యంగ్ హీరోయిన్ ఇవానా(Ivana) ‘మాస్టర్స్’ మూవీతో ఇండస్ట్రీకి వచ్చింది. ‘లవ్ టుడే’(Love Today) సినిమాతో ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది. ఆ తర్వాత వరుస అవకాశాలు అందుకున్న ఇవానా కలవన్, మతిమారన్, ఎల్‌జీమ్ వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించింది. ఇక గత ఏడాది బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన డ్రాగన్ మూవీలోనూ కీలక పాత్రలో కనిపించింది. ప్రస్తుతం ఈ అమ్మడు టాలీవుడ్ యంగ్ హీరో శ్రీ విష్ణు (Sri Vishnu)సరసన ‘సింగిల్’ (single)మూవీలో హీరోయిన్‌గా నటిస్తోంది. వెన్నెల కిశోర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో యంగ్ బ్యూటీ కేతిక శర్మ(Ketika Sharma) కూడా నటిస్తోంది.
కార్తీక్ రాజు దర్శకత్వం వహిస్తున్న ‘సింగిల్’ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, కళా ఫిల్మ్స్‌పై విద్యా కొప్పినీడి, భాను ప్రతాప్, రియాజ్ చౌదరి సంయుక్తంగా నిర్మిస్తు్న్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే వచ్చిన అప్‌డేట్స్ అన్నీ ఆకట్టుకోగా.. భారీ అంచనాల మధ్య మే 9న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతోంది. ఈ క్రమంలోనే మూవీ టీమ్ ప్రమోషన్స్ జోరు పెంచారు. వరుస ఇంటర్వ్యూలో పాల్గొంటున్నారు. తాజాగా, ఇవానా ఓ ఇంటర్వ్యూలో భాగంగా ఆసక్తికర కామెంట్స్ చేసింది. ‘‘నేను స్పోర్ట్స్ ఎక్కువగా చూడను.
కానీ ధోని సర్‌ను గౌరవిస్తాను. ఆయన సినిమాల్లోకి వస్తారని అనుకోలేదు. అసలు ధోని నిర్మాతగా వ్యవహరించిన ఫస్ట్ మూవీలో నేను హీరోయిన్ అవ్వడం చాలా అదృష్టం. తన ఫస్ట్ హీరోయిన్ నేనే అని ఒక హ్యాపినెస్ ఉంది. ఆయనతో నేను ఫొటోలు దిగాను. ధోని సర్‌ని కలిసినప్పుడు ఆయనతో ఎలా మాట్లాడాలో నాకు కొంచెం భయం వేసింది. కానీ ఈ సమయంలో ఆయనే నా దగ్గరకు వచ్చి నేను బాగా చేసాను, అద్భుతంగా నటించాను అని సినిమాలో సీన్స్ గురించి చెప్పి అభినందించారు. ధోని చాలా మంచి వ్యక్తి. ఆయనతో వర్క్ చేయడం అద్భుతమైన అనుభవంగా భావిస్తున్నా’’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.