ADVERTISEMENT
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
news7telugu
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Andhra Pradesh
  • Telangana
  • National
  • World
  • Sports
  • Health
  • Business
No Result
View All Result
news7telugu
No Result
View All Result
Home National

IPL 2025 : మరికొద్ది గంటల్లో ఐపీఎల్ సంగ్రామం

క్రికెట్ అభిమానులు పండుగ నేడే

IPL 2025 : మరికొద్ది గంటల్లో ఐపీఎల్ సంగ్రామం
ADVERTISEMENT

టీ20 మజాను మరోసారి అందించేందుకు.. పొట్టి క్రికెట్ మత్తులో ఫ్యాన్స్ ను ఉర్రూతలూగించేందుకు ఐపీఎల్ కొత్త సీజన్ వచ్చేస్తోంది. ఐపీఎల్ 2025 రేపే (మార్చి 22) స్టార్ట్ అవుతుంది. ఈడెన్ గార్డెన్స్ లో జరిగే తొలి మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ కోల్ కతా నైట్ రైడర్స్ తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనుంది. ఈ మ్యాచ్ కంటే ముందు గ్రాండ్ గా ఓపెనింగ్ సెర్మనీ నిర్వహించబోతున్నారు.

ఐపీఎల్ 2025 ఓపెనింగ్ సెర్మనీని గ్రాండ్ గా నిర్వహించేందుకు బీసీసీఐ అన్ని ఏర్పాట్లు చేసింది. సింగర్స్ శ్రేయా ఘోషాల్, కరణ్ స్పెషల్ పర్ ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఉర్రూతలూగించనున్నారు. ‘కల్కి 2898 ఏడీ’, ‘యోధ’ వంటి చిత్రాలలో నటించిన బాలీవుడ్ నటి దిశా పటాని కూడా ఈ ఓపెనింగ్ సెర్మనీలో అలరించనుంది. శ్రద్ధాకపూర్, వరుణ్ ధావన్ కూడా ఈ వేడుకలోపాల్గొనే అవకాశముంది. ‘సికందర్’ ప్రమోషన్ కోసం సల్మాన్ ఖాన్ కూడా హాజరుకావచ్చు.

ఈ సీజన్ లో మొత్తం 74 మ్యాచ్ లు జరుగుతాయి. ఫైనల్ మే 25న నిర్వహిస్తారు. 13 స్టేడియాలు మ్యాచ్ లకు ఆతిథ్యమిస్తాయి.

ఐపీఎల్ ప్రారంభోత్సవం మార్చి 22న సాయంత్రం 6 గంటలకు ఆరంభమవుతుంది. ఆ తర్వాత సీజన్ తొలి మ్యాచ్ లో కేకేఆర్, ఆర్సీబీ తలపడతాయి. ఈడెన్ గార్డెన్స్ వేదిక. మ్యాచ్ సాయంత్రం 7.30 కు స్టార్ట్ అవుతుంది. టీవీల్లో స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ లో మ్యాచ్ లు చూడొచ్చు. జియోహాట్ స్టార్ యాప్, వెబ్‌సైట్‌లో లైవ్ స్ట్రీమింగ్ వీక్షించొచ్చు.

అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న క్రికెట్ పండుగ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 సీజన్‍కు అంతా సిద్ధమైంది. 10 జట్లు తలపడే హోరాహోరీ టోర్నీకి వేళైంది. నేడు (మార్చి 22) ఐపీఎల్ 18వ సీజన్ షురూ కానుంది. సుమారు రెండు నెలలు మే 25 వరకు ఈ సీజన్ సాగనుంది. డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‍కతా నైట్‍రైడర్స్ (కేకేఆర్), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) జట్ల మధ్య ఫస్ట్ మ్యాచ్ జరగనుంది. కోల్‍కతాలోని ఈడెన్స్ గార్డెన్స్ వేదికగా ఈ పోరు సాగనుంది. తొలి టైటిల్ కోసం మొదటి సీజన్ నుంచి నిరీక్షిస్తున్న ఆర్‌సీబీ.. ఈసారి యంగ్ ప్లేయర్ రజత్ పాటిదార్ సారథ్యంలో బరిలోకి దిగుతోంది. ఈసారైనా ట్రోఫీ పట్టాలని విరాట్ కోహ్లీ కసిగా ఉన్నాడు. కాగా, నేటి ఫస్ట్ మ్యాచ్‍కు వాన ముప్పు ఉంది. ఆ వివరాలు ఇక్కడ చూడండి.

కోల్‍కతా, బెంగళూరు మధ్య ఈడెన్ గార్డెన్స్ మైదానంలో నేడు జరిగే ఐపీఎల్ 2025 తొలి మ్యాచ్‍కు వాన ఆటంకాలు కలిగించే అవకాశం ఉంది. శుక్రవారం సాయంత్రం ఇరు జట్ల ప్రాక్టీస్‍ వాన వల్ల గంట మాత్రమే సాధ్యమైంది. ఆ తర్వాత మైదానాన్ని కవర్లతో కప్పేశారు స్టేడియం సిబ్బంది. నేడు మ్యాచ్ సమయంలోనూ ఉరుములతో కూడిన వర్షం పడే అవకాశాలు 70 శాతం వరకు ఉన్నట్టు వాతావరణ రిపోర్టులు పేర్కొంటున్నాయి. దీంతో మ్యాచ్‍కు వర్షం వల్ల ఆటంకాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఉరుములు, మెరుపులు, మోస్తరు వర్షాలు పడతాయని కోల్‍కతా పాటు పశ్చిమ బెంగాల్‍లోని కొన్ని జిల్లాలకు శుక్రవారం, శనివారానికి గాను ఆరెంజ్ అలెర్ట్ కూడా జారీ చేసింది వాతావరణ శాఖ.

ఐపీఎల్ 2025 ఓపెనింగ్ సెర్మనీ సాయంత్రం 6 గంటలకే మొదలుకానుంది. కొందరు బాలీవుడ్ స్టార్లు, మ్యూజిషియన్స్ పర్ఫార్మ్ చేయనున్నారు. 7 గంటలకు టాస్ పడుతుంది. మ్యాచ్ 7.30 గంటలకు మొదలుకావాల్సి ఉంది. వర్షం పడకుండా అంతా సవ్యంగా సాగాలని క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు. ఏం జరుగుతుందోననే ఉత్కంఠ నెలకొంది. మరి వరుణుడు కరుణిస్తాడో.. అడ్డుపడతాడో చూడాలి.

ఐపీఎల్ 2025 తొలి మ్యాచ్ ఒకవేళ వాన వల్ల రద్దైతే కోల్‍కతా, బెంగళూరు జట్లకు చెరో పాయింట్ దక్కుతుంది. గ్రూప్ మ్యాచ్ కావటంతో ఎలాంటి రిజర్వ్ డే ఉండదు. చెరో పాయింట్ వస్తుంది. అయితే, వాన వల్ల రద్దు కాకూడదని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఆటంకాలు ఏర్పడినా మరీ రద్దయ్యే రేంజ్‍లో వాన పడకపోవచ్చు.

కోల్‍కతా ఈడెన్ గార్డెన్స్ పిచ్ బ్యాటింగ్‍కు ఎక్కువగా అనుకూలించనుంది. వర్షం పడకపోయి ఫుల్ మ్యాచ్ జరిగితే ఎక్కువ స్కోర్లే నమోదయ్యే అవకాశం ఉంటుంది. పిచ్ ఫ్లాట్‍గా ఉండి బ్యాటర్లకు అనుకూలిస్తుంది. రెండో బ్యాటింగ్ సమయంలో పొగ మంచు ప్రభావం ఉండొచ్చు.

కోల్‍కతా నైట్‍రైడర్స్ ఈ ఐపీఎల్ 2025 సీనియర్ బ్యాటర్ అజింక్య రహానే సారథ్యంలో ఆడనుంది. గత సీజన్‍లో అద్భుతమైన ఆటతో టైటిల్ పట్టిన కేకేఆర్ జట్టులో ఈ సీజన్‍కు చాలా మార్పులు వచ్చాయి. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్.. పంజాబ్‍కు వెళ్లాడు. 2025 సీజన్ తొలి మ్యాచ్‍లో రన్నరప్ హైదరాబాద్‍తో కాకుండా ఆర్సీబీతో కోల్‍కతా మ్యాచ్‍ను బీసీసీఐ డిసైడ్ చేసింది. కాగా, ఐపీఎల్ ఫస్ట్ ఎడిషన్ 2008 తర్వాత.. సీజన్ ఫస్ట్ మ్యాచ్‍లో కేకేఆర్, బెంగళూరు మళ్లీ ఇప్పుడు తలపడనున్నాయి.

Tags: #Cricket#SportsBCCIIPL 2025T20 Cricket Ipl Ipl 2025
Plugin Install : Subscribe Push Notification need OneSignal plugin to be installed.
Previous Post

Geetha Arts : మల్టీప్లెక్స్ రంగంలోకి గీతా ఆర్ట్స్

Next Post

Shanmukha Movie Review: ‘షణ్ముఖ’ మూవీ రివ్యూ

Related Posts

Pink Power Run 3.0
Big Story

Pink Power Run 3.0: హైదరాబాద్‌లో ఘనంగా పింక్ పవర్ రన్.. వేలాదిగా పాల్గొన్న రన్నర్లు

AndhraPolitics
Andhra Pradesh

AndhraPolitics:విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు.. జగన్-సీపీఐ భేటీపై కొత్త చర్చ

#ManmohanSinghStatue, #ManmohanSingh, #ManmohanSinghNews, #RevanthReddy, #RevanthReddyNews, #Hyderabad, #Gachibowli, #WiproCircle, #Telangana, #TelanganaNews, #FormerPrimeMinister, #ManmohanSinghBirthday, #BharatRatna, #ManmohanSinghBharatRatna, #EconomicReforms, #1991EconomicReforms, #PVNarasimhaRao, #TelanganaFormation, #TelanganaStatehood, #HyderabadIT, #FinancialDistrict, #IndianEconomy, #Congress, #PoliticalNews, #TelanganaPolitics, #HyderabadNews
Big Story

Manmohan Singh Statue: హైదరాబాద్‌లో మాజీ ప్రధాని విగ్రహావిష్కరణ.. మన్మోహన్ సింగ్‌కు భారతరత్న ఇవ్వాలని రేవంత్ డిమాండ్

Rahul Gandhi vs ECI
Big Story

Rahul Gandhi vs ECI: జ్ఞానేష్ కుమార్ రాజీనామా డిమాండ్‌పై కొత్త చర్చ.. SIRపై ఈసీ కీలక ప్రకటన

Aishwarya Sharma, Aishwarya Sharma Photos, Aishwarya Sharma Saree Photos, Aishwarya Sharma Pink Saree, Aishwarya Sharma Drinker Sai, Drinker Sai Heroine, Aishwarya Sharma Telugu Movie, Aishwarya Sharma Latest Photos, Aishwarya Sharma Glamour Photos, Aishwarya Sharma Viral Photos, Aishwarya Sharma Neil Bhatt, Aishwarya Sharma Divorce News, Aishwarya Sharma Bigg Boss 17, Aishwarya Sharma Ghum Hai Kisikey Pyaar Meiin, Telugu Cinema News, Tollywood Latest News
Entertainment

Aishwarya Sharma: గులాబీ చీరలో గుబాళించిన ఐశ్వర్య శర్మ.. ఫొటోలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

Warangal Development
Big Story

Warangal Development: వరంగల్‌పై సీఎం రేవంత్ రెడ్డి స్పెషల్ ఫోకస్.. UGD, ORR, ఎయిర్‌పోర్ట్‌పై కీలక ఆదేశాలు

Next Post
Shanmukha Movie Review: ‘షణ్ముఖ’ మూవీ రివ్యూ

Shanmukha Movie Review: ‘షణ్ముఖ’ మూవీ రివ్యూ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
వాట్సాప్ గవర్నెన్స్

వాట్సాప్ గవర్నెన్స్

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

Inspiration:రైతుబిడ్డ నుంచి ప్రపంచ శాస్త్రవేత్తగా ఎదిగిన ప్రొఫెసర్ ఎన్. సుబ్బారెడ్డి విజయగాథ |

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

ATP:అనంతపురంలో ఫోటోగ్రాఫర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్

BandaruShravani

BandaruShravani:సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల యత్నం? అనంతపురంలో కలకలం

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

Cm Revanth: పర్యాటకం పై సీఎం రేవంత్ రివ్యూలో ఫోకస్

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

గ్రహశకలం నమూనాలు పురాతన నీటి ప్రపంచం ఉనికిని సూచిస్తున్నాయి

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీలో వాట్సాప్ పాలన

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

ఏపీ నూతన డీజీపీగా హరీష్‌ కుమార్‌ గుప్తా నియమితులయ్యారు.

Pink Power Run 3.0

Pink Power Run 3.0: హైదరాబాద్‌లో ఘనంగా పింక్ పవర్ రన్.. వేలాదిగా పాల్గొన్న రన్నర్లు

AndhraPolitics

AndhraPolitics:విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు.. జగన్-సీపీఐ భేటీపై కొత్త చర్చ

#ManmohanSinghStatue, #ManmohanSingh, #ManmohanSinghNews, #RevanthReddy, #RevanthReddyNews, #Hyderabad, #Gachibowli, #WiproCircle, #Telangana, #TelanganaNews, #FormerPrimeMinister, #ManmohanSinghBirthday, #BharatRatna, #ManmohanSinghBharatRatna, #EconomicReforms, #1991EconomicReforms, #PVNarasimhaRao, #TelanganaFormation, #TelanganaStatehood, #HyderabadIT, #FinancialDistrict, #IndianEconomy, #Congress, #PoliticalNews, #TelanganaPolitics, #HyderabadNews

Manmohan Singh Statue: హైదరాబాద్‌లో మాజీ ప్రధాని విగ్రహావిష్కరణ.. మన్మోహన్ సింగ్‌కు భారతరత్న ఇవ్వాలని రేవంత్ డిమాండ్

Rahul Gandhi vs ECI

Rahul Gandhi vs ECI: జ్ఞానేష్ కుమార్ రాజీనామా డిమాండ్‌పై కొత్త చర్చ.. SIRపై ఈసీ కీలక ప్రకటన

Recent News

Facebook Twitter Instagram Youtube Whatsapp

About Us

news7telugu

News7telugu .com is an esteemed news website that provides a wide variety of information in Telugu We are one of the most viewed news websites in Telugu.

Browse by Category

  • Andhra Pradesh
  • Big Story
  • Business
  • Crime
  • Entertainment
  • Health
  • Latest
  • Movie Review
  • National
  • Sports
  • Telangana
  • Uncategorized
  • World

Contact US

Mail: News7telugu@gmail.com

  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions

Follow Us

© Copyright News7Telugu 2025 All rights reserved. Designed, developed and maintained by AS Digital Info