ఇండియా వర్సెస్ పాకిస్తాన్ యుద్ధం సమయంలో… టర్కీ తన వక్ర బుద్ధిని బయట పెట్టిన సంగతి తెలిసిందే. మన శత్రుదేశం అయిన పాకిస్తాన్ కు ఆయుధాలు సప్లై చేసి.. శునకానందం పొందింది. పర్యటక రంగంలో మన ఇండియన్స్ డబ్బులతో బతికిన టర్కీ… ఆయుధాలు మాత్రం పాకిస్తాన్ కు సప్లై చేసి కొత్త కుట్రలకు తెరలేపింది. అయితే ఈ నేపథ్యంలోనే టర్కీ పై ఆంక్షలు విధిస్తోంది భారత ప్రభుత్వం. ఇప్పటికే ఆపిల్స్, ఇతర ప్రోడక్ట్ లపై ఆంక్షలు విధిస్తున్నారు.ఇక తాజాగా టర్కీ దేశానికి మరో ఊహించని షాక్ ఇచ్చింది భారత ప్రభుత్వం. దేశంలోని విమానాశ్రయాల్లో సర్వీస్ ప్రొవైడర్‌గా ఉన్న టర్కీకి చెందిన సెలెబీ సంస్థ సెక్యూరిటీ క్లియరెన్స్ రద్దు చేసింది కేంద్రం. ఈ రద్దు తక్షణం అమల్లోకి వస్తుందని పేర్కొంది. సెలబీకి 2022 నవంబర్ 21న అనుమతులు ఇచ్చింది BCAS.
అటు తాజాగా టర్కీని భూకంపం వణికించింది. కొనియా ప్రావిన్స్ లోని కులు జిల్లా కేంద్రానికి 14 కిలోమీటర్ల దూరంలో భూమి ఒక్కసారిగా కనిపించినట్లు చెబుతున్నారు. రిక్టర్ స్కేల్ పై దీని తీవ్రత 5.2 గా ఉన్నట్లు.. అధికారులు గుర్తించారు. రాజధాని అంకారాతో పాటు సమీప నగరాల్లో కూడా భూకంపం వచ్చింది. దీంతో కొన్ని ప్రాంతాల్లో ప్రజలు భయంతో… ఇల్లు అలాగే ఆఫీసులో నుంచి బయటకు వచ్చి పరుగులు పెట్టారు… ఇక ఈ భూకంపం నేపథ్యంలో ఎలాంటి ఆస్తి అలాగే ప్రాణం నష్టం లేదని తెలుస్తోంది.ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) పేరుతో పాకిస్థాన్‌లోని ఉగ్రశిబిరాలపై భారత సైన్యం దాడి చేసింది. అందుకు ప్రతిగా పాకిస్థాన్ (Pakistan) కూడా భారత్‌పై దాడులకు దిగింది. టర్కీ (Turkey) పంపించిన డ్రోన్లు, మిస్సైల్స్, యుద్ధ వాహక నౌకను కూడా వినియోగించి భారత్‌పై దాడులు చేసింది. చేసిన సహాయాన్ని మరచి శుత్రదేశానికి సహాయం చేసిన టర్కీపై భారతీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ దేశ వస్తువులను బహిష్కరించాలని నిర్ణయించుకున్నారు. టర్కీతో పాటు పాక్‌కు మద్ధతుగా నిలిచిన అజార్ బైజాన్ (Azerbaijan)పై కూడా ఆగ్రహంగా ఉన్నారు.
టర్కీ, అజార్ బైజాన్ దేశాలకు భారత్ నుంచి భారీ సంఖ్యలో టూరిస్ట్‌లు వెళుతుంటారు. బాయ్‌కాట్ టర్కీ (Boycott Turkey), అజార్ బైజాన్ ట్రెండ్స్ వైరల్ కావడంతో గత వారంలోనే 60 శాతం శాతం బుకింగ్స్ క్యాన్సిల్ అయ్యాయి. కాగా, టర్కీ, భారత్ మధ్య భారీ సంఖ్యలో ఎగుమతులు, దిగుమతులు జరుగుతుంటాయి. రెండు దేశాల మధ్య వాణిజ్యం స్థంభించిపోతే కొన్ని వస్తువులు రేట్లు పెరిగే అవకాశం ఉంది. అవేంటో ఒకసారి పరిశీలిద్దాం..మన దేశం దిగుమతి చేసుకునే మార్బుల్స్‌లో 70 శాతం టర్కీ నుంచే వస్తాయి. అలాగే ప్రతి ఏటా 1.29 లక్షల టన్నుల యాపిల్స్‌ను కూడా భారత్ దిగుమతి చేసుకుంటుంది. ఒకవేళ దిగుమతులు ఆగిపోతే వీటి రేటు అమాంతం పెరిగిపోయే ఛాన్స్ ఉంది. అలాగే టర్కీ నుంచి భారత్ కార్పెట్స్, అలంకరణ సామాగ్రి, డ్రైఫ్రూట్స్, ఫర్నిచర్, సిల్క్, లెనిన్, ఆలివ్ ఆయిల్, చెర్రీస్, హెర్బల్ డ్రింక్‌లు, ఇండస్ట్రియల్ మెషినరీ, వ్యవసాయ సామాగ్రిని కూడా దిగుమతి చేసుకుంటుంది.
ఇక, టర్కీ డిషెస్‌కు భారత్‌లో మంచి డిమాండ్ ఉంది. టర్కిష్ టీతో పాటు, కునాఫా, టర్కిష్ కబాబ్స్, షవర్మా వంటి డిషెస్ మన దేశంలో చాలా పాపులర్. బాయ్‌కాట్ టర్కీ ట్రెండ్ ఊపందుకుంటే వీటి రేట్లు భారీగా పెరిగే అవకాశం కనబడుతోంది. ఇక, టర్కీ, అజర్ బైజాన్ దేశాలపై ఆసక్తి కోల్పోతున్న ఇండియన్ టూరిస్ట్‌లు జార్జియా, సెర్చియా, గ్రీస్, వియత్నాం, థాయ్‌లాండ్ వంటి దేశాలకు వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారట.