామని గట్టిగా చెబుతున్నారు అని అంటున్నారు. అయితే రాజకీయం ఎపుడూ ఒకేలా ఉండదు కాబట్టి అనుకోని పరిస్థితులు ఎదురైనా వైసీపీ ఏమైనా బలపడితే మాత్రం ప్లాన్ బీ కూడా పవన్ రెడీ చేసుకుంటారు అని అంటున్నారు. ప్లాన్ బీ ద్వారా వైసీపీని దెబ్బ తీసేందుకు చూస్తారు అని అంటున్నారు. అలా అవసరం అయితే మాత్రం వచ్చే ఎన్నికల్లో బీజేపీతో కలసి బరిలోకి దిగి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చి ఆనక తామంతా కలసి మళ్ళీ అధికారంలోకి వచ్చే ఎత్తుగడ కూడా ఉందని ప్రచారం అయితే సాగుతోంది. ఇందులో నిజమెంత ఉందో తెలియదు కానీ గతంలో మాదిరిగా సింగిల్ పాయింట్ అజెండాతోనే కాకుండా అన్ని రకాల ఆప్షన్స్ ని కూడా దగ్గర ఉంచుకునే పవన్ 2029 ఎన్నికలను ఫేస్ చేస్తారు అని అంటున్నారు. ఏది చేసినా వైసీపీని అధికారంలోకి రాకుండా చేయడం అన్నది మాత్రం పక్కా అని చెబుతున్నారు. చూడాలి మరి పవన్ జోరు హోరు 2026 నుంచి ఏ విధంగా ఉంటాయో.